Tag Archives: nizamabad

ఏడుగురు ఏ.ఈలకు మెమోలు జారీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ మన ఊరు – మన బడి పనుల ప్రగతిపై అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా పనుల ప్రగతి గురించి ఆరా తీశారు. ఈ …

Read More »

వైద్య బృందాన్ని అభినందించిన మంత్రి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒకే రోజు 10 మోకాలి చిప్ప ఆపరేషన్లు విజవంతంగా పూర్తి చేసిన నిజామాబాద్‌ ప్రభుత్వ హాస్పిటల్‌ వైద్య బృందానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వ హాస్పిటల్లో కల్పించిన మౌళిక సదుపాయాల వల్లే ఇది సాధ్యం అయ్యిందని, ఇప్పటి …

Read More »

పాత కలెక్టరేట్‌లోకి ఆర్డీఓ కార్యాలయం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయం పాత కలెక్టరేట్‌ భవనంలోకి మారింది. పాత కలెక్టరేట్‌లో కొనసాగిన అన్ని శాఖలు ఇప్పటికే నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోకి చేరాయి. దీంతో ఖాళీగా ఉన్న పాత కలెక్టరేట్‌ లోకి ఆర్డీఓ ఆఫీసును మార్చారు. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శుక్రవారం సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు …

Read More »

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరులకు జాతి యావత్తు రుణపడి ఉంటుందని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ, ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలు మరువలేనివని శ్లాఘించారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌ …

Read More »

అన్ని వసతులతో అందుబాటులోకి ధాత్రి టౌన్‌ షిప్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి ఆనుకుని మల్లారం గ్రామ పరిధిలో గోడౌన్‌ల పక్కన ప్రభుత్వం ఆధ్వర్యంలో నెలకొల్పుతున్న ధాత్రి టౌన్‌ షిప్‌ ను కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ టౌన్‌ షిప్‌లో ప్లాట్లను విక్రయించేందుకు నవంబర్‌ 14న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో టౌన్‌ షిప్‌ వద్ద కొనసాగుతున్న …

Read More »

నిబంధనలు పాటించని బి.ఏడ్‌ కళాశాలను వెబ్‌ ఆప్షన్‌ నుండి తొలగించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని నిబంధనలు పాటించని ఆయేషా బి.ఎడ్‌ కళాశాలను ఆప్షన్‌ నుండి తొలగించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఎఫ్‌ఐ, టీవీయువి, ఎఐఎస్‌బి, జివిఎస్‌ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిబంధనలు పాటించని ఆయేషా బి.ఎడ్‌ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌బి జిల్లా కార్యదర్శి మహెష్‌ రెడ్డి మాట్లాడుతూ ఆయేషా బి.ఎడ్‌ కళాశాల …

Read More »

ధాన్యం కొనుగోళ్లు జరిపే ట్రేడర్లకు ఆటంకాలు కల్పించకూడదు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ కు సంబంధించి రైతులు పెద్ద ఎత్తున సాగు చేసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చే ట్రేడర్లకు ఎవరు కూడా ఎలాంటి ఆటంకాలు కల్పించకూడదని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ సూచించారు. ఒకవేళ ఎవరైనా ఆటంకాలు కల్పించినట్లు తమ దృష్టికి వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక …

Read More »

జాతీయ స్థాయి అవార్డులకు జీ.పీలు కృషి చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి అవార్డుల కోసం ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయనున్నందున, జిల్లాలోని మొత్తం 530 జీ.పీలు నామినేషన్‌ చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సూచించారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ స్థాయి అవార్డుల కోసం నిర్దేశించిన తొమ్మిది అంశాల్లోనూ …

Read More »

ట్రస్టులు విజ్ఞాన కేంద్రాలుగా వ్యవహరించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాజిక, విద్య, వైద్య,విజ్ఞానాన్ని అందించే విధంగా ట్రస్టులు వ్యవహరించాలని రాష్ట్ర వ్యాప్త ట్రస్టుల, విజ్ఞాన కేంద్రల కోఆర్డినేటర్‌ ఎం. సోమయ్య పిలుపునిచ్చారు. మల్లు స్వరాజ్యం మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక డాక్టర్‌ రామ్‌ మోహన్‌ రావు అధ్యక్షతన గురువారం ట్రస్ట్‌ భవనములో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాల,బాలికలకు శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించే …

Read More »

జూనియర్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో (న్యూ కలేక్టరేట్‌) గల వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక్కో శాఖ వారీగా అధికారులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా కొనసాగుతున్న సుధీర్‌ కుమార్‌ అనే ఉద్యోగి అనధికారికంగా విధులకు గైరుహాజరు కావడాన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »