Tag Archives: nizamabad

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు 2021- 2022 సంవత్సరానికిగాను విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి రఘురాజ్‌ తెలిపారు. సుమారు 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండాకాలంలో వార్షిక పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామనీ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్‌, పోస్టల్‌ శాఖ, ఆర్టీసీ, విద్యుత్తు తదితర శాఖల సమన్వయంతో …

Read More »

రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పౌర హక్కుల సంఘం తెలంగాణ రెండో రాష్ట్ర మహాసభలు ఈనెల 29న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో జరుగుతున్న రెండవ మహాసభ ఉదయం 10 గంటలకు బహిరంగ సభ ప్రారంభం అవుతుంది. అనంతరం మహాసభ ఉంటుంది. మహాసభలకు పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ అధ్యక్షత …

Read More »

కొనుగోలు కేంద్రాలు సందర్శించిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండలం మద్దెలచెరువు, బొల్లక్‌ పల్లి చిల్లర్గి, పిట్లం మార్కెట్‌ కమిటీలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ సందర్శించారు. వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జుక్కల్‌ తాసిల్దార్‌ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో బాన్సువాడ ఆర్‌డిఓ రాజాగౌడ్‌ , సివిల్‌ సప్లై, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Read More »

ఒకరిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ఇంటర్‌ పరీక్షలలో ఒక విద్యార్థిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు కాగా 779 మంది విద్యార్థులు గైర్హాజర్‌ అయినట్లు జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. జిల్లాలో మొత్తం 16,961 మంది విద్యార్థులకు గాను 16,182 మంది విద్యార్థులు హాజరుకాగా 779 మంది విద్యార్థులు గైర్హాజర్‌ అయ్యారని తెలిపారు. నిజామాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ …

Read More »

పనితీరు మెరుగుపర్చుకోకుంటే కఠిన చర్యలు

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పనితీరును మెరుగుపర్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యారోగ్య శాఖ ప్రగతిని సమీక్షించారు. ఆయా పీహెచ్‌సిల వారీగా పనితీరును సమీక్షిస్తూ, ఫలితాల సాధనలో వెనుకంజలో ఉన్న వారిని నిలదీశారు. ప్రధానంగా గర్భిణీల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు, సిజీరియన్‌ ఆపరేషన్లు, ఇమ్యూనైజషన్‌ తదితర …

Read More »

నిశిత డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య బి. విద్యావర్ధిని తదితర సిబ్బంది మంగళవారం ఉదయం నిశిత డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ… నిశిత కళాశాలపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడం వల్ల ఆకస్మిక తనిఖీ నిర్వహించవలసిందిగా వీసీ ఆదేశించారని అన్నారు. చాలినన్ని …

Read More »

19న ఉద్యోగ మేళా

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 19న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అదికారి సిరిమల శ్రీనివాస్‌ తెలిపారు. ఉద్యోగ మేళాకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌ కార్డ్స్‌ హైదరాబాద్‌ జిల్లా 1. బ్రాంచ్‌ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌, 2. బ్రాంచ్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, యూనిట్‌ మేనేజర్‌ ఉద్యోగాలున్నాయన్నారు. 18 సంవత్సరాల నుండి …

Read More »

ఇంటర్‌ పరీక్షల్లో ఒకరిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ పరీక్షల్లో పదవరోజు మంగళవారం జిల్లాలో కాపి చేస్తున్న ఒక విద్యార్థిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు కాగా 956 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్‌ హాజరు అయ్యారని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. రెండవ సంవత్సరం ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ పరీక్షలకు మొత్తం 17,815 మంది విద్యార్థులకు గాను 16,859 మంది విద్యార్థులు హాజరుకాగా 956 …

Read More »

మరమ్మతు పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపడుతున్న నిర్మాణాలు, ఇతర మరమ్మతు పనులను వేగవంతం చేస్తూ, సకాలంలో పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రగతి భవన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి హాస్టల్‌ …

Read More »

ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి శనివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ నుండి నేరుగా నిజామాబాద్‌కు చేరుకున్న ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, డీసీపీ వినీత్‌, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి గోవింద్‌, ఆర్డీవో రవి తదితరులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »