నిజామాబాద్, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ప్రతీ సంవత్సరం నిర్వహించే యూత్ పార్లమెంటు పోటీలలో భాగంగా జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన కుమారి అక్షిత, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీలలో ద్వితీయ స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి యువతీయువకులు పాల్గొన్న ఈ పోటీలు ఉత్కంఠగా సాగాయని, ఆ పోటీలలో నిజామాబాద్ జిల్లాకు …
Read More »కంటి వెలుగు శిబిరాలను సక్రమంగా నిర్వహించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు శిబిరాలను నిర్దిష్ట ప్రణాళికకు అనుగుణంగా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. గురువారం ఆయన వర్ని మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. శిబిరానికి తరలివచ్చిన వారికి నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. శిబిరం వద్ద అందుబాటులో ఉంచిన సదుపాయాలు గమనించి సంతృప్తి …
Read More »మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్
హైదరాబాద్, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు బుధవారం అసెంబ్లీలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని తన ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి మంత్రి వేముల శుభాకాంక్షలు తెలిపారు. Blog heading and website banner of laptop with female typing hands, copy space in …
Read More »పోడు భూముల ప్రక్రియ సత్వరమే పూర్తి చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూములకు సంబంధించిన ప్రక్రియను ఈ నెల 15 వ తేదీ లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా, నిర్దేశిత గడువుకంటే ముందే అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన వెంటనే అర్హులైన వారికి ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని …
Read More »ప్రతి ఇంటిలో ప్రతి ముఖంలో సంతోషమే ప్రభుత్వ లక్ష్యం
నిజామాబాద్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఇంటిలో ప్రతి ముఖంలో సంతోషమే ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం ఆయన కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ నగరానికి చెందిన 198లబ్దిదారులకు 298 కల్యాణ లక్ష్మీ చెక్కులకు గాను రు.1,98,22,968 అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమం-ప్రతి ఒక్కరి ముఖంలో …
Read More »కంటి వెలుగు శిబిరాలను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను నివారించాలని కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం సందర్శించారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన శిబిరంతో పాటు, యానాంపల్లి తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను తనిఖీ చేశారు. శిబిరాల నిర్వహణ తీరును నిశితంగా …
Read More »వృద్ధాశ్రమ భవనం ప్రారంభించిన ఆర్టీసీ చైర్మన్
నిజామాబాద్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో అన్ని హంగులతో రూ. 50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వృద్ధాశ్రమం భవనానికి మంగళవారం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్, నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. వృద్ధాశ్రమం ఆవరణలో రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. వృద్ధాశ్రమంలోని వివిధ …
Read More »ఫిర్యాదులు పెండిరగ్ ఉండకూడదు
నిజామాబాద్, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, ఏ ఒక్క అర్జీ కూడా పెండిరగ్ లో ఉండకూడదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 109 ఫిర్యాదులు అందాయి. …
Read More »జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చిన్నారి దత్తత
నిజామాబాద్, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పాపని దత్తత ఇవ్వడం జరిగింది. సోమవారం స్థానిక ఐడిఓసిలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ఐదు సంవత్సరాల పాపని జర్మనీ దేశానికి సంబంధించిన తల్లిదండ్రులకి దత్తత ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దత్తత తీసుకున్న భార్యాభర్తలని అభినందించారు. పాపని జాగ్రత్తగా చూసుకోవాలని మంచి పౌష్టికాహారం, విద్య …
Read More »మగ్దూం మొహినుద్దీన్ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం
నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాం నవాబు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో మగ్దూం మొయినుద్దీన్ పోరాటమటిమ ప్రస్తుత ప్రజా ఉద్యమాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ కొనియాడారు. మొయినుద్దీన్ ఆశయాల కనుగుణంగా ప్రజా ఉద్యమ నిర్మాణమే నిజమైన నివాళిగా ఆయన పేర్కొన్నారు. శనివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ మగ్దుమ్ మొహియూద్దీన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి …
Read More »