Tag Archives: MLC elections

బీజెపీ గెలుపు… న్యాయవాదుల సంబరాలు …

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరీంనగర్‌, నిజామాబాద్‌, అదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల ఉపాధ్యాయ నియోజవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజెపీ అభ్యర్థి మల్కా కొమురయ్య, పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్ని అంజిరెడ్డి గెలుపొందిన నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లా బీజేపీ లీగల్‌ సెల్‌, న్యాయవాద పరిషత్‌ ఆధ్వర్యంలో జిల్లాకోర్టు చౌరస్తాలో టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు …

Read More »

బిజెపి సంబరాలు

జక్రాన్‌పల్లి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి అభ్యర్థులైన టీచర్స్‌ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య, గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ చిన్నమలై అంజి రెడ్డి ఉమ్మడి మెదక్‌ నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కన్నెపల్లి ప్రసాద్‌ ఆధ్వర్యంలో మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున విజయోత్సవ …

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాలతో కూడిన కరీంనగర్‌ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో నిజామాబాద్‌ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సుభాష్‌ నగర్‌ లో గల ఎస్‌.ఎఫ్‌.ఎస్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ స్టేషన్‌ నెం 122 లో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఓటు …

Read More »

పోలింగ్‌ మెటీరియల్‌ను భద్రంగా తీసుకెళ్లాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏం.ఎల్‌.సి. ఎన్నికలు సజావుగా ఎన్నికల నిబంధనల మేరకు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ బుధవారం సందర్శించారు. ఈ నెల 27 న జరుగనున్న మెదక్‌ నిజామాబాద్‌ ఆదిలాబాద్‌ కరీంనగర్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజక వర్గాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. 8 రూట్లలో 54 పోలింగ్‌ …

Read More »

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాలతో కూడిన కరీంనగర్‌ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్‌ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ ను నిజామాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు. నిజామాబాద్‌ డివిజన్‌ కు సంబంధించి నిజామాబాద్‌ ఆర్డీఓ …

Read More »

94 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ నిజామాబాద్‌ ఆదిలాబాద్‌ కరీంనగర్‌ పట్టభద్రుల నియోజక వర్గం కామారెడ్డి కలెక్టరేట్‌ లో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటెషన్‌ కేంద్రంలో 94 మంది తమ ఓటు హక్కు వినియోగించు కున్నారని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం జిల్లాలో 126 మంది దరఖాస్తు చేసుకోగా రెండు రోజుల వ్యవధిలో 94 మంది తమ …

Read More »

బిజెపి అభ్యర్థిని గెలిపించాలి…

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంఎల్‌సి ఎన్నికల్లో భాగంగా జాక్రన్పల్లి మండలంలో తొర్లికొండ, బ్రాహ్మణపల్లిలో ఎన్నికల ప్రచారంలో టీచర్స్‌, గ్రాడ్యుయేట్స్‌ని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్‌ కులాచారి కలిశారు. ఎంఎల్‌సి బిజెపి అభ్యర్థికి ఓటు వేసి బారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేవైఎం నిజామాబాద్‌ జిల్లా ఉపాద్యక్షులు వంశీ గౌడ్‌ రత్నగారి, మండల్‌ అధ్యక్షులు ప్రసాద్‌ కన్నెపల్లి, వంశీ గౌడ్‌, వేంపల్లి శ్రీనివాస్‌ …

Read More »

ఎమ్మెల్సీ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 27న జరిగే శాసన మండలి ఎన్నికల పోలింగ్‌ కోసం నిజామాబాద్‌ జిల్లాలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. శాసనమండలి పట్టభద్రుల నియోజవర్గానికి సంబంధించి జిల్లాలో 31,571 మంది ఓటర్లు …

Read More »

పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ విధులు కేటాయించబడిన ఉద్యోగులు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్‌.ఐ.సీ హాల్‌ లో ఓటరు ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు …

Read More »

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను కలెక్టర్‌ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »