నిజామాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నిజామాబాద్ జిల్లా స్వర్ణకార సంఘ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం నగరంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం నాగారంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అథితిగా నగర మేయర్ హాజరై స్వర్ణకార వృత్తి విశిష్టత గురించి వివరించి, ప్రభుత్వ పరంగా అందాల్సిన సంక్షేమ పథకాల గురించి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా నూతన అధ్యక్షులు తంగళ్ళపల్లి …
Read More »గోదాములో విద్యుత్ పనులు పక్కాగా జరిపించాలి
నిజామాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇటీవల చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 2023 లో జరిగే ఎన్నికల …
Read More »ఎన్‌వైకె ఆధ్వర్యంలో లైంగిక, అంటు వ్యాధులపై అవగాహన సదస్సు
నిజామాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో ఎయిడ్స్ ,టిబి, ఇతర లైంగిక, అంటు వ్యాధుల పట్ల యువతకు అవగాహన, శిక్షణ సదస్సును ముబారక్ నగర్‌లోని వివేకానంద ఐటిఐ కళాశాలలో నిర్వహించారు. సభాధ్యక్షురాలు, కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ప్రతిష్టాత్మకంగా ఈ శిక్షణను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోందని, యువతీయువకులకు అందరికీ ఈ విషయాల …
Read More »ధాన్యం సేకరణలో నిజామాబాద్ నెంబర్ వన్
వివరాలు వెల్లడిరచిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం సేకరణ వివరాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడిరచారు. 7011 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గానూ 4607 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తై మూసివేసామని, నిన్నటివరకూ పది లక్షల నలబైవేల మంది రైతుల …
Read More »సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నిజామాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ వర్గాల వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. బుధవారం జెడ్పి ఛైర్మన్ విట్ఠల్ రావు అధ్యక్షతన జెడ్పి మీటింగ్ హాల్‌లో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. …
Read More »వెల్నెస్ సెంటర్‌ను మారుస్తాము
నిజామాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెన్షనర్లు, ఇతర లబ్ధిదారుల ప్రయోజనాల దృష్ట్యా వెల్నెస్ సెంటర్‌ను అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అన్ని వసతులతో కూడిన భవనంలోనికి మారుస్తామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి బృందం జిల్లా పరిషత్ మీటింగుకు హాజరైన జిల్లా కలెక్టర్‌ను కలిసి మెమోరాండం …
Read More »దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర మరువలేనిది
నిజామాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈరోజు కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని, దేశ స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక …
Read More »సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా ఎంపీ అర్వింద్
నిజామాబాద్, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి బోర్డు సభ్యులుగా లోక్‌సభ ఎంపీలు అర్వింద్ ధర్మపురి, బాలశౌరి వల్లభనేనిలు ఎన్నికైనట్లు పార్లమెంట్ బులిటెన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన 8 నెలల కాలంలోనే మోడీ ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా రీజినల్ ఆఫీస్ …
Read More »రైతు మోసకారి ప్రభుత్వం
నిజామాబాద్, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు వినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 ఎన్నికల హామిలో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ టిఆర్‌ఎస్ …
Read More »వాలంటీర్లకు విపత్తు నిర్వహణ శిక్షణ
నిజామాబాద్, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం సుభాష్ నగర్‌లోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విపత్తు నిర్వహణ శిక్షణను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విజయవాడకు చెందిన 10వ బెటాలియన్ కమాండెంట్ బిట్వీన్ సింగ్ నేతృత్వంలోని 20 మంది ఎన్‌డిఆర్‌ఎఫ్ సైనికుల బృందం శిక్షణను ఇచ్చింది. అగ్నిప్రమాదాలు, జల ప్రమాదాలు,వరదలు, భూకంపాలు, గ్యాస్ లీకేజీ, పేలుడు ఇతర …
Read More »