Tag Archives: nandipet

పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించడమే పల్లె ప్రగతి లక్ష్యం

నందిపేట్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించాలనే లక్ష్యంతో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తున్నామని నందిపేట్‌ మండల పంచాయతీ అధికారి కిరణ్‌ కుమార్‌ అన్నారు. గురువారం గ్రామ కార్యదర్శి సాయి కుమార్‌తో కలిసి మండల కార్యాలయం వద్ద చేస్తున్న శుభ్రత పనులను పరిశీలించారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత, రైతు వేదిక, షాదీఖాన ఆవరణంలో మొక్కలు నాటుతున్నామన్నారు. మండల …

Read More »

రేవంత్‌ రెడ్డి కాదు – రవ్వంత రెడ్డి

నందిపేట్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేవలం టిఆర్‌ఎస్‌ ద్వారానే సాధ్యమని, కొత్త బిచ్చ గాళ్ల ఆటలు సాగవని ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పియూసి చైర్మన్‌ జీవన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. నందిపేట్‌ మండలంలోని సిద్దాపూర్‌ గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముందు చూపుతో రాష్ట్రాన్ని అన్ని …

Read More »

అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరిన నేతలు

నందిపేట్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పియూసి చైర్మన్‌ జీవన్‌ రెడ్డిని నందిపేట్‌ టిఆర్‌ఎస్‌ నాయకులు కోరారు. నాయకులు శుక్రవారం హైదరాబాద్‌ వెళ్లి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. వివిధ గ్రామాల మధ్య లింక్‌ రోడ్డులను చేపట్టాలని కోరారు. అదేవిధంగా నందిపేట గ్రామంలోని ఆర్మూర్‌ బైపాస్‌ రోడ్డును పంచాయతీరాజ్‌ నుండి ఆర్‌ అండ్‌ బి …

Read More »

మస్జిద్‌ పునర్‌ నిర్మాణానికి సహకరించండి

నందిపేట్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని రాజ్‌ నగర్‌ దుబ్బాలో గల పురాతన రహమానియా మజీద్‌ పునర్నిర్మాణము కొరకు దాతలు అందరూ సహృదయంతో ముందుకొచ్చి సహకారం అందించాలని రహమానియా మజీద్‌ అధ్యక్షులు షేక్‌ రియాజ్‌ కోరారు. ఇప్పటివరకు దాతల సహకారంతో 8 లక్షల వరకు ఖర్చు చేసి పిల్లర్స్‌ వరకు పని పూర్తి చేశామన్నారు. మస్జిద్‌ శిథిలావస్థకు వచ్చినందున కాలనీ వాసులందరి …

Read More »

గ్రామాల రూపురేఖలు మార్చడానికే హరితహారం

నందిపేట్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో గ్రామల రూపురేఖలు మార్చుకునే లక్ష్యంతో పల్లె ప్రగతి – హరిత హారం కార్యక్రమం కొనసాగుతుందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పియూసి చైర్మన్‌ జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. పది రోజుల పాటు జరగనున్న ఏడో విడత హరితహారం – పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నందిపేట్‌ మండలంలోని లక్కంపల్లి గ్రామంలో మంగళవారం పాల్గొని మొక్కలు నాటి హరితహారం కార్యక్రమములో ప్రజలందరూ …

Read More »

దళిత సాధికారిత పథకం దేశంలోనే నంబర్‌ వన్‌

నందిపేట్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత సాధికారిత పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నందిపేట్‌ మండల కేంద్రంలోని అంబెడ్కర్‌ విగ్రహం వద్ద శుక్రవారం దళిత సంఘాల నాయకులు సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా …

Read More »

ఏడో విడత హరితహారం ప్రారంభించిన సర్పంచులు

నందిపేట్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని గ్రామాలలో ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచుల అధ్యక్షతన గురువారం ప్రారంభమయింది. గ్రామాల్లో ఇది వరకె ఉపాధి కూలీల ద్వారా తవ్వించి సిద్ధంగా ఉంచిన గుంతలలో ప్రజా ప్రతినిధులు అధికారులు మొక్కలు నాటి నీరుపోశారు. డొంకేశ్వర్‌ గ్రామ సర్పంచ్‌ ఛాయా చందు, ఎంపిటిసి శ్రీకాంత్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలను …

Read More »

ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌ షిప్‌ విద్యార్థులకు సన్మానం

నందిపేట్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వెల్మల్‌లో 2020- 21 సంవత్సరానికి నేషనల్‌ మీన్‌ మెరిట్‌ స్కాలర్షిప్‌కు ఎంపికైన విద్యార్థులు వి. వైష్ణవి, సాయి స్వరూప్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి సర్పంచ్‌ మచ్చర్ల సాయమ్మ గంగారం, ఉప సర్పంచ్‌ ముప్పెడ నారాయణ, వైస్‌ ఎంపీపీ దేవేందర్‌, పాఠశాల ఎస్‌ఎంసి చైర్మన్‌ అల్లెం నాగేష్‌, విడిసి సభ్యులు రాకేష్‌, గంగాధర్‌, ఎస్‌ఎంసి …

Read More »

సీడ్స్‌, పెస్టిసైడ్స్‌ కమిటీ ఏకగ్రీవం

నందిపేట్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల సీడ్స్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌ కమిటిని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా మారుతి రాజు, ఉపాధ్యక్షునిగా కె.జి.సురేష్‌లను ఎన్నుకున్నట్లు సభ్యలు తెలిపారు. పాల్గొన్న సీడ్స్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌ నాయకులు విక్రమ్‌ రెడ్డి, రాంబాబు, సుమన్‌, రాజు, రాజన్న, పోతన్న, రఫీ, వివిధ గ్రామాల సీడ్స్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌ ప్రోపరేటర్స్‌ పాల్గొన్నారు.

Read More »

ధ్యాన మందిర పరిశీలన

నందిపేట్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో అడ్వకేట్‌ సాయి కృష్ణ రెడ్డి ఇంటి వద్ద స్వయం ఖర్చులతో ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న అభయాంజనేయ స్వామి పిరమిడ్‌ ధ్యాన మందిరంను బుధవారం గ్రాండ్‌ సీనియర్‌ పిరమిడ్‌ మాస్టర్‌ మిణుగు రణవీర్‌ సందర్శించి పనులను పరిశీలంచారు. ధ్యాన మందిరం 18, 18 సైజుతో నిర్మాణం చేయడం జరిగిందని ఇట్టి ధ్యాన మందిరంలో నిజామాబాద్‌ జిల్లాలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »