నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తుది ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. ముఖ్యంగా డబుల్ ఎంట్రీ, బోగస్ పేర్లు లేకుండా జాబితాను బీ.ఎల్.ఓ మొదలుకుని ఈ.ఆర్.ఓ స్థాయి వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సి.ఈ.ఓ …
Read More »మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రాధాన్యత
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి మండల కేంద్రంలో రూ. 6.70 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల భవనాన్ని శనివారం రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అట్టహాసపు …
Read More »కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు-చేర్పులకు అవకాశం కల్పిస్తూ పోలింగ్ బూత్‌ల పరిధిలో ఈ నెల 26, 27 తేదీలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం పలు పోలింగ్ బూత్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోస్రా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, చందూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో గల పోలింగ్ …
Read More »నేటి పంచాంగం
శనివారం, ఆగష్టు 26, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి రాత్రి 7.02 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మూల తెల్లవారుజామున 3.47 వరకుయోగం : విష్కంభం మద్యాహ్నం 1.49 వరకుకరణం : తైతుల ఉదయం 7.44 వరకు తదుపరి గరజి రాత్రి 7.02 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.19 – 1.52, …
Read More »ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రావణమాసం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో టీటీడీ కల్యాణ మండపంలో శుక్రవారం సామూహిక విశేష వరలక్ష్మీ వ్రత పూజ కుంకుమార్చన కథ పారాయణంతో కార్యక్రమాలు మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు పూజా సామాగ్రిని కానుకలను పరిషత్ ప్రతినిధులు అందించారు. కార్యక్రమంలో ధర్మ ప్రచార పరిషత్ ప్రతినిధులు మూడ …
Read More »మాజీ ఎమ్మెల్యే వంశిచంద్ రెడ్డిని కలిసిన రాజారెడ్డి
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియామకమై మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఎఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఘన్ రాజు, పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ మాజీ ఇంచార్జ్ …
Read More »పోలింగ్ బూత్ ల పరిధిలో ప్రత్యేక శిబిరాలు
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు-చేర్పులకు అవకాశం కల్పిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్‌ల పరిధిలో ఈ నెల 26, 27 తేదీలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బీ.ఎల్.ఓలతో పాటు ఎన్నికల అధికారులు అందుబాటులో ఉంటారని, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, ఆగష్టు 25, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి రాత్రి 8.26 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ తెల్లవారుజాము 4.35 వరకుయోగం : వైధృతి మధ్యాహ్నం 3.56 వరకుకరణం : బాలువ ఉదయం 8.58 వరకు తదుపరి కౌలువ రాత్రి 8.26 వరకు వర్జ్యం : ఉదయం 10.31 – 12.06దుర్ముహూర్తము …
Read More »ముగిసిన గాంధీ చిత్ర ప్రదర్శన
నిజామాబాద్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో గాంధీ చలన చిత్రాన్ని 17,173 మంది విద్యార్థినీ, విద్యార్థులు వీక్షించారని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచనలు, మార్గనిర్దేశకంలో జిల్లాలో ఈ నెల 17 నుండి 24 వ తేదీ వరకు జిల్లాలోని 9 సినిమా ధియేటర్లు నిజామాబాద్‌లోని విజయ్ థియేటర్, ఉషా ప్రసాద్ స్క్రీన్-3, …
Read More »పాలిటెక్నిక్, సి.ఎం.సి కళాశాలలను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్ కళాశాలలు, డిచ్పల్లి లోని సి.ఎం.సి కళాశాలలను పరిశీలించారు. త్వరలో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎం లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటికి అనువుగా ఉన్న కేంద్రాలు ఏవీ …
Read More »