నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరిలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నందు మధ్య తరగతి ఉద్యోగుల పన్ను పరిమితిని పది లక్షలకు పెంచాలని, పెన్షనర్లకు ఎలాంటి ఆదాయం లేనందున ఆదాయపు పన్ను పూర్తిగా మినహాయించాలని, ఆదివారం జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. …
Read More »కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజావాణి రద్దు
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సీ.నారాయణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఒకే చోట గుమిగూడి ఉండడం వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజల సౌకర్యార్థం, వారి …
Read More »ఫిబ్రవరి 5 లోపు లబ్దిదారుల ఎంపిక పూర్తికావాలి
నిజామాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది లబ్దిదారులను ఎంపిక చేసి దళితబంధు అమలు అయ్యేలా చూడాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం దళిత బంధు పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి …
Read More »అంబులెన్స్‌ను ప్రారంభించిన మంత్రి
నిజామాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా జనరల్ ఆసుపత్రికి ప్రభుత్వం కేటాయించిన అధునాతన అంబులెన్స్‌ను శనివారం కలెక్టరేట్ లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అంబులెన్స్‌ను రోగుల సౌకర్యం కోసం హ్యూందాయ్ కంపెనీ ప్రభుత్వానికి వితరణ చేయడంతో, ప్రభుత్వం దానిని నిజామాబాద్ జీజీహెచ్‌కు కేటాయించిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు. అంబులెన్స్‌లో వెంటిలేటర్‌తో పాటు …
Read More »అకౌంటెంట్ల బదిలీలు చేపట్టాలి
నిజామాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీబీవీల్లో పనిచేస్తున్న అకౌంటెంట్లకు బదిలీలు చేపట్టాలని, కొత్తగా ఎంపికైన అకౌంటెంట్లకు పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్-టీచింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో, డీఈవో కార్యాలయంలో ఏడీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బందికి గతంలో బదిలీలు చేసినారని, కానీ అకౌంటెంట్‌లకు …
Read More »అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే నిశితంగా పరిశీలించాలి…
నిజామాబాద్, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటింటి ఆరోగ్యం సర్వే, హరితహారం మొక్కల నిర్వహణ, కొవిడ్ నియంత్రణకై చేపడుతున్న వాక్సినేషన్ కార్యక్రమాలకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్ లో జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటింటి ఆరోగ్యం సర్వే వివరాల గురించి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం …
Read More »యువత సన్మార్గంలో పయనించేందుకు క్రీడలు దోహదం
నిజామాబాద్, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువత దురలవాట్లను దూరం చేసుకుని సన్మార్గంలో పయనించేందుకు క్రీడలు ఎంతగానో దోహద పడతాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తమ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తోందని అన్నారు. నిజామాబాదు జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో 2 .5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మినీ స్పోర్ట్స్ …
Read More »జ్వర సర్వే పరిశీలించిన కలెక్టర్
బోధన్, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ మున్సిపాలిటీ పరిధిలో హరితహరం కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అంబం గేట్ వద్ద రహదారికి ఇరువైపులా అవెన్యు ప్లాంటేషన్‌ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నేటి నుంచి జరుగుతున్న ఇంటింటి జ్వర సర్వేను 2వ, 20వ వార్డ్‌లలో సందర్శించారు. సర్వే జరుగుతున్న తీరును ఆశా కార్యకర్తలకు అడిగి తెలుసుకున్నారు. 70 కుటుంబల్లో …
Read More »నిర్లక్ష్యానికి తావిచ్చి… సస్పెన్షన్ పరిస్థితి తెచ్చుకోవద్దు
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న హరితహారం కార్యక్రమం అమలులో నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెన్షన్ వేటు తప్పదని, అధికారులు, సిబ్బంది ఎవరు కూడా ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. హరితహారం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నర్సరీల ఏర్పాటు తదితర అంశాలపై బుధవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల ఎంపీడీవోలు, …
Read More »ప్రైవేట్ వ్యాపార సముదాయాల ఆవరణల్లోనూ మొక్కలు నాటించాలి
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న ప్రైవేట్ వ్యాపార సంస్థలు, సముదాయాల ఆవరణల్లోనూ విరివిగా మొక్కలు నాటించాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం డిచ్‌పల్లి మండలం ధర్మారం, బర్దీపూర్ గ్రామ శివార్లలోని నిజామాబాదు హైదరాబాద్ ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. ఈ మార్గంలో కళ్యాణ మండపాలు, పెట్రోల్ బ్యాంకులు, మార్బల్ షాప్స్ …
Read More »