Tag Archives: nizamabad

ఐఎఫ్‌టియు పోరాట ఫలితం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికుల జీవనభృతికై 2014 జూన్‌ కటాఫ్‌ తేదీని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి, శ్రామిక భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ… బీడీ కార్మికులకు జీవన భృతి అమలు చేయుటకు అడ్డంకిగా వున్న …

Read More »

ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ నిజామాబాద్‌, ఇందుర్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నగరంలోని తిలక్‌ గార్డెన్‌ వద్ద గల లేడీస్‌ క్లబ్‌లో మహిళ అధ్యాపకులు ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ నిజామాబాద్‌ అధ్యక్షురాలు సాక్షి బన్సల్‌ మాట్లాడుతూ సమాజంలో విద్యార్థుల భవితను తీర్చిదిద్దరంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని మహిళా అధ్యాపకులు …

Read More »

పోరాటయోధురాలు ఐలమ్మ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాయుధ పోరాట యోధురాలు, బీసీల నిప్పు కణిక, ధీశాలి చాకలీ ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా వినాయకనగర్‌ హనుమాన్‌ జంక్షన్‌ వద్ద వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బిసి సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. బీసీలు తిరగబడితే దేన్నైనా సాధించవచ్చని ఇందుకు ఐలమ్మ చరిత్రే నిదర్శనమన్నారు. ఇప్పటికైనా బీసీలు మేలుకొని తమను తాము పరిపాలించు …

Read More »

జిల్లా ప్రజలకు గమనిక

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం ప్రగతి భవన్‌లో నిర్వహిస్తూ వచ్చిన ప్రజావాణి కార్యక్రమం, ఇకపై కొత్త కలెక్టరేట్‌లో కొనసాగుతుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు గారిచే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను ప్రారంభోత్సవం చేసుకున్న నేపధ్యంలో న్యూ కలెక్టరేట్‌ వేదికగా జిల్లా పాలన కొనసాగుతోందని …

Read More »

సార్వజనిక్‌ గణేష్‌ మండలి వద్ద కలెక్టర్‌ పూజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం దుబ్బ ప్రాంతంలోని సార్వజనిక్‌ గణేష్‌ మండలి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర రథం వద్ద టెంకాయ కొట్టారు. ఈ సందర్భంగా సార్వజనిక్‌ గణేష్‌ మండలి అధ్యక్షుడు బంటు గణేష్‌ ఇతర ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు కలెక్టర్‌కు …

Read More »

న్యూ కలెక్టరేట్‌లో ప్రజాకవి కాళోజీ జయంతి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 108వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం (న్యూ కలెక్టరేట్‌) కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం, కాళోజీ చిత్రపటానికి పూలమాలలు …

Read More »

ఘనంగా కాళోజీ జయంతి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ వైతాళికుడు, ప్రజా కవి, కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా గాజుల్‌ పెట్‌లోని కాళోజీ విగ్రహానికి నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై తన కవిత్వాల ద్వారా ప్రజలలో ఏర్పాటు ఆవశ్యకతను చేరవేసి మన …

Read More »

గిరిరాజ్‌ కళాశాలలో తెలంగాణ భాషా దినోత్సవం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం తెలుగు విభాగం ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 108వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవాన్ని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి. రామ్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భాష- యాసను కాళోజి తన కవిత్వం ద్వారా బతికించిన విధానాన్ని లఘు చిత్రం (డాక్యుమెంటరీ) రూపంలో ప్రదర్శించారు. సభాధ్యక్షులు ప్రిన్సిపాల్‌ …

Read More »

బ్యాంకర్ల తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంట రుణాల పంపిణీలో బ్యాంకర్లు అలసత్వ వైఖరి ప్రదర్శించడం పట్ల కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అసంతృప్తి వెలిబుచ్చారు. నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనప్పటికీ పంటల సాగు కోసం అవసరమైన రుణాలను రైతాంగానికి పంపిణీ చేయడంలో పలు బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నాయని అన్నారు. ఏది ఎంతమాత్రం సమంజసం కాదని, పనితీరు మార్చుకొని పక్షంలో జిల్లా యంత్రాంగం తరపున కఠిన …

Read More »

బస్సు బోల్తా, తృటిలో తప్పిన ప్రమాదం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ రాష్ట్ర మూడో మహాసభలకు హాజరై శంషాబాద్‌ హైదరాబాద్‌ నుండి నిజామాబాద్‌ వస్తుండగా ప్రమాదవశాత్తు బస్సు బోల్తా పడిరది. బస్సులో ప్రయాణిస్తున్న సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమన్న, జిల్లా కార్యదర్శి పి సుధాకర్‌, జిల్లా నాయకులు ఓమయ్య, రాజేశ్వర్‌లకు గాయాలయ్యాయి. గురువారం ఉదయం నాలుగు గంటలకు సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ నుండి బోధన్‌ డిపో సూపర్‌ లగ్జరీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »