నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఈ నెల19నుండి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పురస్కరించుకుని కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం పలు శిబిరాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మాక్లూర్ మండలం కల్లెడి గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో, బొంకన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నెలకొల్పిన కంటి వెలుగు శిబిరాలను పరిశీలించి కంటి పరీక్షల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను చూసి …
Read More »ఇది అందరి కార్యక్రమం… నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదు
నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే వేటు తప్పదని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. ‘కంటి వెలుగు’ కేవలం వైద్యారోగ్య శాఖకు సంబంధించినది మాత్రమే కాదని, ఇది అందరి కార్యక్రమం అయినందున అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో విజయవంతం చేసి జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. …
Read More »పెన్షనర్లకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలి
నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలలో పనిచేసి రిటైర్ అయిన పెన్షనర్లకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం సంఘ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. రాబోయే బడ్జెట్ సమావేశంలో ఆ మేరకు మినహాయింపు ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని వారు …
Read More »కంటి వెలుగు శిబిరం ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమయ్యింది. ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లోని మహిళా భవనంలో ఉదయం 9.00 గంటలకు కంటి వెలుగు శిబిరాన్ని ముఖ్య అతిథులచే లాంఛనంగా ప్రారంభించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. …
Read More »కంటి వెలుగు శిబిరాలు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టాలి
నిజామాబాద్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సాఫీగా సాగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి టి.హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పీలు, సంబంధిత అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి హరీష్ రావు, సీ.ఎస్ …
Read More »ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 21 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను …
Read More »ప్రవేశ పరీక్ష గోడప్రతుల ఆవిష్కరణ
నిజామాబాద్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల కళాశాలలు ఉమ్మడిగా నిర్వహించే ప్రవేశ పరీక్ష టీజీయూజీ సెట్ – 2023 ను పురస్కరించుకుని రూపొందించిన గోడప్రతులను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మంగళవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, టీజీయూజీ సెట్ – 2023 ప్రవేశ పరీక్షకు హాజరు కావాలనుకునే ఆసక్తి, అర్హత కలిగిన వారు ఫిబ్రవరి …
Read More »ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తుది దశ …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన యూజీ 2 వ సెమిస్టరు బ్యాక్‌లాగ్ పరీక్షలో 1571 మంది విద్యార్థులకు గాను 1425 మంది హాజరయ్యారని, 143 మంది గైర్ హాజరు అయ్యారని, మధ్యాహ్నం జరిగిన 5వ, 6వ సెమిస్టరు పరీక్షలో 10 వేల 264 కి గాను 9053 మంది హాజరయ్యారని 731 మంది గైర్హాజరయ్యారని …
Read More »పెన్షనర్స్ డైరీ ఆవిష్కరణ
నిజామాబాద్, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ప్రచురించిన 2023 నూతనసంవత్సర డైరీని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల కోసం సంఘం చేస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి. చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, సీఈవో ,ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు, సంఘం జిల్లా అధ్యక్షులు కే …
Read More »