నిజామాబాద్, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు మంగళవారం పెద్ద ఎత్తున వారు ఎంచుకున్న యూనిట్లను పంపిణీ చేయనున్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్ రాం జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో దళిత బంధు యూనిట్ల పంపిణీ కోసం జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రోడ్లు-భవనాల …
Read More »రోడ్డు మార్గాన్ని సర్వే చేయండి
నిజామాబాద్, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూడ మాస్టర్ ప్లాన్‌లో వినాయక్ నగర్ నుండి నాగారం రోడ్డు వరకు ప్రతిపాదించిన వంద ఫీట్ల రోడ్డు మార్గాన్నే సర్వే చేయాలని, ఆ ప్రాంతమంతా పేద, మధ్య తరగతి వారు ఇండ్లు నిర్మించుకున్నారని, ప్లాట్స్ కొనుగోలు చేశారని, నగర నడిబొడ్డు నుండి వంద ఫీట్ల రోడ్డు అవసరం లేదని, ఆ రోడ్డును రద్దు చేయాలని కోరుతూ నిజామాబాద్ నగర …
Read More »పెండిరగ్ దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 52 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల …
Read More »స్థానిక సంస్థల ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
నిజామాబాద్, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ కారణాల వల్ల స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన ఆయా పదవుల భర్తీ కోసం చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఖాళీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టడం జరుగుతుందన్నారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ …
Read More »జిల్లా ప్రజలకు మంత్రి, కలెక్టర్ ఉగాది శుభాకాంక్షలు
నిజామాబాద్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటోందని, ఇప్పటికే సంక్షేమాభివృద్ది …
Read More »కరువు భత్యం అమలుకై ఉద్యమించండి
నిజామాబాద్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెరిగిన కరువు భత్యం అమలుకై పోరాడాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక కోటగల్లిలో విలేకరులతో మాట్లాడారు. వనమాల కృష్ణ మాట్లాడుతూ 1994లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 2021 జనవరి నుండి డిసెంబర్ 2021 వరకు వినిమయ ధరల పెరుగుదల సూచి 1548 పాయింట్ల …
Read More »ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండండి
నిజామాబాద్, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నేడు జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో …
Read More »జిల్లాకు స్త్రీ నిధి రాష్ట్ర స్థాయి అవార్డ్
నిజామాబాద్, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం హైదరాబాదులో జరిగిన స్త్రీ నిధి తొమ్మిదవ సర్వ సభ్య సమావేశంలో 2020-21 ఆర్ధిక సంవత్సరానికి స్త్రీ నిధి యందు అన్ని రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి రావడం జరిగింది. అవార్డ్‌ను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చందర్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు …
Read More »వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి
నిజామాబాద్, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రైతాంగం రబీ సీజన్‌లో పండిరచిన వరి ధాన్యం అంతటిని కేంద్రం కొనుగోలు చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో సభ్యులు ఏకవాక్య తీర్మానం చేశారు. బుధవారం జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్, …
Read More »విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే మన ఊరు – మన బడి
నిజామాబాద్, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చి మరింత బలోపేతం అవుతాయన్నారు. దీంతో మెరుగైన విద్యాబోధన …
Read More »