Tag Archives: nizamabad

ధాత్రి టౌన్‌ షిప్‌లో పనులు వేగవంతం

నిజామాబాద్‌, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా నెలకొల్పిన ధాత్రి టౌన్‌ షిప్‌ లో మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ధాత్రి టౌన్‌ షిప్‌ లో ప్లాట్ల విక్రయాల కోసం ఇప్పటికే రెండు విడతలుగా వేలం ప్రక్రియలు నిర్వహించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ధాత్రి టౌన్‌ …

Read More »

సర్వే నెంబరు 952 స్థలాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోస్రా శివారులోని సర్వే నెం. 952 పరిధిలో గల స్థలాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్‌ మీనా, ఇతర రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారులతో కలిసి మ్యాప్‌లు, రికార్డుల ఆధారంగా అటవీ, రెవెన్యూ సరిహద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. పలువురు రైతులు పంటలు సాగు చేస్తున్న …

Read More »

ఈనెల 31న హరిదా రచయితల సంఘం మహాసభ

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మే 31న హరిదా రచయితల సంఘం నిర్వహించనున్న సాహిత్య మహాసభ విజయవంతం కావాలని శాసనమండలి సభ్యులు, భారత్‌ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. బుధవారం అర్బన్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, నిజామాబాద్‌ నగర మేయర్‌ నీతు కిరణ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ …

Read More »

సిఎం కప్‌ క్రీడా పోటీలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని మరింతగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌ -2003 క్రీడా పోటీల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఈ పోటీలు జరుగనున్నాయని తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి …

Read More »

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పై చేయి

నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022 – 23 విద్యా సంవత్సరానికి గాను నిజామాబాద్‌ జిల్లాలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా మొదటి సంవత్సరంలో 58 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. రెండవ సంవత్సరం మొత్తం 14,086 మంది విద్యార్థులకు గాను 8,561 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 6,391 …

Read More »

పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజివ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 వినతులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు …

Read More »

రైస్‌ మిల్లర్లతో అత్యవసరంగా సమావేశమైన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల ద్వారా పంపించే ధాన్యాన్ని వెంటనే అన్‌ లోడిరగ్‌ చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు రైస్‌ మిల్లర్లకు హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆదివారం అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఇతర జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్‌ రైస్‌ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, రైస్‌ మిల్లర్లతో అత్యవసర …

Read More »

పోరాటయోధుడు అల్లూరి

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన్యం వీరుడు, స్వాతంత్రోద్యమ గెరిల్లా పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్‌ ప్రజాపంథా ఆధ్వర్యంలో కోటగల్లిలో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రజాపంథా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మట్టిలాంటి మనుషులను మర ఫిరంగులుగా చేసి బ్రిటిష్‌ సామ్రాజ్యవాధాన్ని గడగడలాడిరచిన …

Read More »

ధాన్యం కొనుగోలులో బిల్లుల చెల్లింపులు సత్వరమే జరగాలి

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల నుండి సేకరిస్తున్న ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించిన బిల్లులను సత్వరమే చెల్లించేందుకు చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం, కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఇవి మరింత సమర్ధవంతంగా అమలు జరిగేలా చూడాలన్నారు. శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో …

Read More »

ఏ.ఈ.ఈ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సి) ద్వారా ఈ నెల 8, 9 వ తేదీలలో జరుగనున్న రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. రాత పరీక్ష కోసం నిజామాబాద్‌ జిల్లాలో మూడు సెంటర్‌ లను ఏర్పాటు చేశామని వివరించారు. ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »