Tag Archives: nizamabad

ప్రజావాణికి 81 ఫిర్యాదులు

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ న్న అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 81 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు …

Read More »

కట్టుదిట్టమైన భద్రత నడుమ మరమ్మతు పనులు

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. …

Read More »

యువజనోత్సవాలలో ఉపన్యాసపోటీలు

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ యువజన ఉత్సవాల్లో భాగంగా యువతీయువకులకు ఉపన్యాసపోటీలు నిర్వజించనున్నట్లు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ తెలిపారు. జిల్లా క్రీడా మరియు యువజన విభాగం ,నెహ్రూ యువ కేంద్ర సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో పాల్గొనే వారు వయసు 15 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల లోపు వారై ఉండి, కేవలం 3 …

Read More »

విద్యార్థులకు దుప్పట్లు, నోట్‌ బుక్కులు అందజేత

నిజామాబాద్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన అధికార, అనధికార ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు అందించిన దుప్పట్లు, నోట్‌ బుక్కులను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్వీకరించి, వాటిని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అందజేశారు. పూల బొకేలకు బదులుగా పేద విద్యార్థులు సౌకర్యార్థం బ్లాంకెట్లు, నోట్‌ బుక్కులు తేవాలని జిల్లా కలెక్టర్‌ చేసిన విజ్ఞప్తికి అనూహ్య స్పందన లభించింది. పాలనాధికారిని …

Read More »

నూతన సంవత్సరంలో జిల్లా మరింత పురోగతి సాధించాలి

నిజామాబాద్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సరంలో నిజామాబాద్‌ జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆకాంక్షించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి ముందుగా న్యూ ఇయర్‌ కేక్‌ కట్‌ చేసి సంబరాలకు శ్రీకారం చుట్టారు. అధికారులు, అనధికార ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ సంఘాల బాధ్యులు, …

Read More »

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల నామ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 2023 ఏడాది ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అభిలాషించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, …

Read More »

బైరి నరేశ్‌పై న్యాయవాదుల ఫిర్యాదు

నిజామాబాద్‌, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిందు దేవుళ్ళను, అయ్యప్ప స్వామిని కించపరుస్తూ, హిందువుల మనోభావాలను గాయపరిచిన బైరి నరేష్‌, రెంజర్ల రాజేష్‌, శాన్‌ అనే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో పిర్యాదులు దాఖలయ్యాయి. నిజామాబాద్‌ ఒకటవ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో న్యాయవాది పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్‌ మోహన్‌ గౌడ్‌, మూడవ పోలీస్‌ స్టేషన్‌లో న్యాయవాది, బి.జే. పి.లీగల్‌ …

Read More »

నూతన సంవత్సర వేడుకలపై పోలీసు వారి సూచనలు

నిజామాబాద్‌, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సర వేడుకల సందర్బంగా నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌, ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ కంట్రోల్‌లో భాగంగా పలు సూచనలు చేశారు. ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు హెచ్చరించారు. శుక్రవారం కమీషనరేట్‌ నుండి ప్రకటన ద్వారా సూచనలు వెల్లడిరచారు. క్రాకర్స్‌, ఆర్కెస్ట్రా సౌండ్‌ సిస్టమ్‌, డిజె …

Read More »

నాబార్డ్‌ రుణ ప్రణాళిక విడుదల చేసిన జిల్లా పాలనాధికారి

నిజామాబాద్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించి 2023 – 2024 సంవత్సరానికి గాను జాతీయ వ్యవసాయ గ్రామీణ వికాస బ్యాంక్‌ ( నాబార్డ్‌) ద్వారా రూ. 8513 కోట్లతో రూపొందించిన పొటెన్షియల్‌ లింక్‌ డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ ను శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌లో విడుదల చేశారు. పంట ఉత్పత్తులు, నిర్వహణ, మార్కెటింగ్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »