Tag Archives: nizamsagar

నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో యువకుడి గల్లంతు

బాన్సువాడ, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని కృష్ణనగర్‌ తండా సమీపంలోని నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో హన్మజీపేట్‌ గ్రామపంచాయతీ పరిధిలోని సంగ్రామ్‌ నాయక్‌ తండ గ్రామానికి చెందిన సిద్ధార్థ, రాజేష్‌ శనివారం పని నిమిత్తం బాన్సువాడకు వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. కాలకృత్యాలు తీర్చుకొని కాల్వలో కాళ్లు చేతులు కడుక్కునేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు సిద్ధార్థ, రాజేష్‌ ప్రధాన కాలువలో కొట్టుకుపోతుండగా స్థానికులు గమనించి రాజేష్‌ను కాపాడినప్పటికీ …

Read More »

సంక్రాంతి తరువాత రైతు భరోసా విడుదల చేస్తాం…

నిజాంసాగర్‌, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వస్తుందో అలాంటి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాం సాగర్‌ ప్రాజెక్ట్‌ ప్రధాన కాలువ ద్వారా రెండవ పంటలకు నీటిని ఆయన విడుదల చేసారు. ఈ సందర్భంగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు ను ఆయన సందర్శించారు. విశ్రాంతి భవనం …

Read More »

నిజాం సాగర్‌కు పూర్వ వైభవం తీసుకువస్తాం

నిజాంసాగర్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వందేండ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్‌ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక ప్రమోషన్‌లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు నిజాంసాగర్‌ ప్రాజెక్టు ను సందర్శించారు. నిజాంసాగర్‌లో ప్రాచీన కట్టడాలైన గోల్‌బంగ్లా, గుల్‌గస్త్‌ బంగ్లా, వీఐపీ గార్డెన్‌, స్విమ్మింగ్‌ పూల్‌, తదితర కట్టడాలను జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో …

Read More »

భారత రాజ్యాంగం గురించి ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలి

నిజాంసాగర్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగం గురించి ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా జవహర్‌ నవోదయ విద్యాలయం మంగళవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నవంబర్‌ 26న మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగ కమిటీలో ఉండి రచించారని తెలిపారు. …

Read More »

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు చేసిన వరి పంటను కేటాయించిన రైస్‌ మిల్లులకు తరలించాలని, ట్యాబ్‌ ఎంట్రీ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం నిజాంసాగర్‌ మండలం వెల్గనూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్‌ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన దొడ్డు ధాన్యంను కాంటా చేసిన తర్వాత సంబంధిత రైస్‌ మిల్లులకు తరలించడం …

Read More »

ఎకో టూరిజం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ డ్యాం వద్ద ఎకో టూరిజం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ డ్యామ్‌ వద్ద ఎకో టూరిజం పనులకు సంబంధించిన వాటిపై టూరిజం అసిస్టెంట్‌ మేనేజర్‌ రాజు, కన్సల్టెంట్‌ హరి లతో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతిపాదించిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ అన్నారు. …

Read More »

నిజాంసాగర్‌ ఆయకట్టు రైతాంగానికి నీటి విడుదల..

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు తమ పంట పొలాలను సాగు చేసుకోవడానికి నిజాంసాగర్‌ ఆయకట్టు రైతులకు సాగునీటి కొరత రాకుండా ఉండేందుకు ముందు జరగా మంగళవారం నుండి నీటిని విడుదల చేస్తున్నట్లు సాగునీటి అధికారులు ఒక ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ రైతాంగం ముందస్తుగా వరి నాట్లు వేసుకుంటుందని అందులో భాగంగా …

Read More »

నిజాంసాగర్‌ ఎస్‌ఐకి సన్మానం

నిజాంసాగర్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నూతన ఎస్‌ఐ రాజశేఖర్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మాజీ సీడీసీ చైర్మన్‌ దుర్గరెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మనోహర్‌, నాయకులు శ్రీకాంత్‌ రెడ్డి, యటకారి నారాయణ, దేవేందర్‌ రెడ్డి, మర్పల్లి రాములు, విజయ్‌ తదితరులు ఉన్నారు.

Read More »

అభ్యంతరలుంటే తెలపండి…

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా ఏర్పాటు చేస్తున్న మొహ్మద్‌ నగర్‌ మండలం ఏర్పాటుకు అభ్యంతరాలు, సూచనలు అందజేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ రెవెన్యు డివిజన్‌లోని నిజాంసాగర్‌ మండలం నుండి 18 గ్రామాలతో మొహమ్మద్‌ నగర్‌ నూతన మండలం ఏర్పాటుకు ఈ నెల 28 న ప్రాథమిక గజిట్‌ నోటిఫికేషన్‌ …

Read More »

జవహార్‌ నవోదయలో ప్రవేశానికి గడువు పొడగింపు

నిజాంసాగర్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ జవహార్‌ నవోదయ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికై దరఖాస్తు చేసుకొనుటకు ప్రభుత్వం ఈ నెల 28 వరకు గడవు పొడగించిందని జిల్లా విద్యాశాఖాధికారి రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశం పొందగోరు అభ్యర్థులు సంబంధిత వెబ్‌ సైట్‌ నందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »