Tag Archives: nizamabad

యువజన సంఘాన్ని విస్తరించడం కోసం కిరణ్‌ కుమార్‌ కృషిచేశారు

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్‌ఆర్‌ భవన్‌లో కామ్రేడ్‌ వేములపల్లి కిరణ్‌ కుమార్‌ వర్ధంతి సందర్భంగా పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోటు రవీందర్‌, పివైఎల్‌ జిల్లా అధ్యక్షుడు కిషన్‌ మాట్లాడుతూ పీవైఎల్‌ జిల్లా తొలి కన్వీనర్‌ అయిన వేములపల్లి కిరణ్‌ …

Read More »

కలెక్టరేట్‌లో షహీద్‌ దివస్‌

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకుంటూ ఆదివారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో షహీద్‌ దివస్‌ నిర్వహించారు. దేశానికి ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుండి విముక్తి కల్పించేందుకు పోరాడుతూ అసువులు బాసిన స్వాతంత్ర సమరయోధులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేసిన మహనీయులను …

Read More »

ధరణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పెండిరగ్‌ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రగతిభవన్‌లో శనివారం ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్‌ సమావేశమై ధరణి పెండిరగ్‌ దరఖాస్తుల విషయమై సమీక్షించారు. ఎన్ని దరఖాస్తులు ఏయే విభాగంలో పెండిరగ్‌లో ఉన్నాయి, వాటి పరిష్కారానికై చేపడుతున్న చర్యలు ఏమిటీ, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్న దరఖాస్తులు …

Read More »

డ్రాప్‌ బాక్స్‌ వినియోగించుకోవాలి

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వ్యాప్తి దృష్ట్యా, ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేయడమయ్యిందని కలెక్టర్‌ సీ.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఒకే చోట గుమిగూడి ఉండడం వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడిరచారు. అయితే ప్రజల సౌకర్యార్థం, వారి …

Read More »

అర్బన్‌ పార్క్‌ పనులు సకాలంలో పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేస్తున్న అర్బన్‌ పార్క్‌ పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) చిత్రా మిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌తో కలిసి నిజామాబాద్‌ శివారులోని చిన్నపూర్‌ రిజర్వ్‌ ఫారెస్టు వద్ద ఏర్పాటు చేస్తున్న అర్బన్‌ పార్కును సందర్శించారు. ఇక్కడ …

Read More »

తొర్తి బహిష్కరణ వివాదంపై మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మౌనమేలా?

నిజామాబాద్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో రెండు నెలలుగా మాల, మాదిగ, గుండ్ల, చాకలి, కుమ్మరి, కమ్మరి, ముదిరాజ్‌, పద్మశాలి, గొల్ల ఇతర మైనారిటీ కులస్తులందరికీ సాంఘిక బహిష్కరణ విధించిన ఆధిపత్య మున్నూరు కాపు వర్గంపై కేసులు నమోదు చేయాలని జరుగుతున్న ఆందోళనలపై మంత్రి ప్రశాంత్‌ రెడ్డి స్పందించాలని, తన నియోజకవర్గంలోని గ్రామంలో బహిష్కరణ వివాద పరిష్కారానికి కృషి చేయాల్సిన …

Read More »

నామ్‌ కే వాస్తే అన్నట్టుగా పనిచేస్తే ప్రయోజనం ఉండదు

నిజామాబాద్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పచ్చదనం పెంపొందిస్తూ, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న హరితహారం కార్యక్రమంలో మొక్కల నిర్వహణ ఎంతో కీలకం అని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాతో కలిసి నిజామాబాద్‌ నగరంలోని సాయినగర్‌, నాగారం, సారంగపూర్‌, బైపాస్‌ రోడ్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. …

Read More »

ఈనెల 31లోగా దళిత బంధు నివేదికలు అందించాలి

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో దళిత బంధు అమలుకు సంబంధించి ఈ నెల 31వ తేదీలోగా సమగ్ర నివేదికలు అందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశమై దళిత బంధు పథకం యూనిట్ల గుర్తింపు తదితర అంశాలను సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో సర్వే బృందాలు రెండు రోజుల పాటు పర్యటించిన సందర్భంగా …

Read More »

హరిత హారంలో ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలి

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న హరితహారం కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ సూచించారు. నాటిన ప్రతి మొక్క సంరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. కలెక్టర్‌ నారాయణ రెడ్డి గురువారం డిచ్‌పల్లి నుండి జిల్లా సరిహద్దు బాల్కొండ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో …

Read More »

ఎస్‌ఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి…

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో సాంఘిక బహిష్కరణ చేసిన ఆధిపత్య మున్నూరు కాపు వర్గంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారిపై ఏర్గట్ల ఎస్‌ఐ రాజు బెదిరిస్తూ చంపేస్తా చీరేస్తా అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నందున అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఇతర కులాలను బహిష్కరించిన ఆధిపత్య మున్నూరు కాపు వర్గం పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »