Tag Archives: MP arvind darmapuri

ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్‌

నిజామాబాద్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికలలో చివరి అంకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిజామాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంటు నియోజకవర్గంలోని ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్లను డిచ్పల్లి మండలం నడిపల్లిలోని సీఎంసీ కళాశాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ మంగళవారం లెక్కింపు జరిపారు. రిటర్నింగ్‌ అధికారి, …

Read More »

ఎంపీ అరవింద్‌ సమక్షంలో బీజేపీలోకి

ఎడపల్లి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని జమ్లం గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్‌ సర్పంచ్‌ గొడుగు రాజ్యలక్ష్మి హన్మంతు దంపతులు హైదరాబాద్‌లో నిజామాబాదు ఎంపీ అరవింద్‌ సమక్షంలో శుక్రవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. సర్పంచ్‌ గొడుగు రాజ్యలక్ష్మి హన్మంతు దంపతులు బోధన్‌ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి, వడ్డీ మోహన్‌ రెడ్డిల ఆధ్వర్యంలో బీజేపీలో చేరగా, పార్టీలో చేరిన వారికి ఎంపీ అరవింద్‌ …

Read More »

ఎంపి సమక్షంలో బిజెపిలోకి…

ఎడపల్లి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం జాన్కంపేట్‌ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్‌ సర్పంచ్‌ పొట్టోళ్ల సాయిలు, ఉపసర్పంచ్‌ వెల్మల విజయ్‌ కుమార్‌ నిజామాబాదు ఎంపీ అరవింద్‌ సమక్షంలో భారతీయ జనతాపార్టీలో చేరారు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌తో పాటు పలువురు గ్రామ యువకులు, మైనార్టీ యువకులు బోధన్‌ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి, వడ్డీ మోహన్‌ రెడ్డిల ఆధ్వర్యంలో బీజేపీలో చేరగా, పార్టీలో చేరిన …

Read More »

సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా ఎంపీ అర్వింద్‌

నిజామాబాద్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు అర్వింద్‌ ధర్మపురి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి బోర్డు సభ్యులుగా లోక్‌సభ ఎంపీలు అర్వింద్‌ ధర్మపురి, బాలశౌరి వల్లభనేనిలు ఎన్నికైనట్లు పార్లమెంట్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ సభ్యునిగా ఎన్నికైన 8 నెలల కాలంలోనే మోడీ ప్రభుత్వం నిజామాబాద్‌ కేంద్రంగా రీజినల్‌ ఆఫీస్‌ …

Read More »

ఎంపి అరవింద్‌పై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ పొలిటీషియన్‌ కాదు పొల్యూషన్‌ అని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌ నగరంలోని తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అరవింద్‌ అడ్డగోలు చేష్టలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న దుష్టుడు అని మండిపడ్డారు. కేసీఆర్‌ది ఫైటర్స్‌ ఫ్యామిలీ అని, …

Read More »

నిర్ణీత గడువులోపు అభివృద్ధి పనులు పూర్తి చేయించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయించేందుకు అధికారులు పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపీ అర్వింద్‌ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా …

Read More »

కేంద్ర నిధులతో అమలవుతున్న పథకాల వివరాలు పక్కాగా అందించాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల వివరాలను పూర్తి స్థాయి గణాంకాలతో పక్కాగా అందించాలని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో ఎం.పీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, …

Read More »

మృత్యుంజయ హోమంలో పాల్గొన్న ఎంపి

కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్యసమాజ్‌లో ప్రధాని ఆరోగ్యం బాగుండాలని బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన మృత్యుంజయ హోమం కార్యక్రమంలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏడున్నర సంవత్సరాల్లో దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ అని, అలాంటి వ్యక్తిని నడిరోడ్డుపై 20 నిమిషాల పాటు ఉంచిన ఘటనపై అక్కడి …

Read More »

ఎంపిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

ఆర్మూర్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌పై పోలీస్‌ స్టేషన్‌లో టిఆర్‌ఎస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన అనుచిత వ్యాఖ్యలు చేసి కేసీఆర్‌ అభిమానులను రెచ్చగొట్టి తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించాలని కుట్ర చేస్తున్న ఎంపీ అరవింద్‌ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆర్మూర్‌ మండల, పట్టణ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »