Tag Archives: nizamabad

తుది జాబితాలో తప్పిదాలకు ఆస్కారం ఉండకూడదు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తుది ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ పరిశీలన జరపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. డబుల్‌ ఎంట్రీ, బోగస్‌ పేర్లు లేకుండా జాబితాను బీ.ఎల్‌.ఓ మొదలుకుని ఈ.ఆర్‌.ఓ స్థాయి వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు సైతం జాబితా నుండి గల్లంతు కాకుండా జాగ్రత్తలు …

Read More »

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా కాసర్ల

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో అందించే ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుకు నిజామాబాద్‌కు చెందిన తెలుగు పండితులు డా.కాసర్ల నరేశ్‌ రావు ఎంపికైనారు. ఉపాధ్యాయ దినోత్సవమైన 5 సెప్టెంబరు రోజున డాక్టర్‌ కాసర్ల ఈ అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకో నున్నారు. కాగా కాసర్ల నరేశ్‌ రావు గుండారం ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నారు.

Read More »

ఇంటింటికి తిరుగుతూ వంద శాతం ఓటరు నమోదు జరిపించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా బూత్‌ లెవెల్‌ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది చొరవ చూపాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. వారం రోజుల పాటు ప్రతి నివాస ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ, ఓటరు జాబితాలో పేర్లు లేని వారిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని అన్నారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, …

Read More »

నేటి పంచాంగం

శనివారం, సెప్టెంబరు 2, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహళ పక్షం తిథి : తదియ రాత్రి 1.15 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర సాయంత్రం 5.22 వరకుయోగం : శూలం మధ్యాహ్నం 2.45 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 2.18 వరకుతదుపరి విష్ఠి రా1.15 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 4.45 నుండిదుర్ముహూర్తము : ఉదయం 5.48 …

Read More »

టెట్‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15న నిర్వహించనున్న టెట్‌ – 2023 (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 15 న టెట్‌ పరీక్ష కొనసాగనున్న నేపథ్యంలో …

Read More »

17వ రోజుకు చేరిన ఏఎన్‌ఎంల సమ్మె

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఎన్‌ఎంల 17వ రోజు సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్‌ కొత్త కలెక్టర్‌ ఆఫీస్‌ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య, యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు భారతమ్మ మాట్లాడుతూ 17 రోజులుగా సమ్మె చేస్తా ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాల బారిన …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, సెప్టెంబరు 1,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహళ పక్షం తిథి : విదియ తెల్లవారుజాము 3.21 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర సాయంత్రం 6.48 వరకుయోగం : ధృతి సాయంత్రం 5.40 వరకుకరణం : తైతుల సాయంత్రం 6.30 వరకు తదుపరి గరజి తెల్లవారుజాము 3.21 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 3.49 – 5.20దుర్ముహూర్తము : …

Read More »

మాదకద్రవ్యాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ భవిష్యత్తుకు కీలకమైన యువతను, విద్యార్థులను నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్‌ అధ్యక్షతన గురువారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై …

Read More »

నేటి పంచాంగం

గురువారం, ఆగష్టు 31, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి ఉదయం 8.03 వరకు తదుపరి బహుళ పాడ్యమి తెల్లవారుజాము 5.39వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శతభిషం రాత్రి 8.22 వరకుయోగం : సుకర్మ రాత్రి 8.39 వరకుకరణం : బవ ఉదయం 8.03 వరకు తదుపరి బాలువ రాత్రి 6.50 వరకు ఆ …

Read More »

తెలంగాణ విద్యార్థి పరిషత్‌ అధ్వర్యంలో రక్షాబంధన్‌

నిజామాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణా విద్యార్ధి పరిషత్‌ నిజామాబాద్‌ నగర అధ్యక్షుడు అఖిల్‌ అధ్వర్యంలో నగరంలోని సత్య ఒకేషనల్‌ కళాశాలలో రాఖీ పండగ పురస్కరించుకొని విద్యార్థినీలతో తెలంగాణ విద్యార్థి పరిషత్‌ నాయకులు రాఖీ కట్టించుకొని రక్షాబంధన్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా నగర అధ్యక్షుడు అఖిల్‌ మాట్లాడుతూ విద్యార్థినీలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళల రక్షణకోసం తెలంగాణ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »