Tag Archives: nandipet

శాస్త్రీయ పద్ధతిలో పంటలు పండిరచి లాభాలు పొందండి…

నందిపేట్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్ర రైతు వేదికలో క్షేత్ర ప్రదర్శనపై శిక్షణ తరగతులు నిర్వహించారు. నందిపేట మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికలో శనివారం రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించి పలు సూచనలు చేశారు. శాస్త్ర వేత్తలు మాట్లాడుతు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని శాస్త్రీయ పద్ధతులతో వ్యవసాయాన్ని చేయాలని రైతులకు తెలిపారు. …

Read More »

గ్రామంలో మురికి నీరు ఆగకుండా చేయడమే లక్ష్యం..

నందిపేట్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని మూడవ వార్డు బర్కత్‌ పురలో మురికి నీరు ఆగకుండా మురికి కాలువలను శుభ్ర పరుస్తున్నారు. శనివారం వార్డ్‌ మెంబర్‌ మాన్పుర్‌ భూమేష్‌తో కలిసి బర్కత్‌ పూర కాలోని పర్యవేక్షణ చేసి రోడ్డుపై పారుతున్న మురికి కాలువలు శుభ్ర పరచి నీరు ఆగకుండ పనులు చేపట్టారు. అస్తవ్యస్త డ్రైనేజీ మూలంగా ఎక్కడికక్కడ మురికి నీరు ఆగిపోతున్నాయి. …

Read More »

కూలీలు కాదు సేవకులు..

నందిపేట్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని గ్రామాల్లోని వరినాట్లకు కూలీలు సరిపోక ఇతర ప్రాంతాల నుంచి కూలీలను పిలిపించుకోవాల్సి వస్తున్నటువంటి ప్రస్థుత పరిస్థితిలో కూలికి కాదు సేవకై వస్తామని కూలీ తీసుకోకుండానే వరి నాటడానికి ఉచితంగా పని చేయడానికి వచ్చి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే నందిపేట మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమం పలుగుగుట్ట సమీపంలో 10 ఎకరాల వ్యవసాయ భూమి …

Read More »

సిం ఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

నందిపేట్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం బజార్‌ కొత్తూరు గ్రామంలో గురువారం సిరికొండ లక్ష్మికి సీ.ఎం. రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును తెరాస నాయకులు అందించారు. నాయకులు మాట్లాడుతూ ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సహకారంతో ఎంతోమంది పేద వ్యాధిగ్రస్తులకు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. ఎంఎల్‌ఏ జీవన్‌ రెడ్డి పేద ప్రజలకు ఆపద్బాంధవుడిగా ఉన్నాడని కీర్తించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంద పోసాని బాబు రాజ్‌, …

Read More »

గోదావరి తీరాన జింకల సందడి

నందిపేట్‌, జూన్ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని జిజి నడుకుడ గ్రామ గోదావరి తీరాన జింకలు సందడి చేస్తున్నాయి. గతంలో కూడా ప్రతి సంవత్సరం వర్షాకాల సమయంలో గోదావరి తీరాన పెద్ద సంఖ్యలో జింకలు వస్తున్నాయి. వీటిని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పక్షులు, జింకల రాక తో పర్యాటకుల సందడి పెరిగింది. గత సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో జింకలు సందడి చేసాయి. …

Read More »

నందిపేట్‌లో భారీ వర్షం, ఊరట చెందిన రైతన్న

నందిపేట్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల రైతుల్లో ఆశలు చిగురించాయి. తొలకరి వానలకు డొంకేశ్వర్‌, నూత్‌పల్లి, గాదేపల్లి తదితర గ్రామాల్లో పసుపు, మొక్కజొన్న పంట వేశారు. వారం రోజులైనా వర్షం జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. విత్తిన విత్తనాలు ఉడికిపోతాయేమోనని భయపడ్డారు. అయితే ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల రైతులు …

Read More »

ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

నందిపేట్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో నిర్మించతలపెట్టిన శ్రీ రేణుకా ఎల్లమ్మతల్లి ఆలయానికి ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ఆలయ నిర్మాణ స్థలం వద్ద వేద పండితులు, ఆలయ నిర్మాణ కర్తలు జీవన్‌ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జీవన్‌ రెడ్డి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ …

Read More »

వైభవంగా ముగిసిన ప్రతిష్ఠాపన పర్వం

నందిపేట్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం చౌడమ్మ కొండూరు గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి ఆలయంలో గడిచిన ఆరు రోజుల పాటు కన్నుల పండువగా సాగిన ప్రతిష్ఠాపన మహోత్సవం సుసంపన్నమైంది. భక్తులు ఆహ్లాదకర వాతావరణంలో స్వామి వారి తొలి దర్శనం చేసుకుని పులకించి పోయారు. ఆరవ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠించబడిన రాజ్యలక్ష్మి సమేత నరసింహుడు, …

Read More »

లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్‌ దంపతులు

నందిపేట్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం సిహెచ్‌ కొండూరులో నూతనంగా నిర్మితమైన రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సోమవారం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి దంపతులు సందర్శించారు. గత మూడు రోజులుగా ఆలయంలో జీర్ణోద్ధరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆలయ సందర్శనకు వచ్చిన కలెక్టర్‌ దంపతులకు సద్బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. కలెక్టర్‌ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర, …

Read More »

గుర్తుతెలియని శవం లభ్యం

నందిపేట్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని బజార్‌ కొత్తూరు శివారులోని గోదావరి తీరాన గుర్తు తెలియని శవం లభ్యం అయింది. నందిపేట్‌ ఎస్‌ఐ ఎస్‌ మురళి తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మెడ గ్రామం పాతూర్‌ శివారులో గల గోదావరి నదిలో గుర్తు తెలియని మగ మనిషి శవం పూర్తిగా కృళ్ళిపోయి ఉందని, ఉమ్మెడ గ్రామ కార్యదర్శి అనిల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిపేట్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »