నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వారు నిర్వహిస్తున్న టెక్ బీ ప్రోగ్రాం కొరకు ఎంపిసి / ఎంఇసి 60శాతం మాథ్స్ సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత పొందిన ఇంటర్మీడియట్ 2021 Ê 22 లో పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈనెల 26 శనివారం ఉదయం 10 గంటలకు నిజామాబాద్‌లోని కేర్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్, …
Read More »ఆదివారం మూడు పుస్తకాల ఆవిష్కరణ
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు 5 వ అంతస్తు, హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్, నిజామాబాద్‌లో తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయనశాఖ, అసోసియేట్ ప్రొఫెసర్, డా. వంగరి త్రివేణి రచించిన మూడు వ్యాససంపుటాలు ‘‘అరుగు’’, ‘‘బటువు’’, ‘‘భరిణ’’ పుస్తకాల అంకితోత్సవం – పరిచయ సభ నిర్వహింపబడుతుందని తెలిపారు. కవులు, రచయితలు, సాహిత్య అభిమానులు విచ్చేసి కార్యక్రమాన్ని …
Read More »గడువులోపు నిర్మాణాలు పూర్తి చేయాలి
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని నిర్దిష్ట గడువులోగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఇందల్వాయిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఇప్పటికే 48 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, వాటి నాణ్యతను కలెక్టర్ పరిశీలించి అధికారులను పలు వివరాలు …
Read More »పేద విద్యార్థులపై పెనుభారం
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక (టివియువి) ఆధ్వర్యంలో గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో విద్యార్ధులపై ఫీజుల భారాన్ని తగ్గించాలని కోరుతూ కళాశాల ప్రిన్సిపాల్ రాంమోహన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టివియువి రాష్ట్ర కో ఆర్డినేటర్ రామావత్ లాల్ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం బి.ఎ, బికాం, బియస్.సిలో నూతన కాంబినేషన్ కోర్సులు ప్రవేశపెట్టిందని, విద్యార్థులకు ఫీ-రియంబర్స్ మెంట్ …
Read More »ఎంప్లాయిస్ హెల్త్ స్కీం పటిష్ట పరచాలి
నిజామాబాద్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలు లోపభూయిష్టంగా తయారైందని, నగదు రహిత వైద్యం కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులలో అనుమతించటం లేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ద్వితీయ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మెడికల్ రీయంబర్స్‌మెంట్ కూడా …
Read More »జనవరి 15 లోపు ఇళ్ల కేటాయింపులు పూర్తి చేయాలి
నిజామాబాద్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, వచ్చే జనవరి నెల 15 వ తేదీ నాటికి అర్హులైన లబ్దిదారులకు కేటాయించేలా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. గురువారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో కలిసి రెండు పడక …
Read More »అటవీ సంబంధిత ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
నిజామాబాద్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ భూములకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ, తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలో పోడు సాగును అడ్డుకునే క్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ …
Read More »పెండిరగ్ డీఏలను విడుదల చేయాలి
నిజామాబాద్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్‌లో ఉన్న మూడు డిఏలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే రామ్మోహన్రావు డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన నిజామాబాద్ డివిజన్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని, అంగీకరించిన అంశాల పైన తక్షణమే జీవోలు జారీ చేయాలని …
Read More »డ్రోన్ ద్వారా ఔషధాల సరఫరా సేవలు
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో డ్రోన్ ద్వారా ఔషధాలను సరఫరా చేసే సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెడికార్ట్, టీ.శా అనే స్టార్టప్ కంపెనీలు సంయుక్తంగా వీటిని నిర్వహిస్తుండగా, కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద లాంఛనంగా ప్రారంభించారు. డ్రోన్ ద్వారా ఔషధాలను అవసరమైన ప్రాంతాలకు చేరవేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. జిల్లా పాలనాధికారి సమక్షంలో …
Read More »ఓటర్‌గా నమోదు చేసుకో – ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా గర్వించు
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక గిరిరాజ్ కళాశాల ఆడిటోరియంలో కళాశాల విద్యార్థులకు ఓటర్ నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమములో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ భారత దేశములో 18 సంవత్సారాలు నిండిన ప్రతీ పౌరుడు ఓటర్‌గా నమోదు చేసుకోవాలని, కళాశాలలో చదువుతున్న 18 సంవత్సరాలు విద్యార్ధులు అందరు వెంటనే నమోదు చేసుకోవాలని వారి నుండి …
Read More »