నిజామాబాద్, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న రెండు ప్రైవేట్ ఆసుపత్రులను బుధవారం సీజ్ చేశామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో సదుపాయాలు, నిబంధనల అమలు తీరును పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలచే ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తూ, సరైన లేబర్ రూమ్, ఇతర …
Read More »ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగాలి
నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య కొంతవరకు పెరిగినప్పటికీ, మరింత గణనీయంగా మెరుగుపడాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. సుఖ ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రుల్లో చేరిన గర్భిణీలు ఎవరైనా కాన్పు జరుగకముందే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలివెళ్లకుండా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వాసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. మంగళవారం సాయంత్రం వైద్యారోగ్య శాఖ పనితీరును కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ …
Read More »పారదర్శకంగా ధాన్యం సేకరణ ప్రక్రియ
నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా నిర్వహించేందుకు గాను సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, ఐకెపి సీసీలు, రైస్ …
Read More »ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యతతో పనులు …
Read More »బైక్ దొంగల అరెస్ట్
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ ప్రాంతాలలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె. ఆర్.నాగరాజు వెల్లడిరచారు. దొంగల నుండి 70 లక్షల విలువ గల 42 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సిపి నాగరాజు వివరించారు. నిజామాబాద్ నగరానికి చెందిన షేక్ …
Read More »పొరపాట్లకు తావులేకుండా గ్రూప్-1 ప్రిలిమ్స్
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఈ నెల 16 వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష సందర్భంగా ఏ చిన్న పొరపాటుకు సైతం తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లలో భాగంగా సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో చీఫ్ సూపరింటెండెంట్‌లతో …
Read More »పక్షం రోజుల్లో పనులు పూర్తి కావాలి
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం మన ఊరు – మన బడి కింద చేపట్టిన పనులన్నీ పక్షం రోజుల్లో పూర్తయ్యేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే తొలి విడతలో ఎంపికైన అన్ని బడులకు నిధులు సమకూర్చడం జరిగిందని, చేపట్టిన …
Read More »నూతన జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలి
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్, కార్మికుల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, దోమకొండ, మద్నూర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్, రాష్ట్ర కార్యదర్శి హసీనా బేగం హాజరై మాట్లాడారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నూతన జీవో 21 …
Read More »కునేపల్లిలో ఉచిత వైద్య శిబిరం
రెంజల్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కునేపల్లి గ్రామంలో శనివారం మేడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ వారు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని సర్పంచ్ రొడ్డ విజయా లింగం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మెడికవర్ ఆసుపత్రి వారు కునేపల్లి గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గ్రామంలో సుమారు 150 మందికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు …
Read More »కోడిగుడ్డు బిల్లులు రాలే… పండగ పూట పస్తులే….
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యాహ్న భోజన పనివారికి దసరా పండగ వెళ పస్తులే ప్రభుత్వం మిగిల్చిందని, అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టు పరిస్థితి ఉందని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరు చక్రపాణి అన్నారు. మంగళవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 9వ, 10వ తరగతి విద్యార్థుల మధ్యాహ్న భోజన …
Read More »