Tag Archives: nizamabad

టి.బి. నివారణకు ముందస్తు మందులు

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టి. బి. రాకుండా నివారించడానికి ముందస్తుగా మందులు పంపిణీ జరుగుతున్నదని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో టి. బి. ప్రివెంట్‌ ధెరపీ మందుల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటిసారి టీ.బీ. నివారణ మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చాలా సంవత్సరాలుగా ప్రభుత్వం టీబి పైన అనేక రకాలుగా ప్రజలను అప్రమత్తం …

Read More »

మద్యం దుకాణాల కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లాలో ఇటీవల నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియలో నిలిచిన నిజామాబాదు పట్టణంలోని గెజిట్‌ షాప్‌ నెంబర్‌. నిజామాబాద్‌ 008, ఎడపల్లి మండలంలోని జానకంపేట గెజిట్‌ షాప్‌ నెంబర్‌. నిజామాబాద్‌ 0036, వేల్పూర్‌ మండలంలోని పడగల్‌ గెజిట్‌ షాప్‌ నెంబర్‌. నిజామాబాద్‌ 099 దుకాణాల కేటాయింపునకు గాను దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్‌ అధికారి ఎస్‌. నవీన్‌ …

Read More »

స్వచ్ఛమైన ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా చూడటంతోపాటు తప్పులేని జాబితా సిద్ధం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్‌ఎస్‌ఆర్‌ (స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌) పరిశీలకులు విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఓటర్లుగా ప్రత్యేక నమోదు కార్యక్రమం పరిశీలనలో భాగంగా ఆయన నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించారు. డిచ్‌పల్లి మండలంలోని …

Read More »

పెన్షనర్ల ధర్నా విజయవంతం చేయండి

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెన్షనర్లు ఎదుర్కొంటున్నసమస్యలు పరిష్కరించాలని, నవంబర్‌ 26 హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డు పర్సన్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. గురువారం పెన్షనర్ల సంఘం వినాయక్‌ నగర్‌లో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శాస్త్రుల దత్తాత్రేయ రావు మాట్లాడారు. పిఆర్సి బకాయిలను …

Read More »

ప్రతి పనిలో పారదర్శకత పాటించాలి…

డిచ్‌పల్లి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనుల ప్రణాళిక 2022-23 సంవత్సరానికి గాను జిల్లాలోని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులకు, మండల పంచాయతి అధికారులకు, ఆదనపు కార్యక్రమ అధికారులకు (ఏపివో), ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్లకు, సాంకేతిక సహయకులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని డిచ్‌పల్లి టిటిడిసిలో నిర్వహించారు. ప్రణాళిక తయారిలో బాగంగా లేబర్‌ బడ్జెట్‌కు అనుగుణంగా పనులను …

Read More »

శిక్షణ ద్వారా స్వయం ఉపాధికి అవకాశాలు

డిచ్‌పల్లి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌బిఐ అందిస్తున్న శిక్షణ ద్వారా స్వయం ఉపాధికి భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. ఎస్‌బిఐ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఇటిఐ ద్వారా స్వయం ఉపాధికి శిక్షణ పొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందించారు. గురువారం డిచ్‌పల్లిలోని స్టేట్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో, టిటిడిసిని ఆయన సందర్శించారు. ఆర్‌ఎస్‌ఇటిఐ ఆధ్వర్యంలో సిసిటివి శిక్షణ ముగించుకున్న …

Read More »

పోలీస్‌ స్టేషన్లను పరిశీలించిన‌ సిపి కార్తికేయ

నిజామాబాద్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వేల్పూర్‌ నుండి మోతే వెళ్లే రహాదారిలో మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఒక కారు అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొనడంతో అందులో గల ముగ్గురిలో ఇద్దరూ సంఘటన స్థలంలో మరణించారు. అట్టి సంఘటన స్థలాన్ని బుధవారం నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తీకేయ సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు …

Read More »

నామినేషన్ల పరిశీలన…

నిజామాబాద్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల పరిశీలకులు అనితా రాజేంద్ర సమక్షంలో బుధవారం రిటర్నింగ్‌ అధికారి, నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్లను పరిశీలించారు. నామినేషన్‌ల చివరి రోజైన మంగళవారం నాటికి ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు సమర్పించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత నామినేషన్‌ పత్రాలు సరిగా ఉన్నట్లు ధృవీకరించారు. స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్‌ …

Read More »

నర్సరీలో పనులు పక్కాగా నిర్వహించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారానికి నర్సరీలు ఎంతో ముఖ్యమైనవని, ఈ పనులు పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సినారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌ నుండి పలు అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. లేబర్‌ టర్నవుట్‌ సిస్టమేటిక్‌గా మెయింటెన్‌ చేయాలని, కింది వాళ్లను గైడ్‌ చేస్తూ వెళ్లాలని, నర్సరీలలో సాయిల్‌ కలెక్షన్‌ రేపు, …

Read More »

కలెక్టర్‌ను కలసిన తెయు ఉపకులపతి

డిచ్‌పల్లి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.రవీందర్‌ నిజామాబాద్‌ జిల్లా కలక్టర్‌ సి. నారాయణ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధికి సహకరించాలని తెయూ ఉపకులపతి ఆచార్య డి రవీందర్‌ గుప్తా నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ని సన్మానించారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »