Tag Archives: nizamabad

ఇంటర్‌ పరీక్షలో ఇద్దరిపై మాల్‌ప్రాక్టీస్‌ కేసు

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ పరీక్షల్లో ఎనిమిదవరోజు శనివారం రెండవ సంవత్సరం గణితశాస్త్రం-2, జువాలజీ-2, హిస్టరీ-2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. శనివారం జరిగిన పరీక్షల్లో జిల్లాలో ఇద్దరు విద్యార్థులు కాపి చేస్తుండగా మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం 14,631 మంది విద్యార్థులకు గాను 662 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా …

Read More »

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామని, ఇకపై నూటికి నూరు శాతం ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో ఐసీడీఎస్‌ అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో కలెక్టర్‌ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో …

Read More »

పరీక్షకు 649 మంది గైర్హాజరు

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో శుక్రవారం ఇంటర్‌ పరీక్షల్లో ఒకరి పై మాల్ప్రాక్టీస్‌ కేసు నమోదు కాగా 649 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రఘురాజ్‌ తెలిపారు. ఏడవ రోజు శుక్రవారం మొదటి సంవత్సరం గణిత శాస్త్రం-1, జువాలజీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. శుక్రవారం మొత్తం 14,984 మంది విద్యార్థులకు గాను 649 మంది విద్యార్థులు గైర్‌ హాజరు కాగా …

Read More »

ఫ్రీ కోచింగ్‌ సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రూప్‌ ఎగ్జామ్స్‌తో పాటు పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతీ, యువకులకు ప్రభుత్వం తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వరంలో అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ మెరిట్‌ టెస్ట్‌ ప్రాతిపదికన ఎంపికైన అభ్యర్థులకు ముందస్తు శిక్షణ తరగతులు …

Read More »

లక్ష్య సాధనకు అంకిత భావంతో కృషి చేయాలి

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే నెల జూన్‌ రెండవ వారం నుండి చేపట్టనున్న హరితహారం కార్యక్రమంలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో మొక్కలు నాటేందుకు ఆయా శాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో సమాయత్తం కావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో హరితహారంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో …

Read More »

ప్రశాంతంగా ప్లాట్ల వేలం

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గల ప్రగతి భవన్‌లో గురువారం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో కంటేశ్వర్‌ న్యూ హౌసింగ్‌ బోర్డు కాలనీ ప్లాట్ల వేలంపాట ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాణిజ్యపరమైన విభాగంలో రెండు ప్లాట్లు, నివాస యోగ్యం కలిగిన 19 ప్లాట్ల కోసం ముందస్తుగా లక్ష రూపాయల చొప్పున ఈఎండిలు చెల్లించిన ఔత్సాహిక …

Read More »

వారం రోజుల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తాం

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వారం రోజుల వ్యవధిలో ధరణి టౌన్‌షిప్‌లో విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో ప్లాట్ల, గృహాల విక్రయంపై గురువారం ఫ్రీ బెడ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తామని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు కృషి …

Read More »

సంక్షేమ శాఖల పనితీరు మరింతగా మెరుగుపడాలి

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమ శాఖల పనితీరు మరింతగా మెరుగు పడాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కరోనా తీవ్రత దాదాపుగా తగ్గుముఖం పట్టినందున సంక్షేమ వసతి గృహాల నిర్వహణ పూర్తి …

Read More »

ఇందూరు వాసులకు శుభవార్త

నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 11వ తేదీ బుధవారం రోజు ఉదయం 9.30 గంటలకు నిజామాబాద్‌ నగరంలో ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో సిటీ బస్సులు ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌, నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌, నగర శాసనసభ్యులు బీగాల గణేష్‌ గుప్తతో టీఎస్‌ ఆర్టీసీ ప్రధాన బస్‌ స్టాండ్‌లో నిజామాబాద్‌ నగరంలో సిటీ బస్సులను ప్రారంభించనున్నారు. దీంతో …

Read More »

ప్రసవాలన్నీ ప్రభుత్వాస్పత్రుల్లోనే జరగాలి

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రసవాలు అన్నీ ప్రభుత్వాసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ విషయంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా మండలాల మెడికల్‌ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు వైద్యాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఒక్కో పి.హెచ్‌.సి వారీగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »