Tag Archives: renjal

ప్రమాదవశత్తు గోదావరిలోపడి ఒకరి మృతి

రెంజల్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కందకుర్తి గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఒకరు మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్‌ మండలం ఆచన్‌ పల్లి గ్రామానికి చెందిన మోరే భీంరావు (55) అనే వ్యక్తి నిత్యం చేపల వేటకోసం కందకుర్తి గోదావరి నదికి వచ్చి చేపలు పట్టి జీవనం గడిపేవాడు. …

Read More »

వార్డు సభ్యురాలు మృతికి సంతాపం

రెంజల్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని పదవ వార్డు సభ్యురాలు జాకిర మృతి చెందడంతో ఆమె మృతికి గురువారం సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ తోపాటు పంచాయితీ పాలకవర్గ సభ్యులు గ్రామపంచాయతీలో మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ మాట్లాడుతూ పంచాయతీ పాలకవర్గంలో ఒక సభ్యురాలిని కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. పంచాయతీ అభివృద్ధికి ఎంతగానో …

Read More »

30న బోధన్‌లో మహనీయుల జయంతోత్సవ సభ

రెంజల్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 30న బోధన్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో జరిగే మహాత్మ జ్యోతిరావు పూలే, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రావ్‌ జయంతి ఉత్సవాల సభను విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్‌ డివిజన్‌ కన్వీనర్‌ నీరడి ఈశ్వర్‌, ఉపాధ్యక్షుడు నీరడి రవికుమార్‌, ఎస్సీ, ఎస్టీ …

Read More »

ఘనంగా రంజాన్‌ వేడుకలు

రెంజల్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంతోపాటు సాటాపూర్‌, బొర్గం, తాడ్‌ బిలోలి, వీరన్నగుట్ట, నీలా, పేపర్మిల్‌, కందకుర్తి గ్రామాల్లో శనివారం ముస్లిం సోదరులు రంజాన్‌ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల నుండి ఉపవాస దీక్షలు చేపట్టిన మైనార్టీలు నెలమాసం ముగియడంతో శనివారం ఉదయం ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ సందర్భంగా ఎటువంటి …

Read More »

రైతులు అధైర్యపడొద్దు

రెంజల్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని ఏపిడి మధుసూదన్‌ అన్నారు.శుక్రవారం మండలంలోని బొర్గం, అంబేద్కర్‌ నగర్‌ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని డీపీఎం సాయిలు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత ఉందని రైతులు అపోహ పడకూడదని లారీల కొరత …

Read More »

రంజాన్‌ కానుకలు అందజేత

రెంజల్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పండుగ సందర్భంగా రంజాన్‌ కానుకలను శుక్రవారం రెంజల్‌ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో సర్పంచ్‌ ల ఫోరం మండల అధ్యక్షుడు, సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌, మైనార్టీ జిల్లా నాయకుడు రఫిక్‌ తో కలిసి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద, ధనిక తేడా లేకుండా అందరూ కలిసి రంజాన్‌ పండుగను జరుపుకోవాలని ప్రతి సంవత్సరం మాదిరిగానే …

Read More »

ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌ అడుగుజాడలో పయనించాలి

రెంజల్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు అంబేడ్కర్‌ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని సర్పంచ్‌ మధురబాయి అన్నారు. గురువారం మండలంలోని అంబేద్కర్‌ నగర్‌ గ్రామంలో విశ్వ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ప్రధాన వీధుల గుండా నీలీ జెండాలతో …

Read More »

సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడుగా రమేష్‌ కుమార్‌

రెంజల్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా రెంజల్‌ గ్రామ సర్పంచ్‌ మర్లషికారి రమేష్‌ కుమార్‌ను మండల సర్పంచ్‌లు గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి మండల సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.అనంతరం మండల సర్పంచ్‌లు శాలువా పులమాలలతో …

Read More »

సర్పంచ్‌ల సమస్యలు పరిష్కరించాలి

రెంజల్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత సంవత్సరం కాలం నుంచి గ్రామ పంచాయతీకి ప్రతి నెల రావాల్సిన పంచాయతీ నిధులు సంవత్సరం నుండి రావడంలేదని నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రెంజల్‌ మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు మర్లషికారి రమేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గురువారం రెంజల్‌ మండల సర్పంచ్‌ పోరంతో పాటు జిల్లా సర్పంచ్‌ల ఫోరమ్‌ అధ్యక్షుడు ఏటీఎస్‌ శ్రీనివాస్‌తో కలిసి కలెక్టర్‌ …

Read More »

రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

రెంజల్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల ప్రయోజనం కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని తము పండిరచిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మండల ప్రజా పరిషత్‌ ఉపాధ్యక్షుడు క్యాతం యోగేష్‌ అన్నారు. మంగళవారం మండలంలోని నీలా గ్రామంలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపిఎం చిన్నయ్య స్థానిక సర్పంచ్‌ లలిత …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »