Tag Archives: kamareddy

అక్టోబర్‌ 2న నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2 న అన్ని చికెన్‌, మాంసం దుకాణాలు, చేపల మార్కెట్‌ మూసివేయవలసినదిగా కామారెడ్డి మునిసిపల్‌ కమీషనర్‌ దేవేందర్‌ శనివారం ఒక ప్రకటనలో దుకాణదారులకు విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు దుకాణాదారులు తాకీదులు జారీచేశామని, ఉల్లంఘించిన వారిపై చట్టరీత్య తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read More »

జైలు బెయిలు

అరెస్టు చేసి విచారణ కాలంలో సుదీర్ఘకాలం జైలులో ఉంచడం కచ్చితంగా హక్కుల ఉల్లఘన అవుతుంది. గతంలో జగన్‌ కావచ్చు ఇప్పుడు చంద్రబాబు కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు. ఇక్కడ రాజకీయ నాయకుల అవినీతిని సమర్థించలేం. అవినీతికి పాల్పడిన వ్యక్తుల పట్ల ఉదాసీనతని సహించలేం. చట్టపరిధిలో కేసులు నమోదు చేసి నిష్పాక్షిక విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అయితే అవినీతి కేసులు నమోదు చేసిన దర్యాప్తు సంస్థలు విచారణ పూర్తి చేసి …

Read More »

మైనార్టీ మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీ మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సత్య గార్డెన్‌లో గురువారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సహకారంతో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మైనార్టీ మహిళలు భర్తకు చేదోడు వాదోడుగా ఆర్థికంగా ఎదగాలనే …

Read More »

వ్యాధి బారిన పడకుండా టీకాలు వేయించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెంపుడు జంతువులు రాబిస్‌ వ్యాధిని పడకుండా తప్పకుండ ర్యాబిస్‌ టీకాలు వేయించవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. లూయిస్‌ పాశ్చర్‌ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 28 న ప్రపంచ రాబిస్‌ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు జిల్లా పశు వైద్య అధికారి సింహ రావు తో కలిసి రేబిస్‌ …

Read More »

వినాయక నిమజ్జనంలో అపశృతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనం ఉత్సవాల్లో పాల్గొన్న ఓ వ్యక్తి ఆకస్మికంగా మరణించారు. స్థానికంగా రెబల్‌ స్టార్‌ గణేష్‌ మండలి ఏర్పాటు చేశారు. అక్కడ ప్రతిష్టించిన వినాయకుని నిమజ్జనం చేయడానికి వెళుతుండగా బుధవారం ఉదయం నరేష్‌ (35) అనే యువకుడు డిజె సౌండ్‌ భరించలేక …

Read More »

జనహిత గణేష్‌ మండలి లడ్డూ వేలం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత గణేష్‌ మండలి గణపతి లడ్డు కు బుధవారం వేలంపాట నిర్వహించారు.రూ.5000 నుంచి 13 మంది వ్యక్తులు లడ్డూను దక్కించుకోవడానికి పోటీపడ్డారు. చివరకు టీఎన్జీవోస్‌ కార్యదర్శి బి. సాయిలు వేలంపాడి రూ.29116 లడ్డును దక్కించుకున్నారు. సాయిలును జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అభినందించారు. జనహిత గణేష్‌ మండలి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీల్లో …

Read More »

వంద శాతం ఇంటిపన్ను వసూలు చేపట్టాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటి పన్నులు ఈ నెల 30లోగా వందశాతం వసూలు చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మను చౌదరి అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండల స్థాయి పంచాయతీ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు రాకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. గ్రామాల్లోని …

Read More »

కామారెడ్డిలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్రోద్యమ సాధనలో , తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో కొండ లక్ష్మణ్‌ బాపూజీ కృషి చేశారని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆచార్య కొండ లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి జిల్లా …

Read More »

ప్రజాస్వామ్యంలో ఓటరుకు సర్వోన్నత స్థానముంది

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితాలో తప్పొప్పులు సరిచేసి అర్హులైన ఓటర్లను నమోదు చేసి మరింత మెరుగ్గా, పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించదానికే నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు తీసుకోవడానికే గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో వివిధ రాజకీయ పార్టల ప్రతినిధులతో …

Read More »

పోలీసులకు చిక్కిన అంతరాష్ట్ర నేరస్తుడు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒక హత్య కేసుతో పాటు రెండు రాబరీ కేసులలో నిందితునిగా ఉంటూ జైలు నుంచి పెరోల్‌ పై బయటకు వచ్చి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతూ బైకు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర నేరస్తున్ని కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడారు. మహారాష్ట్రకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »