Tag Archives: rotary club

తొర్లికొండ పాఠశాలలో నిర్మాణాలకు భూమిపూజ

జక్రాన్‌పల్లి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తొర్లికొండలో ఆర్మూర్‌ రోటరీ ఆధ్వర్యంలో టాయిలెట్‌ బ్లాక్‌ ప్రారంభ భూమి పూజ కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్‌ పల్లి మండల విద్యాధికారి మూడేళ్ల శ్రీనివాస్‌ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆర్మూర్‌ రోటరీ అధ్యక్షులు రాజనీష్‌ కిరాడ్‌ టాయిలెట్‌ బ్లాక్‌ ప్రారంభ భూమి పూజ నిర్వహించి మాట్లాడారు. టాయిలెట్‌ బ్లాక్‌ ప్రాజెక్టు …

Read More »

నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణి

ఖమ్మం, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖమ్మం గట్టయ్య సెంటర్‌ రోటరీ లింబ్‌ సెంటర్‌లో డిస్ట్రిక్ట్‌ ఎన్నారై ఫౌండేషన్‌, ఖమ్మం రోటరీ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో 23 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదాలు, 10 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 6 వికలాంగులకు ట్రై సైకిళ్ళు ఉచితంగా పంపిణీ చేశారు. వీటి విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా …

Read More »

రోటరీ క్లబ్‌ సామాజిక సేవ అభినందనీయం

కామరెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో సామాజిక సేవలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం స్థానిక రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 25 మంది బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రోటరీ వరంగల్‌ సెంట్రల్‌ క్లబ్‌ రోటేరియన్‌ జూలూరు కృష్ణమూర్తి సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినులకు …

Read More »

10న కృత్రిమ కాళ్ళు ఉచితంగా అందజేసే శిబిరం…

నిజామాబాద్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ 10వ తేదీ మంగళవారం రోజు ఉదయం 10:30 గంటలకు రోటరీ కృత్రిమ అవయవ కేంద్రం బర్కత్‌పురా నిజామాబాద్‌లో నిర్వహించనున్నట్టు రోటరీ అధ్యక్షులు రజనీష్‌ కిరాడ్‌ అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏదేని కారణాలతో యాక్సిడెంట్లో కాళ్లు కోల్పోయిన వాళ్లు ఇట్టి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, శిబిరానికి వచ్చిన వారి కాళ్ళ కొలతలు తీసుకొని పంపించబడును. వారం తర్వాత …

Read More »

రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో వంటపాత్రల వితరణ

వేల్పూర్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం పడగల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు ఆర్మూర్‌ రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో డిజిటల్‌ బోర్డులు, వంటపాత్రలు వితరణ చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ గవర్నర్‌ కె. ప్రభాకర్‌ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ సేవలు అందిస్తున్నామని తెలిపారు. అసిస్టెంట్‌ గవర్నర్‌ రంజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ, పిల్లలు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని …

Read More »

రోటరీ క్లబ్‌ ఆర్మూరు ఆదర్శ్‌కు అవార్డుల పంట

ఆర్మూర్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2020- 21 సంవత్సరంలో చేసిన సేవలకు గుర్తింపుగా రోటరీ ఆదర్శ్‌ 8 అవార్డులు పొందడం జరిగింది. కార్యక్రమం హైదరాబాద్‌ లో ఎల్‌. వి. కన్వెన్షన్‌లో జరిగింది. రోటరీ డిస్టిక్‌ గవర్నర్‌ హనుమంత్‌ రెడ్డి చేతుల మీదుగా అవార్డులు పొందారు. కార్యక్రమంలో రోటరీ ఆదర్శ్‌ అధ్యక్షులు జక్కుల రాధా కిషన్‌, కార్యదర్శి నందు పవర్‌, ప్రస్తుత కార్యదర్శి అక్షింతల నరేందర్‌ …

Read More »

నిరుపేద వివాహానికి రోటరీ క్లబ్‌ ఆర్థిక సాయం

ఆర్మూర్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ఆర్మూర్‌ ఆధ్వర్యంలో రోటరీ సభ్యులు గోనె శ్రీధర్‌ ఆర్థిక సహకారంతో మునిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో తండ్రి లేని కూతురి వివాహానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ఆర్మూర్‌ అధ్యక్షులు విద్య ప్రవీణ్‌ పవర్‌ మాట్లాడుతూ ఇంటికి పెద్ద దిక్కైన తండ్రిని …

Read More »

ఆక్సిజన్ జనరేట్ చేసుకోవడం వల్ల మరింత నమ్మకం

నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఆక్సిజన్ మన దగ్గరే జనరేట్ చేసుకుంటే పేషెంట్లకు మరింత నమ్మకంగా ట్రీట్మెంట్ ఇవ్వవచ్చని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో సిఐఐ, టిసిఎస్‌, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా జనరల్ ఆసుప‌త్రికి 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను విరాళంగా కలెక్టర్‌కు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా వైరస్ నేపథ్యంలో ఆక్సిజన్ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »