Tag Archives: nizamabad

నిజామాబాద్‌ జిల్లా మొదటి స్థానంలో ఉంది…

కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిజామాబాద్‌ జిల్లా ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్‌ ప్రగతి భవన్‌లో జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిజామాబాద్‌లో 100 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 80 శాతం ధాన్యం కొనుగోలు …

Read More »

జిల్లా స్థాయి విజేతలు రాష్ట్రస్థాయిలో చక్కటి ప్రదర్శన కనబర్చాలి…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు స్థానిక గంగస్తాన్‌ ఫేస్‌ 3 లోని రామకృష్ణ సేవా సమితిలో శుక్రవారం నిర్వహించారు. మండల స్థాయిలో ఎంపిక చేయబడ్డ యువతీ యువకులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. దేశ భక్తి – జాతి నిర్మాణం అనే అంశం మీద జరిగిన ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా యువత …

Read More »

ప్రభుత్వ స్థలాలు అమ్మినా, కొన్నా క్రిమినల్‌ కేసులు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమించుకొని ఎవరైనా అమ్మినా, కొన్నా క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు అన్నింటి గుర్తించి పది రోజుల్లో బౌండరీలు ఫిక్స్‌ చేసి బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిజామాబాద్‌లోని ధర్మపురి హిల్స్‌, అర్సపల్లి, సారంగాపూర్‌ ప్రాంతాలలో …

Read More »

సెల్‌ టవర్‌ నిర్మాణం ఆపేయాలని ధర్నా

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూరు రాంనగర్‌లో సెల్‌ టవర్‌ నిర్మాణం ఆపాలని సెల్‌ టవర్‌కి పర్మిషన్‌ ఇవ్వద్దని గురువారం ఆర్మూర్‌ పట్టణంలోని రామ్‌ నగర్‌ ప్రజలు నిజామాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయం చేరుకొని ధర్నా చేసి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఆర్మూర్‌ ఏరియా కార్యదర్శి పల్లపు వెంకటేష్‌ మాట్లాడుతూ ప్రజల నివాసాల మధ్య సెల్‌టవర్‌ నిర్మించడం సరైంది కాదని …

Read More »

కోవిడ్‌ ఎక్స్‌గ్రేషియా కొరకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా చెల్లించుటకు కుటుంబ సభ్యులు సంబంధిత వైద్య ధ్రువపత్రంతో మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో కోవిడు బారిన …

Read More »

పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డెవలప్‌మెంట్‌ ఫీజు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో విద్యార్థుల వద్ద డెవలప్‌మెంట్‌ ఫీజుల వసూలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీరామ్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సీ.హెచ్‌ కల్పన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా …

Read More »

ఏ పంటలు వేస్తే రైతుకు మంచిదో వివరించండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగిలో వడ్లను కొనే అవకాశం లేనందున వరికి బదులు రైతులు పంట మార్పిడి ద్వారా ఏ పంటలు సాగు చేయాలో వివరించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, కె.వి.కె. శాస్త్రజ్ఞులు, రైస్‌ మిల్లర్లు, రైతుబంధు ప్రతినిధులు, విత్తన డీలర్లతో సమావేశం …

Read More »

వ్యాక్సిన్‌ తీసుకోకుంటే థర్డ్‌ వేవ్‌ ప్రమాదం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ చివరి నాటికి తప్పనిసరి రెండు డోస్‌లు వ్యాక్సిన్‌ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ దాదన్న గారి విట్టల్‌ రావు ప్రజలను కోరారు. గురువారం కరోనా వ్యాక్సినేషన్‌ పై కలెక్టర్‌ జడ్పీ చైర్మన్‌తో కలిసి మండలాల ప్రజా ప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ …

Read More »

వందశాతం రెండు విడతల వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ చివరికల్లా రాష్ట్రంలో రెండు విడుదల వ్యాక్సినేషన్‌ నూరు శాతం పూర్తి చేయడంతోపాటు ఓమైక్రాన్‌ గురించి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖామాత్యులు టి హరీష్‌ రావు కలెక్టర్లు ప్రజా ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్‌, ప్రపంచవ్యాప్తంగా …

Read More »

ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌ ఇంటర్‌ కాలేజీలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్‌ విద్యాధికారి (డిఐఇవో) కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్‌ కల్పన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »