నిజామాబాద్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నోటరీ భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినందున అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. నోటరీ భూముల క్రమబద్ధీకరణ గురించి విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కేవలం నోటరీ ద్వారా భూములు కొనుగోలు చేసిన వారందరు …
Read More »స్వరాష్ట్రంలో పల్లెపల్లెన ప్రగతి కాంతులు
నిజామాబాద్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అరవై ఏళ్ల దోపిడిని అడ్డుకొని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పల్లెలన్నీ ప్రగతిని సంతరించుకుని వెలుగులీనుతున్నాయని శాసన మండలి సభ్యులు కల్వకుంట్ల కవిత అన్నారు. తొమ్మిదేళ్ల క్రితం సమైక్య రాష్ట్రంలో నెలకొని ఉన్న దుస్థితికి, ప్రస్తుతం స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమానికి గల వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని ఆమె కోరారు. బాల్కొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కమ్మర్పల్లి మండలం …
Read More »ప్రజావాణికి 132 ఫిర్యాదులు
నిజామాబాద్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 132 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, నగర పాలక సంస్థ …
Read More »నేటి పంచాంగం
సోమవారం, ఆగష్టు 28, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి మధ్యాహ్నం 3.28 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 1.21 వరకుయోగం : ఆయుష్మాన్ ఉదయం 9.03 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.28 వరకు తదుపరి కౌలువ రాత్రి 2.10 వరకు వర్జ్యం : ఉదయం 10.20 – 11.50, …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, ఆగష్టు 27,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి సాయంత్రం 5.20 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 2.50 వరకుయోగం : ప్రీతి ఉదయం 11.23 వరకుకరణం : వణిజ ఉదయం 6.11 వరకు తదుపరి భద్ర సాయంత్రం 5.20 వరకు ఆ తదుపరి బవ తెల్లవారుజాము 4.24 వరకు వర్జ్యం …
Read More »తుది ఓటరు జాబితాలో పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదు
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తుది ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. ముఖ్యంగా డబుల్ ఎంట్రీ, బోగస్ పేర్లు లేకుండా జాబితాను బీ.ఎల్.ఓ మొదలుకుని ఈ.ఆర్.ఓ స్థాయి వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సి.ఈ.ఓ …
Read More »మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రాధాన్యత
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి మండల కేంద్రంలో రూ. 6.70 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల భవనాన్ని శనివారం రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అట్టహాసపు …
Read More »కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు-చేర్పులకు అవకాశం కల్పిస్తూ పోలింగ్ బూత్‌ల పరిధిలో ఈ నెల 26, 27 తేదీలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం పలు పోలింగ్ బూత్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోస్రా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, చందూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో గల పోలింగ్ …
Read More »నేటి పంచాంగం
శనివారం, ఆగష్టు 26, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి రాత్రి 7.02 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మూల తెల్లవారుజామున 3.47 వరకుయోగం : విష్కంభం మద్యాహ్నం 1.49 వరకుకరణం : తైతుల ఉదయం 7.44 వరకు తదుపరి గరజి రాత్రి 7.02 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.19 – 1.52, …
Read More »ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రావణమాసం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో టీటీడీ కల్యాణ మండపంలో శుక్రవారం సామూహిక విశేష వరలక్ష్మీ వ్రత పూజ కుంకుమార్చన కథ పారాయణంతో కార్యక్రమాలు మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు పూజా సామాగ్రిని కానుకలను పరిషత్ ప్రతినిధులు అందించారు. కార్యక్రమంలో ధర్మ ప్రచార పరిషత్ ప్రతినిధులు మూడ …
Read More »