నిజామాబాద్, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ శివారులోని సారంగపూర్ వద్ద గల జిల్లా జైలులో గురువారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, జైళ్ల శాఖ డీఐజి డాక్టర్ శ్రీనివాస్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్ తదితరులు హాజరై మొక్కలు నాటారు. అనంతరం జైలు ఆవరణలోని సువిశాలమైన ఖాళీ …
Read More »నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యూత్ పార్లమెంట్ కార్యక్రమం
నిజామాబాద్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ప్రతీ యేటా నిర్వహించే జాతీయ స్థాయి యూత్ పార్లమెంట్ (ఉపన్యాస పోటీ) కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ కార్యక్రమం ఈ నెల 19వ తేదీన ఆన్ లైన్ ద్వారా నిర్వహించనున్నట్టు జిలా యువజన అధికారిణి, శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలో పాల్గొనే వారికి పలు సూచనలు చేశారు. …
Read More »అభివృద్ధి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలకు తావు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేస్తే, మార్చి నెలాఖరు నాటికే బిల్లులు మంజూరయ్యేందుకు ఆస్కారం ఉంటుందని కాంట్రాక్టర్లకు సూచించారు. డిచ్‌పల్లి మండలంలోని ఆయా గ్రామాలలో కొనసాగుతున్న ప్రగతి పనులను కలెక్టర్ మంగళవారం …
Read More »పుస్తక పఠనం గొప్ప అభిరుచి
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పుస్తకాలు అందించే జ్ఞానం జీవితాన్ని గొప్పగా నడిపిస్తాయని, పుస్తక పఠనం ప్రపంచంలోనే అత్యంత మంచి అభిరుచి అని ప్రముఖ సమాజ సేవకుడు మంచాల జ్ఞానేందర్ గుప్తా అన్నారు. ఫిబ్రవరి 14 ప్రపంచ పుస్తక వితరణ దినోత్సవం సందర్భంగా హరిద రచయితల సంఘం ఆధ్వర్యంలో నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. …
Read More »స్పెషల్ బి.ఇడి ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు మార్చి 11 చివరితేదీ
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించే స్పెషల్ బి.ఇడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు చివరితేదీ మార్చి 11 అని అధ్యయన కేంద్ర రీజనల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. మానసికంగా చెవులకు, కళ్ళు సంబంధిత అంగవైకల్యంతో ఉన్న పిల్లలకు బోధించడానికి స్పెషల్ బి.ఇడి ఉపయోగపడుతుందన్నారు. బి.ఏ., బి.కాం., బి.ఎస్‌సి., బి.సి.ఏ., బి.బి.ఎం., బి.ఇ., …
Read More »ఈ నెల 18 వరకు ఆర్థిక అక్షరాస్యత వారం
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గో డిజిటల్ గో సెక్యూర్ అనే అంశంపై భారతీయ రిజర్వ్ బ్యాంకు ఈ నెల మూడవ వారాన్ని ఆర్థిక అక్షరాస్యత వారంగా నిర్ణయించిందని లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ యు ఎన్. శ్రీనివాసరావు తెలిపారు. దీనిని పురస్కరించుకుని రూపొందించిన గోడ ప్రతులను సోమవారం స్థానిక ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎల్‌డీఎం శ్రీనివాసరావు …
Read More »ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 76 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత …
Read More »మీ సేవ ద్వారా సమ్మక్క సారలమ్మ జాతర ప్రసాదం
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ జాతర ప్రసాదంను మీ సేవ ద్వారా అందించేలా ఏర్పాట్లు చేసిందని ఈ-సేవ జిల్లా మేనేజర్ కార్తీక్ తెలిపారు. భక్త్తులు తమ సమీపంలోని మీ సేవా కేంద్రంలో 225 రూపాయలు చెల్లిస్తే, కొరియర్ ద్వారా నేరుగా ఇంటికే సమ్మక్క సారలమ్మ జాతర ప్రసాదంను పంపించడం జరుగుతుందన్నారు. భక్తులు చెల్లించే 225 …
Read More »ఉద్యమ స్పూర్తితో మన ఊరు – మన బడి కార్యక్రమం
నిజామాబాద్, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యా వ్యవస్థను మరింతగా పటిష్టపరిచేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు పిలుపునిచ్చారు. శనివారం వారు రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఊరు – మన …
Read More »నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా, పాజిటివ్ లైఫ్ శిక్షణ
నిజామాబాద్, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా,పాజిటివ్ లైఫ్ శిక్షణ శనివారం నగరంలోని విశ్వశాంతి కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘు రాజ్, తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ చందుపట్ల ఆంజనేయులు, జిల్లా యోగ ప్రచారక్ ప్రవీణ్ కుమార్, విశ్వశాంతి విద్యాసంస్థల కరస్పాండెంట్ రోజా ప్రభాకర్ రావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వేద …
Read More »