నిజామాబాద్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీసీ విద్యార్థుల, యువజనుల సమస్యలపై పోరాడుతు హక్కుల సాధనకై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్త పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్, కంకనాల శ్యాం పాల్గొంటున్నారని బీసీ సంక్షేమ సంఘం నాయకులు నరాల సుధాకర్ …
Read More »ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే కృత నిశ్చయంతో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నేటితో (గురువారం) ముగియనుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువు ముగిసే లోపు ఓటరు జాబితాలో తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. …
Read More »దేశ రక్షణంలో త్రివిధ దళాల సేవలు మరువలేనివి
నిజామాబాద్, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశానుసారము ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి డి.రమేష్ నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సాయుధ దళాల పతాక దినోత్సవమును జండా ఊపి ప్రారంభించినారు. దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో భారత దేశ రక్షణ కొరకు, …
Read More »’కంటి వెలుగు’ విజయవంతానికి పకడ్బందీ ప్రణాళిక
నిజామాబాద్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని, తదనుగుణంగా ముందుకెళ్లాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు సూచించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఎంహెచ్‌ఓలు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్ష జరిపారు. …
Read More »సాగునేలను కాపాడితే భవిష్యత్తు తరాలకు ప్రయోజనం
నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేల కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన, స్థిరమైన సజీవ వనరులుగా అందించడం మన అందరి బాధ్యతగా ఆర్టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. ప్రపంచ మృత్తిక నేల దినోత్సవం సందర్భంగా డిచ్‌పల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామంలో సోమవారం రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేల కలుషితం కాకుండా సహజ సూక్ష్మజీవుల పరిరక్షణ …
Read More »రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి, టిఆర్‌ఎస్
నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి.సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ వరకు వెళ్లి కలెక్టర్‌కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి …
Read More »24 గంటల విద్యుత్తు హామీ నెరవేర్చరా..?
నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో జిల్లా విద్యుత్తు శాఖ ఎస్.ఇ కి వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయం పూర్తిగా విద్యుత్తుపై ఆధారపడి ఉంది, కావున రాష్ట్ర ప్రభుత్వం దేశంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఇస్తామని చెప్పింది, కానీ ఇప్పటివరకు జిల్లాలో 10 …
Read More »పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మాణాలపై బహిరంగ పర్చాలి
నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏళ్ల తరబడి జిల్లా ప్రజలకు సేవలందించిన పాత కలెక్టర్ భవనాలను ఆగమేఘాల మీద అధికారులు కూల్చివేస్తున్నారని, అక్కడ ఏ నిర్మాణాలు చేపడుతారో ప్రజలకు తెలియజేయాలని సిపిఐ బహిరంగ లేఖ విడుదల చేసింది. సోమవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌కు విన్నవిస్తూ బహిరంగ లేఖను సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా సుధాకర్ …
Read More »ప్రజావాణికి 97 ఫిర్యాదులు
నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 97 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ చందర్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, …
Read More »ఆధార్ పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీ
నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆధార్ నమోదుతో పాటు నకిలీ ఆధార్ కార్డుల గుర్తింపు, ఇతర అక్రమాలను పరిశీలించి తగు చర్యలు చేపట్టేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ఆధార్ పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు అయ్యిందని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల అధికారులు, మీ సేవా నిర్వహకులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ ఈ విషయాన్ని …
Read More »