Tag Archives: nizamabad

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన శ్రీజ జాదవ్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబర్‌ 2 మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యువతకు జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నెహ్రూ యువ కేంద్ర జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పోటీలలో భాగంగా జిల్లా స్థాయిలో జరిగిన ఉపన్యాస పోటీలలో ప్రథమ స్థానంలో శ్రీజ జాదవ్‌, ద్వితీయ స్థానంలో చరణ్‌ తేజ నిలిచారు. …

Read More »

మట్టి గణపతులను పూజిద్దాం … పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్టించి, వినాయక చతుర్థి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం సుభాష్‌ నగర్‌ లోని జిల్లా పరిషత్‌ కూడలి వద్ద మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని ప్రజలకు చెరువు మట్టితో …

Read More »

టెట్‌ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టెట్‌ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌ నగర్‌లో గల ఎస్‌.వీ కళాశాలలో కొనసాగుతున్న పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలన జరుపుతూ, చీఫ్‌ సూపరింటెండెంట్‌ను కలెక్టర్‌ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనలను పాటిస్తూ, సమయానుసారంగానే ప్రశ్నాపత్రాల బండిళ్లను తెరిచారా అని …

Read More »

ఆంధ్రనగర్‌కు స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలంలోని ఆంధ్రనగర్‌ గ్రామ పంచాయతీకి రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్‌ గ్రామీణ్‌ అవార్డు వరించింది. స్వచ్చ సర్వేక్షణ్‌ గ్రామీణ 2023 లో ఉత్తమ పనితీరు కనబరిచిన గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం, త్రాగునీరు, పారిశుధ్యం, పచ్చదనం, తదితర అంశాలను ప్రాతిపదికగా ఎంపిక ప్రక్రియను నిర్వహించింది. ఈ మేరకు ఆంధ్రనగర్‌ జీ.పీ అవార్డుకు …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, సెప్టెంబరు 15, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య ఉదయం 6.07 వరకుతదుపరి భాద్రపద శుద్ధ పాడ్యమివారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తర పూర్తియోగం : శుభం తెల్లవారుజాము 4.46 వరకుకరణం : నాగవం ఉదయం 6.07 వరకు తదుపరి కింస్తుఘ్నం రాత్రి 7.00 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.04 – …

Read More »

హిందీ భారతీయతకు ఆత్మ లాంటిది

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జాతీయ హిందీ దినోత్సవ సందర్భంగా హిందీ కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ మాట్లాడుతూ ప్రాంతాలకు అతీతంగా మనుషులను, మనసులను కలిపి ఉంచే భాష హిందీ అని, హిందీ కేవలం భాష మాత్రమే కాదని భారతీయుల అంతరాత్మ వంటిదని అన్నారు. రాబోయే తరాలకు హిందీ భాషలో …

Read More »

ప్రశాంత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో వినాయక చతుర్థి, మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు జరుపుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి గణేష్‌ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, సెప్టెంబరు 14, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య పూర్తివారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పుబ్బ తెల్లవారుజాము 5.09 వరకుయోగం : సాధ్యం తెల్లవారుజాము 4.22 వరకుకరణం : చతుష్పాత్‌ సాయంత్రం 5.05 వరకు తదుపరి నాగవం వర్జ్యం : ఉదయం 11.27 – 1.13దుర్ముహూర్తము : ఉదయం 9.54 – 10.43మధ్యాహ్నం …

Read More »

రాష్ట్రపతిచే దృశ్యమాధ్యంలో ఆయుష్మాన్‌ భవ ప్రారంభోత్సవం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయుష్మాన్‌ భవ కార్యక్రమాన్ని దృశ్య శ్రవణ మాధ్యమంలో గుజరాత్‌ రాజభవన్‌ నుండి ప్రారంభించారు. కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆధ్వర్యంలో ఐడిఓసి లోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్లో పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయుష్‌ ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తూ, ఆయుష్‌ హెల్త్‌ వెల్నెస్‌ సెంటర్స్‌లలో …

Read More »

కలెక్టరేట్‌ వద్ద మధ్యాహ్న బోజన కార్మికుల ధర్నా

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులు సమ్మె చేసిన సందర్భంగా స్వయంగా విద్యాశాఖ మాత్యులు సబితా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »