నిజామాబాద్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి ఇంకనూ అక్కడక్కడా మిగిలిపోయి ఉన్న తుదిదశ పనులను వేగవంతంగా చేపట్టి సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 5 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో …
Read More »నిరుద్యోగ అభ్యర్థులకు సదవకాశం - నేడు జాబ్‌మేళా
నిజామాబాద్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 3వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్‌లోని కేర్ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా ఉంటుందని కళాశాల ఛైర్మన్ నరాల సుధాకర్ తెలిపారు. హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపనీ ఇండియా లిమిటెడ్ వారు నిర్వహిస్తున్న మేళాలో రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు ఉద్యోగావకాశం ఉందని పేర్కొన్నారు. ఉద్యోగార్థులు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, బాన్సువాడ, ఆర్మూర్, బోధన్, మెట్‌పల్లి …
Read More »విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
నిజామాబాద్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ప్రాధామ్యాలకు సంబంధించిన పనులను చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గల రైతు వేదికలలో సివిల్ పనులన్నీ వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువు దాటిన …
Read More »ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం చేసుకునేలా చూడాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఓటరు తమ ఓటరు కార్డుకు ఆధార్ ను అనుసంధానం చేసుకునేలా ఆయా శాఖల అధికారులు, సిబ్బంది చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. ఈ అంశం శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు కలెక్టర్ కీలక సూచనలు చేశారు. ఓటరు జాబితాలో పేర్లు కలిగి ఉన్న వారందరు ఆధార్ లింకేజీ చేసుకునేలా విస్తృత చర్యలు …
Read More »5న సీఎంను నిలదీస్తాం
నిజామాబాద్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాగ్దానం ప్రకారం ఎన్‌ఎస్‌ఎఫ్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్‌ఎస్‌ఎఫ్ రక్షణ కమిటీ నాయకులు ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ గేటు ముందర సమావేశమై డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ సమయంలో బోధన్ కు వచ్చిన సందర్భంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏర్పాటు అయినా 100 రోజుల్లో ఫ్యాక్టరీని ప్రభుత్వము స్వాధీనం …
Read More »ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో లోటుపాట్లకు తావుండకూడదు
నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 5 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిజామాబాద్‌కు విచ్చేస్తున్న సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ముస్తాబైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) వద్ద చేపడుతున్న ఏర్పాట్లను గురువారం పోలీస్ కమిషనర్ నాగరాజుతో కలిసి కలెక్టర్ సి.నారాయణరెడ్డి …
Read More »పెన్షన్ల పంపిణీలో దేశంలోనే నెంబర్ వన్
నిజామాబాద్, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వృద్దులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితర వర్గాల వారికి పెన్షన్లను పంపిణీ చేయడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ తరహాలో దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ల పంపిణీ జరగడం లేదని అన్నారు. 57 సంవత్సరాలు పైబడిన వారితో …
Read More »పీఆర్సి వేతన పెంపు బకాయిలను వెంటనే విడుదల చేయాలి
నిజామాబాద్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేతన పెంపు బకాయిలు విడుదల చేయాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు యూనిఫాంలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి. యు) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ కార్మిక …
Read More »ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ ఉత్సవాలు
నిజామాబాద్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో వినాయక వేడుకలు జరుపుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, ఉత్సవాల …
Read More »ప్రజావాణికి 87 ఫిర్యాదులు
నిజామాబాద్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 87 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో …
Read More »