Tag Archives: nizamabad

ఎస్‌సి విద్యార్థులకు ఆల్‌ ఇన్‌ వన్‌ పుస్తకాల పంపిణీ

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని 421 మంది ఎస్‌సి విద్యార్థులకు టెన్త్‌ క్లాస్‌ ఆల్‌ ఇన్‌ వన్‌ గైడ్‌ పుస్తకాలు అందజేసినట్లు జిల్లా ఎస్‌సి అభివృద్ధి అధికారి శశికళ ప్రకటనలో తెలిపారు. టెన్త్‌ విద్యార్థులకు వందరోజుల యాక్షన్‌ ప్లాన్‌ కార్యక్రమంలో భాగంగా బిట్స్‌తో తయారుచేసిన పుస్తకాలను విద్యార్థుల కోసం సేకరించి హాస్టల్‌ విద్యార్థులకు పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులు గైడ్‌ లను …

Read More »

అకౌంటెంట్ల బదిలీలు చేపట్టాలి

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేజీబీవీల్లో పనిచేస్తున్న అకౌంటెంట్లకు బదిలీలు చేపట్టాలని, కొత్తగా ఎంపికైన అకౌంటెంట్లకు పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్‌-టీచింగ్‌, వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యు) ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, డీఈవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బందికి గతంలో బదిలీలు చేశారని, కానీ …

Read More »

పివైఎల్‌ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్‌) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్‌.ఆర్‌ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈనెల 4న గడ్కొల్‌లో జరిగిన జిల్లా జనరల్‌ కౌన్సిల్‌లో ఎన్నుకోబడ్డ ప్రగతిశీల యువజన సంఘం నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా బట్టు కిషన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం. సుమన్‌, ఉపాధ్యక్షులుగా మారుతి గౌడ్‌, …

Read More »

కేర్‌ డిగ్రీ కళాశాలలో కరోనా వ్యాక్సినేషన్‌

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండు రోజులుగా స్థానిక కేర్‌ డిగ్రీ కళాశాలలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు వ్యాక్సినేషన్‌ చేయించుకుంటున్నారన్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌తో పాటు కరోనాను ఎదుర్కొనేందుకు విద్యార్థులందరు విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ …

Read More »

సమాచారం తెలపండి… వివరాలు గోప్యంగా ఉంచుతాం…

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజినల్‌ పరిధిలో ఎక్కడైనా మట్కా, గుట్కా, పేకాట, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నడుస్తున్నట్లు తెలిసిన అలాంటి వారి సమాచారం ఈ దిగువ ఫోన్‌ నెంబర్లకు తెలియజేయాలని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాచారం తెలియజేసిన వారికి ప్రత్యేకరివార్డు ఇవ్వడం జరుగుతుందని, సమాచారం …

Read More »

రైతుబంధుపై విజయోత్సవాలు నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సబ్సిడీ కింద అందిస్తున్న రైతుబంధు పై విజయోత్సవ కార్యక్రమాలు ఈ నెల 10 వరకు నిర్వహించాలని, జిల్లాలో మార్చి చివరి నాటికి దళిత బంధు కార్యక్రమంలో 100 యూనిట్లు గ్రౌండిరగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా …

Read More »

మహిళా హక్కుల కొరకు నినదించిన గళం సావిత్రి బాయి

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే 191వ జయంతి వేడుకలు నిర్వహించారు. కేవలం బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా అగ్ర వర్ణాల నిరుపేదలకు కూడ తాను స్థాపించిన పాఠశాలలో 150 సంవత్సరాల క్రిందటే చదువు నేర్పిన గొప్ప దార్శనికురాలు సావిత్రి బాయి ఫూలే అని నాయకులు పేర్కొన్నారు. తమ …

Read More »

ఏడవ తేదీ కల్లా వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజుకు 30 వేల చొప్పున జనవరి 7 కల్లా 15 సంవత్సరాలు పూర్తిచేసుకున్న 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాక్సినేషన్‌ నూటికి నూరు శాతం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ ఇతర సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుండి వైద్య ఆరోగ్య శాఖ, ఆర్‌డివోలు, సంక్షేమ, విద్యాశాఖ అధికారులతో …

Read More »

కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు, సిబ్బంది

నిజామాబాద్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022 నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డిని పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌ నాగరాజ్‌, లోకల్‌ బాడీస్‌ అదనపు కలెక్టర్‌ చిత్రా మిశ్రా, ఇతర అధికారులు, వారి సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో పలువురు అధికారులు, సిబ్బంది కలెక్టర్‌ను కలిశారు. కలెక్టరేట్‌ ఏవో సుదర్శన్‌, సిబ్బంది, జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు …

Read More »

నిందితుల అరెస్్ట‌..

నిజామాబాద్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండు రోజుల క్రితం బర్దిపూర్‌ శివారులో జరిగిన హత్య కేసు వివరాలను నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు వెల్లడిరచారు. వివరాలు ఇలా ఉన్నాయి… 29వ తేదీ బుధవారం రాత్రి సమయంలో బద్ధిపూర్‌ గ్రామ శివారులో ఈనాడు ఆఫీస్‌ ప్రక్కన బర్దిపూర్‌ గ్రామానికి వెళ్లే బి.టి రోడ్డులో నాగారం నిజామాబాద్‌కు చెందిన షేక్‌ మాజీద్‌ అనే వ్యక్తిని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »