Tag Archives: PDSU

ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌ ఇంటర్‌ కాలేజీలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్‌ విద్యాధికారి (డిఐఇవో) కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్‌ కల్పన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం …

Read More »

అక్రమ నియామకాలు రద్దుచేయాలని ఫిర్యాదు

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ టీచింగ్‌ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని గురువారం హైదరాబాద్‌లో కమీషనర్‌ నవీన్‌ మిట్టల్‌కి పి.డి.ఎస్‌.యు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పి.డి.ఎస్‌.యు రాష్ట్ర నాయకులు నరేందర్‌ మాట్లాడుతూ టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ అక్రమ నియామకాలను రద్దు చేస్తున్నట్టు గత పాలకమండలి సమావేశం ప్రకటించిందన్నారు. ఈ నేపథ్యంలోనే 2019 లో నిబంధనలకు విరుద్ధంగా నియామకమైన …

Read More »

పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా సీహెచ్‌.కల్పన

నిజామాబాద్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిడిఎస్‌యు రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు, రాష్ట్ర జనరల్‌ కౌన్సిల్‌ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల 12,13,14 తేదీల్లో వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులతో విజయవంతంగా జరిగినట్టు పిడిఎస్‌యు ప్రతినిధులు పేర్కొన్నారు. జనరల్‌ కౌన్సిల్‌లో పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, రాష్ట్ర కమిటీలో నిజామాబాద్‌ జిల్లానుండి ముగ్గురికి ప్రాతినిద్యం లభించిందని తెలిపారు. జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్న …

Read More »

పిడిఎస్‌యు రాష్ట్ర జనరల్‌ కౌన్సిల్‌ను జయప్రదం చేయండి

నిజామాబాద్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్‌.యు) రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులు, జనరల్‌ కౌన్సిల్‌ను జయప్రదం చేయాలని పిడిఎస్‌యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్‌, కోటగల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు కల్పన, జిల్లా ప్రధాన …

Read More »

ఉన్నత విద్యా మండలి కమిషనర్‌ను కలిసిన పి.డి.ఎస్‌.యు నాయకులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో 2017 తర్వాత జరిగిన టీచింగ్‌ (పార్ట్‌ టైం లెక్చరర్‌, అకడమిక్‌ కన్సల్టెంట్‌), నాన్‌-టీచింగ్‌ అక్రమ నియామకాలను రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌కి పి.డి.ఎస్‌.యు గా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పి.డి.ఎస్‌.యు రాష్ట్ర నాయకుడు ఎం.నరేందర్‌ మాట్లాడుతూ 2017 లో జరిగిన అవుట్‌సోర్సింగ్‌ నియామకాలు రద్దు చేసిన తర్వాత అప్పటి …

Read More »

భగత్‌సింగ్‌ ఆశయాలను కొనసాగిద్దాం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత స్వాతంత్రోద్యమ యువ కెరటం కామ్రేడ్‌ భగత్‌ సింగ్‌ జయంతి సందర్భంగా కోటగల్లీలో గల భగత్‌ సింగ్‌ విగ్రహానికి పి.డి.ఎస్‌.యు, పీవోడబ్ల్యూ, పీవైఎల్‌, ఐ.ఎఫ్‌.టీ.యు సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోదావరి, సంధ్యారాణి మాట్లాడుతూ కామ్రేడ్‌ భగత్‌ సింగ్‌ దోపిడీ పీడనలు …

Read More »

మౌలిక సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో సిసి రోడ్లు, స్వచ్ఛమైన తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కబ్జాల నుండి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తూ ఐఎఫ్‌టియు, పివోడబ్ల్యు, పిడిఎస్‌యు, పివైఎల్‌ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్‌కి వినతి పత్రం …

Read More »

ఫీజుల దోపిడీ నియంత్రించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫీజుల దోపిడీ నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) జిల్లా విద్యాధికారి (డిఇవో)కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సీ.హెచ్‌ కల్పన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 1 నుండి తరగతులు ప్రారంభమౌవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులైన స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు …

Read More »

స్వరాష్ట్రంలో అక్రమ అరెస్టులా…?

బోధన్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు వుండవు అని చెప్పిన కేసీఆర్‌ పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే అరెస్టులా అని సీపీఐ (ఎం ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి మల్లేష్‌ మండిపడ్డారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలంటూ మంత్రుల ఇళ్ల ముట్టడి చేయాలని విధ్యార్థి, యువజన సంఘాల …

Read More »

ఉద్యోగాలు భర్తీచేయాలి… నిరుద్యోగ భృతి చెల్లించాలి

వేల్పూర్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిడిఎస్‌యు, పివైఎల్‌ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండి చేస్తూ, వేల్పుర్‌ మండల కేంద్రంలోని జిల్లా మంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పిడిఎస్‌యు, పివైఎల్‌ నాయకులను అక్రమంగా ఆరెస్టు చేసి వేల్పురు పోలిస్‌ స్టేషన్‌కు తరలించారని సంఘాల ప్రతినిధులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »