Tag Archives: minister prashanth reddy

గాంధీ స్ఫూర్తిని కెసిఆర్‌ కొనసాగించారు…

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహింస మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గాంధీజీ అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని తెలిపారు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా …

Read More »

బస్తీ దవాఖాన ప్రారంభించిన మంత్రి

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం బస్తి దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఎస్సీ వాడలో మంగళవారం బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో జిల్లాస్థాయిలో మొదటి బస్తి దవాఖానాను కామారెడ్డిలో ఏర్పాటు చేసినట్లు …

Read More »

వజ్రోత్సవ వేడుకలు ప్రారంభించిన మంత్రి

నిజామాబాద్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డెబ్భై ఐదవ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా స్థాయిలో చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలు మంగళవారం అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ఘనంగా ప్రారంభం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై …

Read More »

కామన్‌ వెల్త్‌ క్రీడల్లో నిజామాబాద్‌ బిడ్డ హుస్సాముద్దీన్‌కు కాంస్య పతకం

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామన్‌ వెల్త్‌ క్రీడల్లో నిజామాబాద్‌కు చెందిన మరో బిడ్డ సుబేదార్‌ హుస్సాముద్దీన్‌ పురుషుల 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి క్రీడాకారుల పుట్టినిల్లు నిజామాబాద్‌ గడ్డ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. నిజామాబాద్‌ జిల్లా, తెలంగాణ కీర్తిని …

Read More »

నిజామాబాద్‌ బిడ్డ గెలుపు యావత్‌ దేశానికి గర్వ కారణం

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో ఉమెన్స్‌ బాక్సింగ్‌ 50 కేజీల విభాగంలో నిజామాబాద్‌ బిడ్డ నిఖత్‌ జరీన్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్‌, నేడు ఎంతో ప్రతిష్టాత్మకమైన కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో ఐర్లాండ్‌కు చెందిన పగిలిస్ట్‌ను …

Read More »

బిల్లులు రాలేదని సర్పంచ్‌ భర్త ఆత్మహత్య

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ధి చేయాలని గ్రామ సర్పంచ్‌ భర్త అప్పులతో అభివృద్ధి చేసి ఇబ్బందుల్లో పడ్డారు. చేసిన పనులకు బిల్లులు రాక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్వంత మండలం వేల్పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం పడిగెల వడ్డెర కాలనీ సర్పంచ్‌ బలవన్మరణం పొందాడు. …

Read More »

పంట ముంపునకు గురైన ప్రాంతాలు పరిశీలించిన మంత్రి

నిజామాబాద్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉదృతంగా ప్రవహించి పంట ముంపుకు గురయిన ప్రాంతాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి గారు క్షేత్ర స్థాయిలో సోమవారం పరిశీలించారు. గ్రామస్థులు, రైతులతో మాట్లాడారు. పంట నష్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధిక వరదల నేపథ్యంలో పంట పొలాల్లో ఇసుక మేటలు …

Read More »

మళ్ళీ వస్తే అప్రమత్తంగా ఉండాలి

వేల్పూర్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు,నాయకులతో శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వేల్పూర్‌ లోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశ మయ్యారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలకు తమ తమ గ్రామాల్లో దెబ్బతిన్న చెరువులు, పంచాయితీ రాజ్‌ మరియు ఆర్‌అండ్‌బి పరిధిలోని రోడ్లు,బ్రిడ్జిలు, కల్వర్టులు …

Read More »

పునరావాస కేంద్రాలను సందర్శించిన మంత్రి వేముల

నిజామాబాద్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు జలమయంగా మారిన నిజామాబాద్‌ నగరంలోని లోతట్టు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలను రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి గురువారం సందర్శించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్‌ నీతూకిరణ్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి …

Read More »

అధికారులందరూ కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలి

నిజామాబాద్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నాలుగు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆదేశించారు. బుధవారం రాత్రి నిజామాబాద్‌ కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో ఆయన కలెక్టర్‌ సి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »