నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యా సంవత్సరం ప్రారంభమై మన ఊరు – మనబడిలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను ఇంకెప్పుడు భర్తీ చేస్తారని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఎస్ ప్రదీప్ అన్నారు. నిజామాబాద్ ఎన్.ఆర్. భవన్‌లో పివైఎల్ జిల్లా కమిటీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …
Read More »కోటగిరి హైస్కూలును తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులను పలుకరిస్తూ, భోజనం సక్రమంగానే అందిస్తున్నారా, రుచిగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. మన ఊరు – మన బడి నిధులతో చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించి, అధికారులకు పలు …
Read More »శ్రీశ్రీకి ప్రజా సంఘాల నివాళి
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా కవి, విప్లవ రచయితల సంఘం (విరసం) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీశ్రీ 39 వ వర్ధంతి సందర్భంగా ప్రజాసంఘాల (ఐఎఫ్‌టియు, ఏఐకెఎంఎస్, పివైఎల్) ఆధ్వర్యంలో సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా కార్యాలయం ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏ.ఐ.కె.ఎం.ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. రామకృష్ణ మాట్లాడుతూ శ్రీశ్రీ సాంప్రదాయ కవిత్వాన్ని బద్దలు కొట్టి, ప్రజా …
Read More »సర్కారు బడికి జడ్జి కూతురు
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలలే ప్రతిభాపాటవాలకు,ఉన్నతమైన చదువులకు, మేధా సంపత్తి గల ఉపాధ్యాయులకు అత్యుత్తమ విద్యాలయాలని నిరూపించారు నిజామాబాద్ జూనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్, ప్రియాంక జాదవ్ దంపతులు. వీరిద్దరి ఐదేళ్ల కూతురు అంబికా జాదవ్‌ను నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో బుధవారం ప్రవేశపత్రం నింపి జాయిన్ చేశారు. ఈ …
Read More »డబుల్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలి
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గంలోని మెండోర నుండి రుద్రంగి వయా మానాల వరకు సుమారు రూ. 14.30 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తున్న డబుల్ రోడ్డు పనులు మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. పూర్తి నాణ్యతతో పనులు జరగాలని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదే విధంగా భీంగల్ మండలం దేవక్క …
Read More »విధుల నిర్వహణ కోసం అటెండెన్స్ యాప్‌తోనే హాజరు
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యవసర పరిధిలోకి వచ్చే వైద్యారోగ్య శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందాలన్న ఉద్దేశ్యంతోనే అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇక ముందు కూడా ఇదే పద్దతి కొనసాగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. అటెండెన్స్ యాప్ ద్వారా ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్నది తమ అభిమతం ఎంతమాత్రం కాదని ఆయన పేర్కొన్నారు. మంగళవారం వైద్యారోగ్య …
Read More »ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ స్థాయి మార్పు కనిపించాలి
జక్రాన్‌పల్లి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులతో ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ స్థాయి సదుపాయాలతో స్పష్టమైన మార్పును సంతరించుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలో కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, పల్లె …
Read More »నిజామాబాద్ రెడ్ క్రాస్‌కు అవార్డుల పంట
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగ హైదరాబాద్ రాజ్ భవన్ కమ్యూనిటి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిజామాబాదుకు చెందిన పలువురికి అవార్డులు వరించాయి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం అంటే ప్రపంచ పండుగ అని గవర్నర్ డా.తమిళి సై అన్నారు. మనకు తెలవని వారి ముఖంలో కూడ సంతోషం నింపేది రక్తదానం అన్నారు. తన కేర్ డిగ్రీ కళాశాల ద్వారా …
Read More »కేంద్ర మంత్రిని కలిసిన న్యాయవాదులు
నిజామాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర పాండేను నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్‌లో గల నిఖిల్ సాయి హాల్లో న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. కార్యక్రమంలో న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ ఆనంద్, ప్రధాన …
Read More »హరితహారానికి అన్ని విధాలుగా సన్నద్ధం కావాలి
నిజామాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తూ ఆశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్లో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై హరితహారం అమలుపై దిశా నిర్దేశం చేశారు. రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు కురియనున్న దృష్ట్యా …
Read More »