Tag Archives: nizamabad

ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిశ్రమల తరహాలోనే వ్యవసాయ రంగం కూడా లాభసాటిగా మారాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆకాంక్షించారు. రైతులు మూస ధోరణిని వీడి, అభివృద్ధి చెందిన సాంకేతికతను జోడిస్తూ ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేసినప్పుడే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ దిశా రైతులను ప్రోత్సహించేందుకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు. ప్రధానంగా ఆదర్శ రైతులు, రైతు …

Read More »

మన ఊరు-మన బడి పనులను వెంటనే ప్రారంభించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఇప్పటికే అనుమతి తెలిపిన పనులను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. పనులు వెంటనే ప్రారంభమయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారులదే అని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో నోడల్‌ అధికారులు, ఆయా శాఖలకు చెందిన ఏఈలు, డీఈలు, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్‌ …

Read More »

జిల్లా ఆసుపత్రిని సందర్శించిన టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మంగళవారం జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని సందర్శించారు. ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డిలతో కలిసి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి, మందుల స్టాక్‌ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. …

Read More »

బీడీ కార్మికుల వేతనాలు చెల్లించాలి…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 15 రోజులుగా బీడీ కార్మికులకు పని లేకుండా చేసిన కిషన్‌ లాల్‌ రామ్‌ స్వరూప్‌ బీడీ ఫ్యాక్టరీ ముందు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి మేనేజర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకన్న మాట్లాడుతూ కార్మికులకు కార్మిక …

Read More »

బీసీ స్టడీ సర్కిల్‌ను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని సుభాష్‌ నగర్‌లో గల బిసి స్టడీ సర్కిల్‌ సెంటర్‌ను మంగళవారం కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సందర్శించారు. ఆయా గదులను తిరుగుతూ స్థానికంగా అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. కేంద్రంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్‌ ద్వారా పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న బీసీ అభ్యర్థులకు ముందస్తు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే పై …

Read More »

టీ-ప్రైడ్‌ పథకం కింద సబ్సిడీపై వాహనాలు మంజూరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం టి ఎస్‌ ఐపాస్‌ ద్వారా అమలు చేస్తున్న టి ప్రైడ్‌ పథకం కింద లబ్ధిదారులకు సబ్సిడీతో కూడిన వాహనాలను మంజూరు చేశారు. సోమవారం కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలోని చాంబర్‌లో టీఎస్‌ ఐపాస్‌ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీ ప్రైడ్‌ పథకం కింద దరఖాస్తు చేసుకున్న 12 మంది …

Read More »

బిసిల సంక్షేమమే ధ్యేయంగా పోరాడిన గొప్ప వ్యక్తి ఫూలే

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీ.సీల సంక్షేమమే ధ్యేయంగా జ్యోతి రావ్‌ పూలే అహర్నిశలు కృషి చేశారని తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అబ్బగొని అశోక్‌ గౌడ్‌ అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని స్థానిక వినాయక్‌ నగర్‌లో జ్యోతి రావు పూలే 196 వ జయంతి వేడుకలను తెలంగాణ బి.సి సంక్షేమ …

Read More »

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతిబా పూలే 196వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధ్యక్షత వహించగా, నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌, పోలీస్‌ కమిషనర్‌ కెవి.నాగరాజు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే …

Read More »

పీఆర్‌సి వేతన పెంపు బకాయిలను విడుదల చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేతన పెంపు బకాయిలు విడుదల చేయాలని, కొత్తగా నియమించబడ్డ మున్సిపల్‌ కార్మికులకు వేతన పెంపు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా ప్రభుత్వం కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ …

Read More »

14 న అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14 వ తేదీన జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు ఫులాంగ్‌ చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించడం జరుగుతుందని, అనంతరం రాజీవ్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »