Tag Archives: nizamabad

టిఎన్‌జీవోస్‌ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం టీఎన్జీవో ఆధ్వర్యంలో ఎంప్లాయిస్‌ జేఏసీ చైర్మన్‌ అలుక కిషన్‌ అధ్యక్షతన టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ దాదన్న గారి విట్టల్‌ రావు, నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌, టిఎస్‌డబ్ల్యుడిసి చైర్మన్‌ ఆకుల లలిత, మెడికల్‌ సూపరింటెండెంట్‌ ప్రతిమా రాజ్‌, …

Read More »

ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ప్రారంభోత్సంలో పాల్గొన్న టీయూ న్యాయ విభాగాధిపతి

డిచ్‌పల్లి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కోర్టులో పోక్సో కేసుల కోసం ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ప్రారంభోత్సవం శనివారం ఉదయం నిజామాబాద్‌లోని ప్రధాన కోర్టు ఆవరణలో జరిగింది. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌ సేన్‌ రెడ్డి, జిల్లా న్యాయమూర్తి జస్టిస్‌ సునీతా, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రాజారెడ్డి తదితరులు హాజరైనారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగానికి చెందిన …

Read More »

ప్రభుత్వ మిగులు భూములు గుర్తించండి…..

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో గల ప్రభుత్వ మిగులు భూములను గుర్తిస్తూ, పూర్తి వివరాలతో నివేదికలు అందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో ఆయన ఆర్దీవోలు, తహశీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల భవన నిర్మాణాల కోసం అవసరమైన మేర స్థలాలను కేటాయించాల్సి ఉందన్నారు. అంతేకాకుండా …

Read More »

పదిలో ఉత్తమ ఫలితాల నమోదుకు కృషి చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నత విద్యాభ్యాసానికి పునాదిగా నిలిచే పదవ తరగతి పరీక్షల్లో ప్రతీ విద్యార్ధి చక్కగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించేలా వారిలో విషయ పరిజ్ఞానం పెంపొందింపజేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ గురుతర బాధ్యతను గుర్తెరిగి, అన్ని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు, ప్రిన్సిపల్స్‌ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. మే 11 వ తేదీ నుండి …

Read More »

ప్రజా సమస్యలను పరిష్కరించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులందరికీ ఆసరా పెన్షన్‌ ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, నూతనంగా రేషన్‌ కార్డులు ఇవ్వాలని, పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, సౌత్‌, నార్త్‌, రూరల్‌ తహాసిల్దార్‌ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా …

Read More »

ప్రగతి శూన్యంగా ఉందని కలెక్టర్‌ ఆగ్రహం…

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మెటల్‌ కాంపోనెంట్‌ కింద చేపట్టిన సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పనులకు సంబంధించి సత్వరమే మస్టర్లు రూపొందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 5 వ తేదీ (శనివారం) మధ్యాహ్నం లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయా మండలాల ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీఓలు, …

Read More »

ఇంటి వద్దకే ఆడపడుచుల కానుక

ధర్పల్లి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం మేనమామ పెండ్లి కానుకగా ప్రవేశ పెట్టిన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్‌ సంక్షేమ పథం ద్వారా అందిస్తున్న చెక్కులను మంత్రి కేటిఆర్‌ సూచన మేరకు ధర్పల్లి తహసిల్దార్‌ సహకారంతో రామడుగు గ్రామానికి మంజూరైన 95 చెక్కులను ఇంటింటికి వెళ్లి అందించడం ఆనందంగా ఉందని జడ్పిటిసి బాజిరెడ్డి జగన్‌ మోహన్‌ అన్నారు. శుక్రవారం దర్పల్లి మండలంలోని రామడుగు, …

Read More »

అభివృద్ధి పనులకు తోడ్పాటును అందించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ పథకాల కింద జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేందుకు గ్రామ, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు అధికారులకు తమవంతు తోడ్పాటును అందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. నవీపేట మండల కేంద్రంలోని లింగమయ్యగుట్ట, సుభాష్‌ నగర్‌ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులను కలెక్టర్‌ శుక్రవారం పరిశీలించారు. …

Read More »

ఈ.వీ.ఎం గోడౌన్‌ పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ ప్రాంతంలో గల ఈ.వీ.ఎం గోడౌన్‌లను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే ఉంచే ఈ గిడ్డంగి భవన సముదాయంలో పలు మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో కలెక్టర్‌ ఈవీఎం గోడౌన్‌ ను సందర్శించి నిశితంగా పరిశీలన జరిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో, వీడియో రికార్డింగ్‌ మధ్యన ఈవీఎం …

Read More »

ఆయుష్‌ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన

నిజామాబాద్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆయుష్‌ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్‌ తన ఛాంబర్‌లో ఆయుష్‌ విభాగం వైద్యాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆయుష్‌ పరిధిలోకి వచ్చే మొత్తం 16 వైద్యశాలల్లో కనీస సౌకర్యాలు సమకూర్చేందుకు వీలుగా ఆరు లక్షల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »