నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఉదయం 9.00 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రిపబ్లిక్ డే వేడుకకు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని …
Read More »ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలి..
కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 26 న గణతంత్ర వేడుకలను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా నిర్వహించుటకు అధికారులకు కేటాయించిన విధులను సకాలంలో ఏర్పాటుచేయాలని అన్నారు. స్టేజి, అలంకరణ, ముఖ్య …
Read More »గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల …
Read More »బోధన్ బార్ అసోసియేషన్ జట్టుపై నిజామాబాద్ విజయం
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటిలో బోధన్ బార్ అసోసియేషన్ క్రికెట్ జట్టుపై నిజామాబాద్ బార్ అసోసియేషన్ క్రికెట్ జట్టు విజయం సాధించింది. బోధన్ జట్టు సమ్మయ్య నాయకత్వంలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బోధన్ ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి మొత్తం …
Read More »అవార్డుల కొరకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సామాజిక, సేవా రంగం, సాహిత్య రంగం, క్రీడా రంగంలో విశిష్ట సేవలందించిన అభ్యర్థుల నుండి పద్మ అవార్డుల కొరకు ప్రభుత్వానికి సిఫారసు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు 800 పదాలకు మించకుండా తాము చేసిన కార్యక్రమాల గురించి …
Read More »సమీకృత కార్యాలయాల సముదాయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి కీలకోపన్యాసం చేశారు. జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ …
Read More »జిల్లా అభివృద్దికి అధికారులు తోడ్పాటునందించాలి
కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో మహనీయులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో …
Read More »ఇందూరు వైభవాన్ని చాటేలా కళాభారతి నిర్మాణం
50 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన ‘‘కళాభారతి’’ ఆడిటోరియం తుది నమూనాను గురువారం ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంపిక చేశారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడిరచారు. ఇందూరు వైభవాన్ని చాటేలా, ఇక్కడి సాంస్కృతిక, సాంప్రదాయాలు ఉట్టి పడేలా కళాభారతి నిర్మాణం ఉండబోతుందని …
Read More »రిపబ్లిక్ డే కు ముస్తాబైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం పరిశీలించారు. ఉదయం 10 గంటలకు జిల్లా పాలనాధికారి పతాకావిష్కరణ గావించనుండగా, ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గోనున్నారు. సమీకృత కార్యాలయాల సముదాయం అందుబాటులోకి వచ్చిన అనంతరం తొలిసారిగా జాతీయ పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి …
Read More »బాసరకు ప్రత్యేక బస్సులు
బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వసంత పంచమి సందర్భంగా గురువారం బాన్సువాడ నుండి బాసర సరస్వతి పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపిస్తున్నామని ఆర్టీసీ డిపో మేనేజర్ సదాశివ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు బోధన్ మీదుగా, నిజామాబాద్ మీదుగా మూడు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Read More »