కామారెడ్డి, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జెడ్.చోంగ్తు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ మను చౌదరి లతో కలిసి పెద్దకొడపగల్ మండలం జగన్నాధ్పల్లి లోని 163 వ పోలింగ్ కేంద్రాన్ని, ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్‌లోని 229 …
Read More »పోరాట యోధురాలు ఐలమ్మ
కామారెడ్డి, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని, ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ అన్నారు. చాకలి ఐలమ్మ 128 వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం సమీపంలో ఉన్న ఐలమ్మ విగ్రహానికి వివిధ సంఘాల నాయకులతో …
Read More »ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు ముమ్మరం చేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల సన్నద్ధతలో భాగంగా చేపడుతున్న ఏర్పాట్లను మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఎన్నికల నిర్వహణ అంశాలపై సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఓటరు నమోదు, మార్పులు-చేర్పులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, తుది ఓటరు జాబితా రూపకల్పన, …
Read More »ప్రజావాణి దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 72 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. ఆర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ …
Read More »రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలలో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రశంస పత్రాలు అందజేశారు. కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని 2007లో ప్రారంభించడం జరిగిందని నాడు 78 మందితో ప్రారంభించిన సమూహం నేడు 3వేల పైగా రక్తదాతలతో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిలో …
Read More »లబ్దిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం నిరుపేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వడంతో సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు. గృహ లక్ష్మీ పథకం కింద లబ్ధిదారులు గృహాలను నిర్మించుకోవాలని …
Read More »అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని కామారెడ్డి లో గల గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్, హిస్టరీ, బోటని బోధించేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నపూర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 లోపు దరఖాస్తులను సమర్పించాలని కోరారు. పిజీలో 55 శాతం, నెట్ లేదా సెట్ పాస్ …
Read More »ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకమైనది
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమైనదని, ఓటరుగా నమోదయిన ప్రతి ఒక్కరు నైతిక బాధ్యతగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం కామారెడ్డి ప్రభుత్వం డిగ్రీ కళాశాలలోని ఆడిటోరియంలో ఓటు హక్కు పై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ప్రతి ఓటు కీలకమైనదని, ఒక్క ఓటు గెలుపు ఓటములు నిర్ణయించే …
Read More »తక్షణమే వివరాలు అందజేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత శాసనసభ, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలు, మద్యం అమ్మకాల వివరాలు ప్రస్తుతం ఆరు మాసాలలో జరిగిన బ్యాంకు లావాదేవీలు, మద్యం అమ్మకాల వివరాలు రేపటిలోగా అందజేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన …
Read More »దివ్యాంగులపై వివక్ష చూపితే చర్యలు
కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులపై వివక్ష చూపిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం దివ్యాంగుల హక్కుల చట్టం 2016 పై దివ్యాంగుల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. దివ్యాంగులను గౌరవించే విధంగా ప్రభుత్వ కార్యాలయాలలో బోర్డులు ఏర్పాటు చేసే విధంగా చూడాలని తెలిపారు. అర్హత …
Read More »