నిజామాబాద్, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న జర్నలిస్టు పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇప్పించాలని వినతి పత్రం అందజేశారు. నూతన కార్యవర్గాన్ని ఈ సందర్బంగా కలెక్టర్ అభినందించారు. 50 శాతం రాయితీ ఇప్పించేందుకు …
Read More »డివికే మరణం ప్రజా ఉద్యమానికి తీరని లోటు
నిజామాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ మరణం ప్రజా ఉద్యమ నిర్మాణానికి తీరని లోటని వివిధ వామపక్ష పార్టీల నాయకులు నివాళ్లర్పించారు. డివికె ఆదివారం ఉదయం తెల్లవారుజామున అనారోగ్యంతో హైదరాబాద్ లో మృతి చెందినట్లు పార్టీ రాష్ట్ర నాయకులు ప్రకటించారు. సిపిఐ, సిపిఎం, ప్రజాపంథా జిల్లా నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ …
Read More »శ్రీని వెంచర్స్ సమస్యలు పరిష్కరించండి!
నిజామాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధర్మారం గ్రామంలోని శ్రీనివెంచర్స్ ప్లాట్ ఓనర్స్ సమస్యలు పరిష్కరించాలని, ఫైనల్ అప్రూవల్ విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ జూన్ 28న డి .పి. ఓ .ఆఫీసుకు సామూహిక విజ్ఞాపన పత్రం ఇవ్వటానికి తరలి రావలసిందిగా కోరుతూ ఆదివారం నాందేవ్‌వాడలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో జరిగిన శ్రీని వెంచర్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నిజామాబాద్ …
Read More »జూలై 15న ధర్నా
నిజామాబాద్, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీర్ఘకాలంగా పెండిరగ్లో ఉన్న రిటైర్డు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జులై 15న జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు ఉద్యోగుల సంఘం నిజాంబాద్ జిల్లా కమిటీ తీర్మానించింది. శనివారం సంఘ కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో శాస్త్రిల దత్తాత్రేయ రావు అధ్యక్షత వహించగా పలు …
Read More »తనిఖీ బృందాలు సిద్ధం….
నిజామాబాద్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలతో పాటు ప్రసవాలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలన జరిపేందుకు వీలుగా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తనిఖీ బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో జిల్లా స్థాయి అధికారితో పాటు డిప్యూటీ డీఎం హెచ్‌ఓ, ప్రోగ్రామ్ ఆఫీసర్ తదితరులు ఉన్నారు. ఏ అంశాలను పరిశీలించాలి, నివేదిక ఎలా సమర్పించాలి అనే దానిపై కలెక్టర్ శుక్రవారం సాయంత్రం …
Read More »కాలువలు, చెరువు గట్లపై మొక్కలు నాటాలి
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈసారి హరితహారం కార్యక్రమంలో భాగంగా కాలువలు, చెరువు గట్లపై 80 శాతం మొక్కలు నాటాలని నిర్దేశించుకోవడం జరిగిందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వివిధ అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 250 కిలోమీటర్ల పొడుగునా మల్టీ లేయర్ లో మొక్కలు …
Read More »ఈ రోజు మంచి మాట
అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.
Read More »వారం వ్యవధిలో పెండిరగ్ పనులన్నీ పూర్తి కావాలి
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వారం రోజుల వ్యవధిలో విద్యుత్ సంబంధిత పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువు ముగిసిన మీదట ఏ ఒక్క పని కూడా పెండిరగ్ ఉండకూడదని సూచించారు. పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమంలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పనుల ప్రగతిపై కలెక్టర్ గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష …
Read More »శిక్షణ కోసం ఉర్దూ జర్నలిస్టులు పేర్లు పంపాలి
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న శిక్షణ తరగతుల కోసం ఆసక్తిగల ఉర్దూ జర్నలిస్టులు తమ పేర్లు పంపాలని నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి కోరారు. హైదరాబాదులోని ఉర్దూ మస్కాన్, ఖిల్వట్‌లో రెండు రోజుల పాటు శిక్షణా తరగతులు కొనసాగుతాయన్నారు. ఆసక్తి కలిగిన ఉర్దూ జర్నలిస్టులు …
Read More »అరుదైన క్యాన్సర్‌కు విజయవంతంగా ఆపరేషన్
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అరుదైన క్యాన్సర్‌కు విజయవంతంగా శస్త్రచకిత్స చేసిన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యంత అరుదైన క్యాన్సర్‌కు శస్త్రచకిత్స చేసిన జిల్లా ఆసుపత్రి వైద్యుల బృందానికి, సూపరింటెండేంట్ ప్రతిమరాజ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. …
Read More »