నిజామాబాద్, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు 29 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు రానున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో పెరుగుతున్న పేషెంట్లకు అనుగుణంగా మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను ఏర్పాటు చేయనుందని అన్నారు. 29మంది …
Read More »అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలో ప్రజలను భాగస్వాములు చేయాలి
నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నెల 14 వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుక కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భాగస్వాములు చేయాలని సంకల్పించడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి అన్నారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఆమె అంబేద్కర్ విగ్రహావిష్కరణ, …
Read More »అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలి
నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులతో ఎరువుల సమీకరణ, వాటి పంపిణీ, ప్రస్తుతం పంటల సాగు స్థితిగతులు, రబీలో …
Read More »ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్‌లు, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. ఇటీవలే పూర్తయిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. …
Read More »9న బహుభాషా కవి సమ్మేళనం
హైదరాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బహుభాషా కవి సమ్మేళనం నిర్వహిస్తున్నారు. అంశం భారత దేశ ప్రజలు సామరస్య సహజీవనం, కావున నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని తెలుగు హిందీ, ఉర్దూ, భాష పండితులందరూ అంశంపై మంచి కవిత్వాన్ని రాసి జమీలుల్లా, కె.వి రమణ చారి, గంట్యాల ప్రసాద్, బి .ప్రవీణ్ కుమార్, మాక్బూల్ హుస్సేన్ …
Read More »ఆసుపత్రి సీజ్
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు నిజామాబాద్ పట్టణంలోని ఖలీల్‌వాడిలోగల శివగంగ ఇ.ఎన్.టి. ఆసుపత్రిలో అర్హతలేని వైద్యురాలు మార్చి 17వ తేదీన అబార్షన్ చేయడం జరిగిందని, కాగా సదరు ఆసుపత్రిని బుధవారం సీజ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్, డాక్టర్ వి.రాజేశ్, బి. గంగాధర్ తదితరులున్నారు.
Read More »ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా.బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగ బీసీ సంక్షేమ సంఘం నాయకులు నిజామాబాద్ నగరంలో ఆయన విగహ్రానికి నివాళులు అర్పించారు. రక్షణ మంత్రిగా పాకిస్తాన్ పై విజయం, వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవం, కార్మిక శాఖ మంత్రిగా కార్మికులకు హక్కులు ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆయనే ఒక విజయం అని వక్తలు పేర్కొన్నారు. భారతదేశం ఒక పుస్తకం …
Read More »’పది’ పరీక్షలకు మరింత పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షలను కట్టుదిట్టమైన ఏర్పాట్లతో మరింత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఈ నెల 03వ తేదీ నుండి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల నిర్వహణ తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
నిజామాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముందస్తుగా ఆసుపత్రి ఖర్చులకోసం, మరియు ఆపరేషన్ తర్వాత ఆర్థిక సహాయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సహకారంతో, నిజామాబాద్ గ్రామీణ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులు మొత్తం 42 మందికి రూ. 14 లక్షల 18 వేల 100 …
Read More »అధికారికంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు
నిజామాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో దొడ్డి కొమురయ్య జయంతి నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు …
Read More »