నిజామాబాద్, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో తూకం జరిపించి, నిర్ణీత రైస్ మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. మాక్లూర్ మండలంలోని మాదాపూర్, మాక్లూర్ లలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా …
Read More »రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మాక్లూర్, మే 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం సాయంత్రం డీకంపల్లి గ్రామానికి చెందిన గౌరీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే… డీకంపల్లి గ్రామానికి చెందిన సాయినాథ్ అతని భార్య గౌరీ (39) బైక్‌పై బోధన్ బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో గొట్టిముక్కల గ్రామం దాటిన తర్వాత బీటీ రోడ్డు మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం డీ …
Read More »ఆధార్ తరహాలో భూదార్ సంఖ్య కేటాయింపు
నిజామాబాద్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి (ఆర్.ఓ.ఆర్ – 2025) నూతన చట్టం ద్వారా భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఆధార్ తరహాలోనే భూ కమతాలకు భూదార్ నెంబర్లను కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిర్దిష్ట గడువులోపు భూ సమస్యలు పరిష్కారం అయ్యేందుకు ఈ చట్టం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. నిజామాబాద్ జిల్లా …
Read More »ఉచిత గాలికుంటు టీకాలు
మాక్లూర్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మక్లూర్ మండలం మదన్ పల్లి గ్రామంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు పంపిణీ కార్యక్రమాన్ని పశు వైద్యులు డాక్టర్ కిరణ్ దేశ్పాండే నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పశువులకు గాలికుంటు వ్యాధి సమూలంగా నిర్మూలించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధి సోకిన పశువులకు మొదట తీవ్రజ్వరం …
Read More »మాక్లూర్ ఠాణా సందర్శించిన సిపి
మాక్లూర్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాక్లూర్ పోలీస్ స్టేషన్‌ను గురువారం సందర్శించారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ అదేవిధంగా సిబ్బంది పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడి తగు సూచనలు చేశారు. నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, మాక్లూర్ ఎస్‌ఐ రాజశేఖర్ ఉన్నారు.
Read More »పీ.హెచ్.సీని తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రమైన మాక్లూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలియాతండాలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి …
Read More »జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
మాక్లూర్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలో సీనియర్ జర్నలిస్ట్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. సీనియర్ జర్నలిస్టుగా పేరుపొందిన లక్ష్మీనారాయణ హఠాత్ మరణం చెందడంతో వారి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం మండల వ్యాప్తంగా మరికొందరి కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో మీడియా మిత్రులు మాక్లూర్ మండల …
Read More »బిసి గురుకుల పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవం
నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బిసి బాలికల గురుకుల పాఠశాల, దాస్‌నగర్‌లో ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్‌తో ఉపాధ్యాయులందరికీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు స్వప్న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాశస్త్యాన్ని వివరించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పలు సూచనలు చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని …
Read More »బిజెపి మండల అధ్యక్షురాలిగా గంగోని మదారి మమత
మాక్లూర్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన గంగోని మదారి మమత బిజెపి మండల అధ్యక్షురాలిగా నియామకం అయ్యారు. ఈ సందర్బంగా గంగోని మదారి మమత మాట్లాడుతూ బిజెపి పార్టీ సంస్థగత నిర్మాణంలో భాగంగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని మండలాలకు బిజెపి పార్టీ నూతన అధ్యక్షులను నియమించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగా మాక్లూర్ మండల …
Read More »సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణి
మాక్లూర్, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలంలో కాంగ్రెస్ పార్టి నాయకులు నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ఆదేశాననుసారంగా చిక్లి గ్రామంలో సిఎంఆర్‌ఎఫ్ చెక్కులు నక్క నరేష్, చెక్క సవిత, నీరటి రాజుభాయ్, తల్వేద లక్ష్మి, దూడ రాజేశ్వర్ లకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి ప్రకాష్ బూరొల్ల అశోక్, ఉపాధ్యక్షులు గుండారం శేఖర్, అమెక్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, …
Read More »