నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయ ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని …
Read More »ఓపెన్ యూనివర్శిటీ అన్ని పరీక్షలు వాయిదా
నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ డా.యన్.అంబర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ తరువాత …
Read More »జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
నిజామాబాద్, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రజలకు, రైతాంగానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో విరాజిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో స్వరాష్ట్రంలో సాగునీటి రంగంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, పంటపెట్టుబడి సాయం, …
Read More »నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు…
నిజామాబాద్, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ పెంచే బాధ్యత అటవీ శాఖ అధికారులదేనని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. గురువారం ఎడపల్లి మండలం జాన్కంపెట్, ఎడపల్లి గ్రామాలలో రహదారికి ఇరువైపులా పెంచుతున్న అవెన్యూ ప్లాంటేషన్‌ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారంలో భాగంగా జిల్లాలో ఎడపల్లి మండలం జాన్కంపెట్, ఎడపల్లి గ్రామాలలో రోడ్లకు ఇరువైపుల అవెన్యూ ప్లాంటేషన్‌లో …
Read More »14న సూర్యనమస్కార వేడుకలు
కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్ర భారత అమృత మహోత్సవాల్లో భాగంగా జాతీయ యువజన వారోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్న సెమినార్‌లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా నుంచి ఎంపిక చేయబడిన యువతీయువకులు పాల్గొన్నారు. 14వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సూర్యనమస్కార వేడుకలో జిల్లా యువతీ యువకులు తమ తమ ఇళ్లల్లో సాధన చేస్తూ ఫోటోలు, వీడియోలు తమకు పంపవలసిందిగా కోరుతున్నామని జిల్లా …
Read More »17న ఓటర్ ఎపిక్ కార్డులు తీసుకెళ్ళండి…
నిజామాబాద్, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం లో భాగంగా 2022 జనవరి ఒకటవ తేదీ నాటికి 18 సం. లు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులు (ఎపిక్ కార్డు) లు బి.ఎల్.ఓ.ల ద్వారా అంద చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డా. శశాంక్ గోయల్ అధికారులకు సూచించారు. బుధవారం హైద్రాబాద్ నుండి …
Read More »విహెచ్‌పి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నిజామాబాద్, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వహిందూ పరిషత్, దుర్గవాహిని ఆధ్వర్యంలో ముగ్గులపోటి నిర్వహించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో పోటీలు నిర్వహించారు. భారతీయ సంస్కృతులూ, సంప్రదాయాల ముఖ్య ఉదేశ్యంతో పోటీ నిర్వహించామని, పిల్లలు, పెద్దలు, మహిళలు కరోనా నిబంధనలు పాటిస్తు, ఆహ్లాదకరమైన వాతావరణం లో పోటీ జరిగిందని దుర్గావాహిని జిల్లా సహ సంయోజనీ నాంచారి రaాన్సీ తెలిపారు. ముఖ్య …
Read More »మార్చిలోగా ప్రగతి పనులన్నీ పూర్తి కావాలి
నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిలో ఉన్న పనులన్నీ మార్చిలోగా పూర్తి కావాలని, అందుకు అధికారులంతా సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని, ఉన్నతాధికారులంతా క్షేత్ర పర్యటనలు చేసి, పనులను పర్యవేక్షించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్బోధించారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పథకాల పనితీరు, ప్రగతిపై హైదరాబాద్‌లోని తన పెషీ చాంబర్ నుంచి, …
Read More »అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా అశోక్ గౌడ్
నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా అంతర్జాతీయ మానవ హక్కుల సమితి అధ్యక్షులుగా అబ్బ గోని అశోక్ గౌడ్‌కి తెలంగాణ అంతర్జాతీయ మానవ హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షులు కుమార్ మహేంద్ర హైదరాబాదు ప్రధాన కార్యాలయంలో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ మానవ హక్కుల కోసం ఎల్లవేళల కృషి చేస్తానని, సామాన్య ప్రజలకు తన సహాయ …
Read More »వడ్డీ వ్యాపారుల ఆగడాలను నియంత్రించాలి
నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టాలని, పప్పుల సురేష్ కుటుంబ సభ్యుల మరణాలకు కారణమైన బిజెపి నాయకుడు, ఇతర వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పివైఎల్, పివోడబ్ల్యు, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పీవైఎల్ జిల్లా అధ్యక్షులు బి.కిషన్, ప్రధాన కార్యదర్శి ఎం.సుమన్, పీవోడబ్ల్యూ …
Read More »