నిజామాబాద్, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత ఐదు రోజులుగ నాగారంలోని రాజారం స్టేడియంలో నిర్వహిస్తున్న వహీద్ మెమోరియల్ ఇన్విటేషన్ జాతీయ ఫుట్‌బాల్ మ్సాచ్ లు ముగిసాయి. ఫైనల్ పోటీలో పోటీలో తమిళనాడు, కేర్ ఫుట్‌బాల్ అకాడమీ మధ్యన పోటీ ఆద్యంతం ఉత్కంఠగా కొనసాగింది. మ్యాచ్ మొదటి భాగంలో తమిళనాడు రెండు గోల్స్ సాధించి ఆధిక్యం కొనసాగించింది. ద్వితీయార్దంలో కేర్ ఫుట్‌బాల్ అకాడమీ అత్యద్భుతంగా పోరాడి …
Read More »జీవితంలో ఓడిపోనిది క్రీడాకారుడు మాత్రమే…
నిజామాబాద్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని రాజారామ్ స్టేడియంలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న వహీద్ మెమోరియల్ జాతీయ ఇన్విటేషన్ ఫుట్‌బాల్ పోటీలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. సెమీ ఫైనల్‌కు చేరిన నాలుగు జట్లను సినీ నిర్మాత దిల్ రాజు అభినందించారు. క్రీడాకారులు బస చేసిన ఎస్‌ఎస్‌ఆర్ డిస్కవరీ పాఠశాలకు వెళ్లి క్రీడాకారులను పరిచయం చేసుకొని వారిని అభినందించారు. జీవితంలో గెలుపోటములు సహజం …
Read More »పకడ్బందీగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 25 నుండి నిర్వహించే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు అన్ని ముందస్తు ఏర్పాట్లతో పకడ్బందీగా నిర్వహించుటకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం ఆయన ఛాంబర్‌లో పరీక్షలపై సంబంధిత అధికారులతో ఏర్పాట్ల కొరకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో మొదటి …
Read More »సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగా పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే …
Read More »పంట రుణాల మంజూరులో మంచి ప్రోగ్రెస్, అభినందనలు
నిజామాబాద్, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మహమ్మారి ప్రజలను రైతులను ఎన్నో విధాలుగా బాధించినప్పటికీ బ్యాంకర్లు అండగా ఉండి రుణాల మంజూరులో మంచి ప్రోగ్రెస్ సాధించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. సెప్టెంబర్‌తో ముగించే రెండవ త్రైమాసిక ముగింపును పురస్కరించుకొని బ్యాంకర్ల డిసిసి, డిఎల్‌ఆర్‌సి సమావేశాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ …
Read More »మంగళవారం నుండి ఫుట్‌బాల్ టోర్నీ
నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీనియర్ జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు వహీద్ కరోనా సమయంలో మన అందరికీ దూరమైన సందర్భంలో వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారి పేరుమీద జాతీయస్థాయి ఫుట్‌బాల్ టోర్నీని ఈ నెల 12 తేదీ నుండి 17వ తేదీ వరకు నాగారం రాజారాం స్టేడియంలో నిర్వహిస్తున్నట్టు కార్యక్రమ కార్యనిర్వాహక కార్యదర్శి నరాల సుధాకర్ తెలిపారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం …
Read More »బతుకమ్మతో మళ్లీ పండుగ వాతావరణం
నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చాలా రోజుల తర్వాత మళ్లీ పండగ వాతావరణం కనిపిస్తుందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం టీఎన్జీవోస్, ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఇరిగేషన్ శాఖ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ ఉత్సవాల కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్‌తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీఎన్జీవోస్ శాఖ అధ్యక్షులు అలుక కిషన్ అధ్యక్షత వహించారు. బతుకమ్మ …
Read More »టీఎస్ ఐపాస్ పై సమావేశం
నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించి అనుమతులకు ఆమోదం తెలిపారు. స్వయం ఉపాధి కింద రుణాలు పొందే ఎస్సీ, ఎస్టీలకు 35 శాతం సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాలను ఎస్సీ, ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో ఎస్సీలకు 12 అనుమతులు ఇవ్వగా అందులో ట్రాక్టర్ అండ్ …
Read More »ప్రతి టీం వంద మందికి వ్యాక్సినేషన్ చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయడానికి 360 టీమ్లను ఏర్పాటు చేశామని ప్రతి టీం ప్రతిరోజు వంద మందికి వ్యాక్సినేషన్ చేయాలని ఆదేశించామని కానీ అనుకున్న మేర జరగడం లేదని, అధికారులు ఈ దిశగా లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని బతుకమ్మ చీరలు ఇంకా 20 శాతం పంపిణీ మిగిలి ఉన్నందున మంగళవారం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ …
Read More »డిజెఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చుక్క గంగారెడ్డి
నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్‌కు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమకారులు, సామాజికవేత్త, హక్కుల నేత, ఆర్టీఐ కార్యకర్త అయిన చుక్క గంగారెడ్డిని నియమించినట్లు డిజెఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి మోటపల్కుల వెంకట్ సోమవారం ప్రకటించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామానికి చెందిన చుక్క గంగారెడ్డి చేస్తున్న పోరాటాలు, ఉద్యమాలు, …
Read More »