Tag Archives: nizamabad

సాహిత్యానికి వెన్నుదన్ను గన్ను కృష్ణమూర్తి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కవి గన్ను కృష్ణమూర్తి ఆధునిక భావాలు కలిగిన కవి అని, మినీ కవిత్వంలో, రామాయణ పరిశోధనలో నూతన పంథాను సృష్టించాడని హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్‌ నివాళి అర్పించారు. గురువారం సాయంత్రం కేర్‌ డిగ్రీ కళాశాలలో హరిదా రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ కవి రామాయణ పరిశోధకులు వక్త, వ్యాఖ్యాత సౌజన్యమూర్తి …

Read More »

ఆదివాసి గిరిజన సమ్మేళనం పోస్టర్‌ ఆవిష్కరించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 17న ముఖ్యమంత్రి చేతుల మీదుగా హైదరాబాద్‌లో ప్రారంభించనున్న ఆదివాసి భవన్‌, బంజారా భవన్‌కు సంబంధించిన పోస్టర్‌ను గురువారం నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తన చాంబర్‌లో అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆదివాసి గిరిజన సమ్మేళనానికి జిల్లా …

Read More »

తెలంగాణ ప్రాశస్త్యాన్ని చాటేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యత, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులను కార్యోన్ముఖులు చేశారు. బుధవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్‌) లోని స్టేట్‌ ఛాంబర్లో జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, కలెక్టర్‌ …

Read More »

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో వజ్రోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై డీజీపీ మహేందర్‌ రెడ్డితో కలిసి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా …

Read More »

నులి పురుగుల నివారణ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా బుధవారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీలో విద్యార్థులతో పాటు కలెక్టర్‌ సైతం భాగస్వాములయ్యారు. 1 – 19 సంవత్సరాల వయస్సు గల వారందరికీ నులి పురుగుల నివారణ …

Read More »

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన ప్రాధాన్యతను చాటేలా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను జిల్లాలో విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. వజ్రోత్సవాల నిర్వహణకు సంబంధించి మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ …

Read More »

జాతీయ స్థాయి అవార్డుల సాధనకు కృషి చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులను నిజామాబాద్‌ జిల్లా ఎక్కువ సంఖ్యలో సాధించేలా ఆయా శాఖల అధికారులు సమిష్టిగా, పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, 9 అంశాల ప్రాతిపదికన …

Read More »

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్‌.యు) నగర నిర్మాణ జనరల్‌ బాడీ సమావేశం నగరంలోని కోటగల్లి, ఎన్‌ఆర్‌ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యవక్తగా విచ్చేసిన సీనియర్‌ జర్నలిస్ట్‌, అధ్యాపకుడు, పి.డి.ఎస్‌.యు మాజీ జిల్లా కార్యదర్శి కొంగర శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో …

Read More »

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలని కలెక్టర్‌ సీ.నారాయణరెడ్డి గర్భిణీలకు సూచించారు. మోపాల్‌ వసతి గృహం ఆకస్మిక తనిఖీ చేసి తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంగా 102 అంబులెన్సులో గర్భిణీ మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు జరిపించేందుకు తీసుకెళ్తుండడాన్ని గమనించిన కలెక్టర్‌ వాహనాన్ని నిలిపి, ఆశా వర్కర్లకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలతో కూడిన ఉచిత …

Read More »

రెసిడెన్షియల్‌ స్కూల్‌… వసతి గృహం తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోపాల్‌ మండలం కంజర గ్రామంలో గల ప్రభుత్వ సంక్షేమ బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌, మోపాల్‌ లోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాలను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా కంజర రెసిడెన్షియల్‌ స్కూల్‌ను సందర్శించిన కలెక్టర్‌, అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించారు. కిచెన్‌, డార్మెటరీ, స్టోర్‌ రూమ్‌, టాయిలెట్స్‌ వద్ద గల వసతులను స్వయంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »