Tag Archives: nandipet

క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

నందిపేట్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం సెజ్‌లో, లక్కంపల్లి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను సోమవారం ప్రారంభించారు. క్రీడల ద్వారా యువకుల మధ్య ఐక్యమత్యం స్నేహభావం పెంపొందిస్తాయని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, జీవన ప్రమాణాలను పెంచి ఆరోగ్యంగా ఉంటారని భారత రాష్ట్ర సమితి పార్టీ నందిపేట్‌ మండల అధ్యక్షులు మచ్చర్లసాగర్‌ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీసీనియర్‌ నాయకులు ప్రసాదరావు, చిమ్రజ్‌పల్లి ఎంపీటీసీ …

Read More »

దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయాలి

నందిపేట్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దొడ్డు రకం వడ్లను రైస్‌ మిల్లర్లు వెంటనే కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆర్మూర్‌ నియోజకవర్గ సొసైటీ చైర్మన్లు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ను కలిసి సమస్యల పరిష్కరం కొరకు విన్నవించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకొని వినతి చేసి పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అకాల వర్షాలు పడుతున్నందున వడ్లను …

Read More »

బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

నందిపేట్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్ధరాత్రి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అక్రమ అరెస్ట్‌ కు నిరసనగా బుధవారం నందిపేట్‌ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన బండి సంజయ్‌ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు భూతం సాయరెడ్డి, జిల్లా సెక్రెటరీ పోతుగంటి సురేందర్‌, కిషోర్‌ …

Read More »

11 బ్యాచుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…

నందిపేట్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని ఖుదావంద్‌ పూర్‌ ఉన్నత పాఠశాలలో ఆదివారం 1976-77 నుండి 1986- 87 వరకు 11 బ్యాచుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో దాదాపు 236 మందికి గాను 180 మంది ఎక్కడెక్కడో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఉదయం 9 గంటలకు ప్రాథమిక పాఠశాల ఆవరణకు చేరుకుని ముందుగా సరస్వతీ మాతకు పూజా …

Read More »

మా ఊరికి ఒక బస్సు నడపండి సార్‌…

నందిపేట్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వము కొత్తగా ఏర్పాటు చేసిన డొంకేశ్వర్‌ మండలం వెళ్లడానికి మారంపల్లి, గంగాసందర్‌ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని, ఈ విషయము పలుమార్లు రీజనల్‌ మేనేజర్‌ ఆర్టీసీకి, డివిఎం, ఆర్మూర్‌ డిఎం లకు విన్నవించుకున్న ఫలితం దక్కడం లేదని బిజెపి రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు మారంపల్లి గంగాధర్‌, జిల్లా బిజెపి కార్యదర్శి సురేందర్‌, జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షులు …

Read More »

ఫోన్‌లో గొడవ ప్రాణం మీదికి తెచ్చింది

నందిపేట్‌, డిసెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాలికి పోయే కంప ఒంటికి తగిలించుకున్నట్లు చెప్పే సామెత ప్రకారం నందిపేట్‌ మండలంలోని తల్వేద గ్రామంలో ఓ సంఘటన వ్యక్తి ప్రాణం తీసింది. నందిపేట్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సల్ల శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన మండ్ల కొండయ్య (42), మేస్త్రి పని చేసి వచ్చి గురువారం రాత్రి 8:30 గంటలకు తల్వేద …

Read More »

తెరాస ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ వర్దంతి

నందిపేట్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంటరానితనంపై అలుపెరుగని సమరం చేసిన ‘భారతరత్న అంబేద్కర్‌’ అని నందిపేట్‌ మండల టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్‌ పేర్కొన్నారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిదని, అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా నందిపేట్‌ మండల టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ …

Read More »

దివ్యాంగులు అన్ని రంగాలలో ముందుండాలి

నందిపేట్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవమును శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసీల్దార్‌ అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ వికలాంగులు అన్ని రంగాలలో ముందుకు రావాలని కోరారు. వికలాంగుల పిల్లలఫై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని సూచించారు. మండల అభివృద్ధి అధికారి నాగవర్ధన్‌ మాట్లాడుతు దివ్యాంగులు ఎటువంటి నిరుత్సాహానికి గురికాకూడదని, మనోదైర్యంతో ఉండాలని, వారి …

Read More »

టీఆర్‌ఎస్‌లోకి వడ్డెర సంఘం సభ్యులు

నందిపేట్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ పట్టణంలోని వడ్డెర సంఘం సభ్యులు జీవన్‌ రెడ్డి సమక్షంలో టీఆర్‌ ఎస్‌ పార్టీలో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గులాబీ తీర్ధం పుచ్చుకున్న సందర్భంగా వడ్డెర సంఘం సభ్యులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వ పాలన పట్ల తామంతా ఆకర్షితులం కావడమే కాక ఆర్మూర్‌ …

Read More »

ఆయన పేరు వింటేనే కాంగ్రెస్‌, బీజేపీలకు వణుకు

నందిపేట్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యమ నేతగా స్వరాష్ట్రాన్ని సాధించి ఆరు దశాబ్దాల కలను సాకారం చేసిన తెలంగాణ జాతిపిత, ముఖ్యమంత్రిగా ర్రాష్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న అభివృద్ధి ప్రధాత కేసీఆర్‌ అని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అభివర్ణించారు. సకలజనం మెచ్చిన నేత కేసీఆర్‌ అని, రాజకీయంగా ఎదురు, బెదురేలేని లేని ఉక్కు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »