Tag Archives: morthad

వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

మోర్తాడ్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో ఆదివారం రోజున 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మోర్తాడ్‌ మండల కేంద్రంలోని తహసిల్దార్‌ కార్యాలయంలో తహసిల్దార్‌ శ్రీధర్‌, మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్‌, స్థానిక గ్రామ సచివాలయంలో సర్పంచ్‌ భోగ ధరణి ఆనంద్‌ జాతీయ …

Read More »

రుణాలు సకాలంలో చెల్లించాలి

మోర్తాడ్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని ఆయా గ్రామాలలో గల డ్వాక్రా మహిళా గ్రూపుల సభ్యులు ఆయా బ్యాంకులలో తీసుకున్న రుణాలను సకాలంలో సక్రమంగా కట్టాలని ఐకెపి సిసి శ్రీనివాస్‌ కోరారు. శుక్రవారం మోర్తాడ్‌ మండలం శెట్పల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు, నాబార్డ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహిళా అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. మహిళా గ్రూప్‌ సభ్యులు తీసుకున్న వివిధ …

Read More »

భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు

మోర్తాడ్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌, ఏర్గట్ల, కమ్మర్‌పల్లి మండలాలలోని వివిధ గ్రామాలలో శుక్రవారం నాగుల పంచమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, పిల్లలు అనేక మంది భక్తులు ఆయా గ్రామాలలోని పాముల పుట్టల వద్దకు ఉదయం పూట వెళ్లి భక్తిశ్రద్ధలతో పాలు పోసి నాగమ్మను పూజించారు.

Read More »

టియుఎఫ్‌ గల్ఫ్‌ కార్మికుల రాష్ట్ర కన్వీనర్‌గా చాంద్‌ పాష

మోర్తాడ్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గల్ఫ్‌ కార్మికుల రాష్ట్ర కార్యదర్శిగా జగిత్యాలకు చెందిన చాంద్‌ పాషాను నియమిస్తూ రాష్ట్ర సంఘం చైర్మన్‌ డాక్టర్‌ చీమ శ్రీనివాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విస్తరణకై దృష్టి సారించాలని ఉద్యమకారుల కొరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు కొరకు నిరంతరకృషి చేయాలని రాష్ట్ర చైర్మన్‌ ఆదేశించారని చాంద్‌ పాషా …

Read More »

ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ

మోర్తాడ్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం పాలెం ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తుంది. ఈ యేడాదికి సంబంధించి గురువారం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఉచిత పాఠ్యపుస్తకాలను మోర్తాడ్‌ మండల వైస్‌ ఎంపీపీ తోఘాటి శ్రీనివాస్‌, పాలెం గ్రామ సర్పంచ్‌ ఏనుగు సంతోష్‌ …

Read More »

పిఆర్‌టియు సభ్యత్వ నమోదు

మోర్తాడ్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామం ప్రాథమిక పాఠశాలలో బుధవారం పిఆర్‌టియు టిఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్టు పిఆర్‌టియు మండల అధ్యక్షుడు మగ్గిడి ప్రవీణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శంకర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళుతూ పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, పిఆర్‌టియు టిఎస్‌ కృషి వల్లనే పిఆర్‌సి అమలు …

Read More »

రేషన్‌ కార్డుల పంపిణీ

మోర్తాడ్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కొత్త రేషన్‌ కార్డులను సోమవారం పంపిణీ చేశారు. మోర్తాడ్‌ మండలంలోని పది గ్రామాలకు గాను మొత్తం 422 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరై వచ్చిన కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మోర్తాడ్‌ తహసీల్దార్‌ శ్రీధర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ …

Read More »

దెబ్బతిన్న పంటలు పరిశీలించిన కిసాన్‌ మోర్చా నాయకులు

మోర్తాడ్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో దెబ్బతిన్న వరి పొలాలు, సొయా, పసుపు పంటలను నిజామాబాద్‌ జిల్లా భారతీయ జనతా కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా బీజేపీ కిసాన్‌ మోర్చా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ భారీ వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ఎకరాకి 25 వేల రూపాయల …

Read More »

పొంగిన వాగులు చెరువులు… తెగిన రోడ్లు

మోర్తాడ్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల కేంద్రంలోని ముసలమ్మ చెరువు నిండుకుండలా నిండి అలుగు పారుతుంది. ఆర్మూరు సబ్‌ డివిజన్‌లోని గ్రామాలలో గల అతి పెద్ద చెరువు అయిన ముసలమ్మ చెరువు గత కొన్ని సంవత్సరాల నుండి పూర్తి స్థాయిలో వర్షాలు కురవక ఇప్పటివరకు చెరువు అలుగు పారలేదు. గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువు నిండుకుండలా …

Read More »

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

మోర్తాడ్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల కేంద్రంలోని టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ఆవరణలో మంగళవారం పార్టీ నాయకులు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు 10 లక్షల 29 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమ గోడు విన్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి రాష్ట్ర …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »