Tag Archives: nizamabad

అట్రాసిటీ కేసుల్లో త్వరితగతిన చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలి

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు హాజరయ్యారు. ఈ …

Read More »

26 నుండి ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022 విద్యా సంవత్సరంలో ప్రాక్టికల్‌ పరీక్షలు ఫెయిల్‌ అయిన విద్యార్థులకు గైర్హాజరైన విద్యార్థులకు ఈనెల 26వ తేదీ మంగళవారం నుండి 30వ తేదీ శనివారం వరకు ప్రాక్టికల్‌ పరీక్షలను ఇంటర్‌ బోర్డు నిర్వహిస్తుందని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. జనరల్‌ మరియు ఒకేషనల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరు కావలసిన అభ్యర్థులు తమ తమ కళాశాలలో నుండి …

Read More »

బాధితులకు సత్వరమే పరిహారం అందేలా చొరవ చూపాలి

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పలు నివాస గృహాలు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్న నేపథ్యంలో బాధితులకు ప్రభుత్వపరంగా సత్వరమే నష్టపరిహారం అందేవిధంగా సంబంధిత అధికారులు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ఆయా అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. నిర్విరామంగా వారం రోజుల పాటు కురిసిన …

Read More »

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. శుక్రవారం జెడ్పి చైర్మన్‌ అధ్యక్షతన జిల్లా పరిషత్‌ మీటింగ్‌ హాల్‌ లో జరిగిన సర్వసభ్య …

Read More »

కలెక్టరేట్‌లో ఘనంగా బోనాలు పండుగ

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లోని నవదుర్గామాత ఆలయ ప్రాంగణంలో బోనాలు పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉద్యోగుల జెఏసి జిల్లా చైర్మన్‌ అలుక కిషన్‌ నేతృత్వంలో నిర్వహించిన ఉత్సవాల్లో నిజామాబాద్‌ అర్బన్‌ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తా, నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులతో పాటు …

Read More »

వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన కేంద్ర బృందం

నిజామాబాద్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టం వాటిల్లిన వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం గురువారం పర్యటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్‌ రాయ్‌ నేతృత్వంలో దీప్‌ శేఖర్‌ సింఘాల్‌, కృష్ణ ప్రసాద్‌ లతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి వరదలతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. వారి వెంట …

Read More »

ఉరివేసి ఆపై నిప్పెట్టి… రాంచంద్రపల్లి శివారులో వ్యక్తి దారుణ హత్య

నిజామాబాద్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం రాంచంద్రపల్లి శివారులోని జాతీయ రహదారి 63 పక్కన దొడ్డిండ్ల పోశెట్టి (40)ని గుర్తు తెలియని దుండగులు వెంటాడి దాడిచేసి హత్యచేసిన అనంతరం చెట్టుకు ఉరివేసి మరీ నిప్పు పెట్టారు. ఈ ఘటన రాంచంద్రపల్లిలో ఒక్కసారిగా కలకలం రేపింది. మృతుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. …

Read More »

25న చెస్‌ టోర్నీ

నిజామాబాద్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువతీయువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు, మనోవికాసానికి దోహదపడే చెస్‌ క్రీడను, క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్‌ జిల్లా స్థాయిలో చెస్‌ టోర్నమెంట్‌ నిర్వహించాలని నిర్ణయించిందని నిజామాబాద్‌ జిల్లా యువజన అధికారిని, నెహ్రూ యువ కేంద్ర శైలి బెల్లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పోటీ రెండు విభాగాలుగా నిర్వహించబడుతాయని, 15 సంవత్సరాల నుండి 21 …

Read More »

అకమ్రంగా తరలిస్తున్న 140 క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యం పట్టివేత

నిజామాబాద్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం తెల్లవారుజామున రుక్మిణి చాంబర్స్‌ హైదరాబాదు రోడ్డు దగ్గర టిఎస్‌ 12 ల 9792 వ్యాన్‌ ద్వారా తరలిస్తున్న 140 క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యంను పోలీస్‌ పెట్రోలింగ్‌ టీం పట్టుకోవడం జరిగిందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాశ్‌ తెలిపారు. తదుపరి కేసు విచారణ నిమిత్తం పౌరసరఫరాల శాఖకు ఇవ్వడం జరిగిందన్నారు. విచారణ జరిపి 140 …

Read More »

వర్ష సూచనల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు మరింత అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రత్యేక అధికారుల నేతృత్వంలో రేపు (మంగళవారం) మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించాలని, చేపట్టాల్సిన తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »