నిజామాబాద్, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మెటల్ కాంపోనెంట్ కింద చేపట్టిన సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పనులకు సంబంధించి సత్వరమే మస్టర్లు రూపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 5 వ తేదీ (శనివారం) మధ్యాహ్నం లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయా మండలాల ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీఓలు, …
Read More »ఇంటి వద్దకే ఆడపడుచుల కానుక
ధర్పల్లి, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం మేనమామ పెండ్లి కానుకగా ప్రవేశ పెట్టిన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ సంక్షేమ పథం ద్వారా అందిస్తున్న చెక్కులను మంత్రి కేటిఆర్ సూచన మేరకు ధర్పల్లి తహసిల్దార్ సహకారంతో రామడుగు గ్రామానికి మంజూరైన 95 చెక్కులను ఇంటింటికి వెళ్లి అందించడం ఆనందంగా ఉందని జడ్పిటిసి బాజిరెడ్డి జగన్ మోహన్ అన్నారు. శుక్రవారం దర్పల్లి మండలంలోని రామడుగు, …
Read More »అభివృద్ధి పనులకు తోడ్పాటును అందించాలి
నిజామాబాద్, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ పథకాల కింద జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేందుకు గ్రామ, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు అధికారులకు తమవంతు తోడ్పాటును అందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. నవీపేట మండల కేంద్రంలోని లింగమయ్యగుట్ట, సుభాష్ నగర్ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. …
Read More »ఈ.వీ.ఎం గోడౌన్ పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ ప్రాంతంలో గల ఈ.వీ.ఎం గోడౌన్‌లను కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే ఉంచే ఈ గిడ్డంగి భవన సముదాయంలో పలు మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో కలెక్టర్ ఈవీఎం గోడౌన్ ను సందర్శించి నిశితంగా పరిశీలన జరిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో, వీడియో రికార్డింగ్ మధ్యన ఈవీఎం …
Read More »ఆయుష్ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన
నిజామాబాద్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆయుష్ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ తన ఛాంబర్‌లో ఆయుష్ విభాగం వైద్యాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయుష్ పరిధిలోకి వచ్చే మొత్తం 16 వైద్యశాలల్లో కనీస సౌకర్యాలు సమకూర్చేందుకు వీలుగా ఆరు లక్షల …
Read More »ఉక్రెయిన్‌పై రష్యా వెంటనే యుద్ధాన్ని విరమించాలి
నిజామాబాద్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధాన్ని నిరసిస్తూ సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో రష్యా దేశం దిష్టిబొమ్మను ధర్నాచౌక్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి (ఇన్చార్జి) వనమాల కృష్ణ మాట్లాడుతూ ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ, రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిందన్నారు. ఈ …
Read More »నగర పాలక సంస్థ 2022 – 23 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ ఆమోదం
నిజామాబాద్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర పాలక సంస్థ 2022 – 23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన బడ్జెట్‌కు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. 2022 – 23 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌తో పాటు 2021 – 22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన సవరణ బడ్జెట్ ఆమోదం నిమిత్తం గురువారం నగర మేయర్ దండు నీతూకిరణ్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని న్యూ …
Read More »పెండిరగ్ దరఖాస్తులపై కలెక్టర్ అసహనం
నిజామాబాద్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో పెండిరగ్‌లో ఉన్న ఎస్.సి., ఎస్.టి, బీ.సి, మైనారిటీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల దరఖాస్తు నిజ ప్రతులను ఈ నెల 4 వ తేదీ శనివారం సాయంత్రంలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ శాఖ కార్యాలయాల్లో అందజేసి …
Read More »జిల్లావాసికి ‘‘హిందీ యౌద్ధ’’ పురస్కారం
నిజామాబాద్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇండోర్‌లో జరిగిన హిందీ గౌరవ్, కావ్య గౌరవ్, హిందీ యోద్ధ పురస్కార సన్మాన వేడుకలో సీనియర్ జర్నలిస్టు మరియు విశ్లేషకులు కృష్ణ కుమార్ అష్టాన మరియు సీనియర్ కథా రచయిత్రి డా. కృష్ణ అగ్నిహోత్రికికి హిందీ గౌరవ్, అలాగే శ్రీమన్నారాయణాచార్యకు ‘‘హిందీ యౌద్ధ’’ పురస్కార సమ్మానం లభించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్ మంత్రి తులసి …
Read More »జిల్లా ప్రజలకు శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు
నిజామాబాద్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. పరమశివుని కృపతో జిల్లా అన్ని రంగాలలో మరింతగా అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడి దీవెనలు కోరుతూ ఆధ్యాత్మిక …
Read More »