నిజామాబాద్, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 73 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు …
Read More »ఆకట్టుకున్న ఉపన్యాసాలు
నిజామాబాద్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (పరాక్రమ్ దివస్) సందర్భంగా జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు సుభాష్ నగర్ లోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, ఆకాశవాణి అధికారి మోహన్ దాస్ నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఉపన్యాస పోటీలు ప్రారంభించారు. వివిధ మండలాల …
Read More »విపత్తుల సమయంలో ఎన్.డీ.ఆర్.ఎఫ్ పాత్ర క్రియాశీలకం
నిజామాబాద్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనుకోని రీతిలో విపత్తులు సంభవించిన సమయాల్లో ఎన్. డీ.ఆర్.ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) నిర్వర్తించే పాత్ర ఎంతో క్రియాశీలకమైనదని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రశంసించారు. విపత్తులు సంభవించినప్పుడు ఎన్. డీ.ఆర్.ఎఫ్ ఎలా స్పందిస్తుంది.. ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనే అంశాలపై అవగాహన కల్పించేందుకు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని క్రీడా అథారిటీ మైదానంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. …
Read More »విధులు బహిష్కరించిన న్యాయవాదులు
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా జడ్జి కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ కోసం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంకి వెళ్లిన న్యాయవాది గణపతిని కోర్టు సిబ్బందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ శుక్రవారం అత్యవసర సమావేశమై పోలీసులు అక్రమ కేసులను నమోదు చేయదాన్ని తీవ్రంగా ఖండిరచింది. ఈ సంఘటనను నిరసిస్తూ న్యాయవాదులు నిరవధికంగా …
Read More »అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణను మెరుగుపర్చాలి
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారంలో భాగంగా ప్రధాన రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణను మరింతగా మెరుగుపర్చాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యంగా జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించే విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. మాక్లూర్ మండలం మామిడిపల్లి నుండి ఆర్మూర్, అర్గుల్ మీదుగా డిచ్ పల్లి వరకు కలెక్టర్ శుక్రవారం క్షేత్ర స్థాయిలో …
Read More »నిర్లక్ష్యానికి తావిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులు వెంటదివెంట జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత ఏ.ఈ లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మన ఊరు – మన బడి, స్వయం సహాయక సంఘాలకు …
Read More »7న ఉపన్యాస పోటీలు
నిజామాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ‘‘పరాక్రమ్ దివస్’’ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా భాగంగా యువతీయువకులకు ఉపన్యాసపోటీలు నిర్వహించనున్నట్లు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో పాల్గొనే వారు 15సంవత్సరాల నుండి 29 సంవత్సరాల లోపు ఉండాలని, కేవలం 5 నిమిషాల లోపే ఉపన్యాసన్ని పూర్తి చేయాలని …
Read More »వ్యాయమంతోనే సంపూర్ణ ఆరోగ్యం
నిజామాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని ఐ.టి.ఐ కళాశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం నగర మేయర్ దండు నీతూ కిరణ్ మైదానాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా మేయర్ వాకర్స్‌తో కలిసి వాకింగ్ చేసి మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ చేస్తున్న వారిని అభిప్రాయాలూ అడిగి తెలుసుకున్నారు. ఓపెన్ జిమ్ వల్ల కలుగుతున్న ప్రయోజనాలను అందరం చూస్తున్నామని ప్రజల జీవన …
Read More »చెత్త రహిత నగరమే లక్ష్యంగా పని చేయాలి
నిజామాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని నాగారం ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను బుధవారం నగర మేయర్ దండు నీతూకిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కలుష్య రహిత, చెత్త రహిత నగర నిర్మాణానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అన్నారు. ప్రతి రోజు నగరంలోని ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే వాహనాలను డంపింగ్ యార్డ్ వద్ద తనిఖీ చేసి …
Read More »జాతీయ రహదారి పక్కన పచ్చదనం పెంపొందించాలి
నిజామాబాద్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా మీదుగా వెళ్తున్న 44 వ నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా పచ్చదనం పెంపొందించేలా పక్కా ప్రణాళికతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా సరిహద్దు ప్రాంతమైన చంద్రాయన్పల్లి నుండి డిచ్ పల్లి వరకు హైవేకు ఆనుకుని నాటిన మొక్కలను, వాటి నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. అక్కడక్కడా …
Read More »